Thursday, 4 January 2018

హలో 2018



మొదటగా మీరందరూ నన్ను క్షమించాలి. 

ధనుర్మాసం ముగ్గులకోసం మీరు ఎదురుచూస్తారని తెలుసు. కానీ ఆరోగ్యం బాగుండక నేను టపాలు వ్రాయలేక పోయాను. అసలు ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేను. టైప్ చేయాలంటే చాలా కష్టం అవుతోంది. 

2017 అంతా ఎదో ఒక కష్టం వెంటాడింది, అనారోగ్యం, పరిస్థితులు బాగుండకపోవటం, ఇలా ఎదో ఒకటి. ఎంత ప్రయత్నించినా టపాలు వ్రాయలేక పోయాను. మిమ్ములందరిని చాలా మిస్ అయ్యాను. 

2018 నూతన సంవత్సరంలో ఎన్నో ఆశలు . అందులో ఒక ఆశ - మళ్ళి ఇదివరకటిలా టపాలు వ్రాయాలని.  కొత్త  సంవత్సరం ఆరంభంలో అందరిలాగే  నేను చాలా కొత్త తీర్మానాలు చేసుకుంటాను. ఇవి చేయాలి, ఇవి చేయకూడదు అని. కానీ వాటిలో ఎన్నింటిని నేను పాటించగలను అనేది చెప్పలేను. 

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. టపాలు వ్రాయటానికి ప్రయత్నం చేస్తాను. మీతో చాలా విషయాలు పంచుకోవాలని ఉంటుంది. కానీ ఎంతవరకు ఆరోగ్యం సహకరిస్తుందో చెప్పలేను. 

నా బ్లాగ్ ను మీరు చూస్తూ ఉండండి. 

మీ...అనామిక....

No comments: