Tuesday 31 March 2020

సామెతలు-1

సామెతలు అంటే లోకోక్తులు- జనాదరణ పొందిన పద బంధాలు  కానీ వాక్యాలు కాని ఉంటాయి. సామెత అనే పదం 'సామ్యత' అనే పదం నుండి పుట్టిందంటారు. సామ్యత అంటే పోలిక లేదా ఉదాహరణ. 

ఇవి సరళమైన భాషలో, ప్రాస కలిగి త్వరగా గుర్తు పెట్టొకోగలిగినవి.  ఇవి బాగా ప్రాచుర్యం పొంది మరల మరల వాడేవి. 

పెద్దలు తమ అనుభవాన్ని రంగరించి క్లుప్తంగా కొద్ది మాటలలో చెప్పిన నీతులు కానీ, సూక్తులు కానీ లేదా హాస్యం మిళితమై ఉంటాయి. కొన్ని సామెతలు పురాణాలనుంచి కానీ, కథల నుంచి కానీ, దేశ/ప్రదేశ చరిత్ర నుంచి పుట్టినవి . 

సామెతలలో ఎన్ని రకాలో. నాకు వీలైనంతవరకు నేను సేకరించి ఇక్కడ పోస్ట్ చేస్తాను. 

కొన్ని సామెతలు పదాలు లేదా వాక్యాలు వేరైనా భావం ఒకటే ఉంటుంది. లేదా మాండలికాలలో తేడా ఉండవచ్చు. అంటే ఒకో ప్రాంతంలో ఒకో రకంగా అంటూ  ఉంటారు. 

సరే మరి రోజుకొక సామెత నేర్చుకుందామా మనం? 

ఈ  కఠిన సమయంలో మనం ఇంట్లోనే ఉండాలి. బోర్ కొట్టకుండా ఇలా మన భాషను పెంపొందించుకుందామా? 

కొన్ని మనకు తెలిసినవే ఉండొచ్చు. కొన్ని తెలియనివి ఉండవచ్చు. 
సామెతలు-1


మీ...అనామిక....

No comments: