ఎంత చక్కని సుత్రాలో ఇవి. నాకు నచ్చిన వాటిలో ఇది ఒకటి.
1. మనం చేసిన తప్పులు ఒప్పుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. ఎదుటి వారి ముందర మనం చేసిన తప్పులు ఒప్పుకోవటమంటే చాలా కష్టం. మన అహం అడ్డు వస్తుంది. ఇంక క్షమాపణలు కోరుకోవటం అంటే ఇంకా కష్టం. అందుకేనండి చేసిన తప్పులను ఒప్పుకుని క్షమాపణలు కోరుకునేవారు అందరికంటే ధర్యవంతులు అని అన్నారు.
అసలు చేసిన తప్పులను ఒప్పుకుని క్షమాపణలు చెప్పుకుంటే, గుండె తేలిక పడుతుంది. లేదా జీవితాంతము మనం శాంతిని పొందలేము.
2. & 3. ఎదుటి వారి తప్పులను/కీడుని మనం గుర్తించినప్పుడు, ఆ తప్పుల లేదా కీడు వలన మనకి నష్టం కలిగినప్పుడు, వాటిని మర్చిపోయి, వారిని క్షమించ గలగటం అనేది చాలా అరుదు. అలా చేయగలిగిన నాడు మనం అందరికంటే బలవంతులమే కాదా.
మనకి జరిగిన చెడుని మర్చిపోయి ఆ చెడు చేసిన వారిని క్షమించాలంటే ఎంతో గుండె ధ్యైర్యం కావాలి. కాని అలా చేయక పొతే, ఆ చెడుని తలుచుకుని మనం భాద పడటం, ఆవేశ పడటం చేస్తాం. ఆవేశం లో మనం ఏదైనా తప్పటడుగు వేస్తే మన జీవితం నాశనమే. అదే తలచుకుని భాద పడుతూన్నా మానసికంగా కుమిలి పోతాం. అదే రోగానికి దారి తీస్తుంది. అలా కాక వారిని క్షమిస్తే మనం ఆనందంగా సుఖంగా ఉంటాము.
అందుకని మన పెద్దలు క్షమా గుణం చాలా గొప్పది అన్నారు. ఈ 3 సూత్రాలను పాటిస్తే మన జీవితం హాయిగా, ప్రశాంతంగా సాగి పోతుంది. మరి మీరు ఏమంటారు ?
No comments:
Post a Comment