ఊరమిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు అనగానే నోరు ఊరుతుంది కదూ. మామిడికాయ దోసకాయ లేదా ఏ ఆకుకూర పప్పు తోనో తింటే ఇంకా వేరే చెప్పలా?
ఎలా చేయాలోతెలుసుకుందాం.
కావలసినవి:
మజ్జిగ అర లీటరు
పచ్చి మిరపకాయలు 500 గ్రాములు
ఉప్పు తగినంత
పసుపు 1-2 టీ చెంచాలు
విధానం:
- మజ్జిగ బాగా పుల్లగా చిక్కగా ఉండాలి.
- మిరపకాయలు లావుగా పొట్టిగా ఉండాలి.
- మిరపకాయలను కడిగి పొడి బట్టతో తుడిచి కొంచెం సేపు నీడలో ఫ్యాన్ కింద బాగా ఆరబెట్టండి.
- ప్రతి మిరపకాయకీ నిలువునా గాటు పెట్టండి.
- మజ్జిగలో ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మిరపకాయలను అందులో వేసి బాగా కలియ బెట్టి, 2-3 రోజులు నానా పెట్టాలి.
- నాలుగవ రోజు జల్లెడలో వేసి మజ్జిగ అంతా కారిపోయిన తరువాత ఎండలో పెట్టాలి.
- రాత్రి మరల ఈ కాయలను మజ్జిగలో వేసి నాననివ్వాలి.
- మరల ప్రొద్దున్నే కాయలను, మజ్జిగాలోంచి తీసి, ఎండా పెట్టాలి.
- ఇలా మజ్జిగంతా అయిపోయిన దాకా చేయాలి.
- చివరగా గల గల లాడేటట్టు ఎండనిచ్చి, ప్లాస్టిక్ కవరు లో వేసి, గాలి చొరబడని డబ్బాలో లేదా సీసాలో వేసి పెట్టు కోవాలి.
- కావలసినప్పుడు, నూనె బాగా వేడి చేసి,అందులో ఊరమిరపకాయలు వేసి వేగిన వెంటనే తీసేయాలి.
మీరు చేసి చూడండి....
మీ...అనామిక....
No comments:
Post a Comment