Thursday, 10 September 2015

గురు స్తోత్రం


మానవుని జీవితంలో పుట్టిన దగ్గర నుండి నిరంతరం, ప్రతినిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. మొదటి గురువు తల్లి. తరువాత తండ్రి. అటుతరువాత, మనకు విద్యాబ్యాసం చేసిన గురువులు, మన బంధువులు, తోటి వారు, సమాజం ఇలా ఎంతో మంది నుండి మనం నేర్చుకుంటోనే ఉంటాం. 

మన భారతీయ సంస్కృతి లో తల్లి-తండ్రుల తరువాత గురువుదే ముఖ్య స్థానం. మనకు విద్య నేర్పించి మన కాళ్ళ పైన మనం నిలబడేటట్లు చేసిన గురువులైనా , ఆధ్యాత్మిక ఉన్నతికి తోడ్పడిన గురువులైనా, మన తల్లి-తండ్రులు, మన హితమును కోరే వారైనా మనకు పూజ్యులే కదా. 

మన గురువులను గౌరవించడం, వారిని స్మరించడం మనకు శ్రేయస్కరం. గురు స్తోత్రాలు చాలా ఉన్నాయి. ఈ టపా లో మీకోసం ఒకటి.
మీకు ఈ శీర్షిక  నచ్చుతోందని ఆశిస్తున్నాను. 

మీ...అనామిక....

No comments: