Sunday 16 October 2011

వెల్వెట్ వర్క్

ఇంటి చూసి ఇల్లాలిని చూడమన్నారు మన పెద్దలు. ఇంటిని పొందికగా తీర్చి దిద్దటానికి మన ఆడవాళ్ళం ఎంత గానో శ్రమిస్తాం. ఏ షాపింగ్ కో వెళ్ళినా మన ద్రుష్టి ఇంటి మీదే ఉంటుంది. మంచాల మీద దుపట్లని, సోఫా కవర్ అని ఇలా ఏదో ఒకటి కొంటునే ఉంటాం. 

ఈ మధ్యన ఒక ప్రదర్శనలో నేను వెల్వెట్ తో చేసిన, కుషన్స్, కుషన్ కవర్స్,  దివాన్ సెట్,  దిండు గలేబులు, మంచం మీద పర్చుకునే దుపట్లు, రోజాయి వంటివి చూసాను. మీరు చూడండి: 
వెనక ఉన్న మారున్ రంగు ఫై బంగారు ప్రింట్ గల దుప్పటి, సెల్ఫ్ డిజైన్ ఉన్న దుప్పటి, ఎర్రటి వెల్వెట్ దివాన్ సెట్, చిలకాకుపచ్చ రంగు లో పుష్పం ఆకారం లో ఉన్న దిండు 
నిమ్మ పండు రంగులో పుష్పం ఆకారం లో ఉన్న దిండు, ఎరుపు రంగు దివాన్ సెట్ 
చతురస్రాకారం లో ఉన్న కుషన్ కవర్స్, బాలిసుల  కవర్స్ గల దివాన్ సెట్ మారున్ రంగులో    
రంగు రంగుల కుశిఒన్స వివిధ ఆకారాలలో 

ఇవి తయారు చేసిన వారి నైపుణ్యం చూసి మనం మెచ్చుకోకుండా ఉండలేము. 


మీ...అనామిక....

No comments: