గొలుసు కుట్టు-Simple Chain Stitch
Chain Stitch అంటే గొలుసు కుట్టు. ఈ పేరుకు తగ్గట్టుగా గొలుసు లాగా ఉంటుంది ఈ కుట్టు. ఇది చాల సులభమైన కుట్టు. నేను మొదటగా నేర్చుకున్నది ఈ కుట్టే. ఇప్పటికీ నాకు ఇష్టమైన కుట్లలో ఇది ఒకటి.
ముందుగా దారం బట్ట అడుగు భాగం నుండి పైకి తీసుకోవాలి.
తరువాత ముందు కుట్టిన కుట్టుకి కొద్దిగా పక్కన సూదిని బట్ట పైనుండి కిందికి దూర్చి మరల కొంత దూరం వదిలి బట్ట పైకి తీయాలి. కాని పూర్తిగా పైకి లాగ కూడదు.
ఇప్పుడు దారాని సూది చుట్టూ తిప్పి సూదిని లాగాలి. ఒక లూప్ లేదా గొలుసు ఏర్పడుతుంది.
దారం మరీ వదులు గానో లేదా బిగుతుగానో లాగ కూడదు.
ఇప్పుడు మళ్లి ఇందాక కుట్టిన ప్రదేశానికి దగ్గెరగా సూదిని క్రిందికి, పైకీ దూర్చి పైన చూపిన విధంగా దారం చుట్టి కుట్టాలి.
ఇలా కావలసినన్ని గొలుసులు కుట్టుకోవచ్చు. చివరగా దారాన్ని గోలుసుకి దగ్గెరగా బట్ట క్రిందిగి దూర్చి ముడి వేసి ముగించాలీ.
ఇలా ఉంటుంది కుట్టు.
డిజైన్ చుట్టూ అంటే అవుట్ లైన్ లాగా కుట్ట్ట్టటానికి గాని లేదా మొత్తం నింపటానికి గాని ఉపయోగించవచ్చు. బార్డర్ గాను- 2, 3, 5 వరుసలు కుట్టుకోవచ్చు. ఇతర కుట్ల తో కలిపి కుట్టుకోవచ్చు.
గొలుసు కుట్టు లో ఇంకా చాలా రకాలు చెప్పుకోవాలి...మరి చూస్తూ ఉండండి నా బ్లాగ్....
మీ...అనామిక....
No comments:
Post a Comment