Thursday 8 September 2011

ఆత్మా-పరమాత్మా



ఆత్మా-పరమాత్మా  అనే శిర్షికలో ఆధ్యాత్మిక విషయాలు, పురాణాలు, వ్రతాలు, పూజలు, మంత్రాలూ, స్తోత్రాలు, శ్లోకాలు, ఆచార వ్యవహారాలూ, కధలు, నీతులు, సుభాషితాలు, ఋషులు మునులు, మహాత్ముల విశేషాలు , వారు మనకి వదిలి వెళ్ళిన అపురూపమైన, అమూల్యమైన ఆధ్యాత్మిక సంపద , వీటన్నిటి  వెనక ఉన్న Scientific Reasoning, ఇలా ఎన్నో ఎన్నెన్నో... 

నాకు మా అమ్మమ్మ చాల చిన్ననాటే రామాయణ, మహాభారత, భాగవత కథలు, విశేషాలు చక్కగా చెప్పి అందులో రుచి, జిఙ్యాస కలిపించింది. ఇలా చిన్ననాటి నుండి ఉన్న తృష్ణ అంత చదివినా, అన్ని విన్న,  ఎంత  నేర్చుకున్న ఇంకా తెలుసుకోవాలనే  ఉంటుంది. తరువాత నా అదృష్టం కొద్ది మహానుభావులు, గురువులతో, ఙ్ఞానులతో  ఏర్పడిన పరిచయాలు నాకు ఆధ్యాత్మికంగా అంతో ఉన్నతిని ప్రసాదించాయి. ఒక్కొక్కసారి ప్రయాణాలలో అపరిచితులైన తోటి ప్రయాణికుల నుంచికుడా నేను ఎంతో విలువైన విషయాలు నేర్చుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. 

నాకు తెలిసిన ఈ  కొద్దిపాటి ఙ్ఞానం  మీతో  పంచుకోవాలని నా ఈ ప్రయత్నం....మీరు మెచ్చి ఆదరిస్తారని ఆశ...

In "Atma-Paramatma" I would like to share with you, what ever little knowledge I have about, spirituality, vedic sciences, puranas, vratha-pooja, slokas, mantras, stotras, customs and traditions, great sayings, our great rishis, munis and saints the knowledge they left behind, the scientific reasoning behind our Vedic knowlede and customs and traditions and many more. 

Hope you like my posts and encourage me.

మీ...అనామిక....

No comments: