Thursday 27 December 2012

మీనాకారి చెవి లోలాకులు - బుట్టలు

చెవికి వేలాడే లోలాకులు పెట్టుకుంటే అందంగా ఉంటుంది. బుట్టలు ఎప్పటికి ఫ్యాషనే. బుట్టలు, వేలాడే లోలాకులు ఇప్పుడు అందరు ఇష్టంగా పెట్టుకుంటున్నారు. చాల పెద్దవి బాగా బరువు ఉన్నవి ఫ్యాషన్. అయితే,  ఇవి ఇష్టం లేని వారికి బరువు లేకుండా చిన్న నుండి పెద్ద సైజు దాకా రకారకాలైన లోలాకులు, బుట్టలు ఉన్నాయి. రోజూ పెట్టుకోవడానికి, పార్టిల వంటివాటికి పెట్టు కోవడానికి మినకారి, కుందన్లు, రాళ్ల లోలాకులు బుట్టలు ఇప్పుడు ఫ్యాషన్. 

వివిధ రకాలైన చెవి లోలాకులు, బుట్టలు నా ఈ టపాలలో చూడండి 

మీనాకారి  బుట్టలు

మీనాకారి నగలు ఎన్నో రంగులలో దొరకుతాయి. కంఠాభరణాలు, చెవి దుద్దులు, బుట్టలు, లోలకులు, గాజులు ఇలా ఎన్నో. సెట్లుగాను విడి విడిగాను అమ్ముతారు. మన చీరెలు/ డ్రెస్సుల రంగులకి నప్పే విధంగా వీటిని పెట్టుకోవచ్చు. ఈ బుట్టలు చూడండి:

తెలుపు నలుపు కలయిక. కొంచం అరుదుగా దొరుకుతుంది. కాని  చాలా వాటికీ నప్పుతుంది.

ఇంకొన్ని వచ్చే టపాలలో......

మీ...అనామిక....

No comments: