పాత దిండు గలేబుల తో ...1
పాత దిండు గలేబులు మన ఇంట్లో చాలానే ఉంటాయి. దుపట్లు చిరిగి పోయిన ఒక్కొక్క సారి గలేబులు మిగిలి పోతాయి. అలాగే కుషన్ కవర్లు, దీవాన్ పై వేసే బాలిసుల కవర్లు లాంటివి కుడా మిగిలి పోతాయి. మరి వాటిని ఎలా వాడుకోవచ్చును చూద్దామా ?
వాటిని ఇలా వాడుకోవచ్చు :
నూలువి అయితే, అదీ కొద్దిగా చిరిగి పోయి ఉంటే,
- మెత్తగా ఉంటాయి కనుక దుమ్ము తుడుచుకోవటానికి - ముఖ్యంగా ఇంట్లో ఖరీదైన వస్తువులు, పింగాణి, గాజు సామగ్రి, అద్దాలు, కంప్యూటర్ స్క్రీన్స్ లాంటివి తుడుచుకుని పరేయచ్చు
- నేల తుడవటానికి
- ఏదైనా ఒలికినప్పుడు-పాలు, నీళ్లు, నూనె వంటివి-తుడిచి పరేయచ్చును.
- వంటింట్లో గట్టు, టేబులు తుడవడానికి కాని, వేడి పాత్రలు పట్టుకోవటానికి కాని
ఏవైనా (నూలు , సిల్క్..) గలేబులు, చిరగకుండా చక్కగా ఉంటే,
- మన లో దుస్తులు, మేజోళ్ళు, రుమాళ్ళు వంటివి అందులో భద్రపరిస్తే, అలమారా వెతుక్కోనవసరం లేదు.
- పైన చెప్పినవి మాసి పోయినవి, ఉతక వలసినవి అన్ని ఒకే టబ్బు లో వేరే దుస్తులతో కాకుండా ఇలా గలేబులో పెట్టి విడిగా ఉంచవచ్చు
- పైన చెప్పినవి, గలేబులో వేసి మూతి కట్టేసి, వాషింగ్ మెషిన్ లో ఉత్తుకోవటానికి సుళువు
- అలాగే, సున్నితంగా ఉండే దుస్తులు -లేసువి, సిల్క్ వి, నెట్టు తో చేసినవి ఇలా విడిగా గలేబులో వేసి, మూతి కట్టేసి, వాషింగ్ మెషిన్ లో ఉతక వచ్చు.
- ఖరీదైన-పట్టువి కాని, అద్దాలు కుట్టినవి, జార్దోజి వర్కు చేసినవి, కుందన్ వర్కు లేదా ఎక్కువ ఎంబ్రాయిడరి చేసిన చీరెలు కాని, రవికెలు కాని విడివిడిగా (నూలు తో చేసిన) గాలేబుల లో పెట్టుకోవచ్చును. భద్రంగా ఉంటాయి.
- ఎంబ్రాయిడరీ చేసినవి, లేదా మంచి నూలు/సిల్కు గుడ్డ తో కుట్టిన గలేబుల లో దూది (కాటన్ కాని రేక్రోన్ కాని) నింపి, దిండ్లు/కుషన్లు తయారు చేసుకోవచ్చు.
- ఫోటో ఫ్రేములు, పోస్టర్లు వంటివి దాచాలంటే, గాలేబులలో పెట్టి దాచవచ్చు.
- ఉన్ని దుస్తులు, రగ్గులు, బొంతల వంటివి చలి కాలం అయిపోగానే, గాలేబులలో పెట్టి భద్ర పరచ వచ్చు.
- పసి పిల్లల బొంతలు, బేబి బ్లంకేట్, గలేబులో పెట్టి భద్ర పరచవచ్చు. ప్రయాణాలలో తీసుకు వెళ్ళటానికి సుళువు. త్వరగా మాసి పోవు .
- ఊలు, స్వెటర్లు/షాల్ వంటివి ఎవైనా మనం అల్లుతో ఉన్నప్పుడు, రోజు కొంత కొంత మాత్రమే అల్లుతాం. ఇలాంటప్పుడు అవి మాసి పోకుండా గలేబులో పెట్టి భద్ర పరచండి.
ఇంకొన్ని తరువాతి టపాలలో..
మీ...అనామిక....
No comments:
Post a Comment