తులసి కోట
ఇవాళ చిలుకు ద్వాదశి అంటే క్షీరాబ్ధి ద్వాదశి. లక్ష్మీ తులసినీ, కృష్ణ తులసిని, తులసి కోటలో పెట్టి, ఉసిరి కొమ్మని పాతి, లక్ష్మీ నారాయణులు, రాధా కృష్ణుల పటాలు పెట్టి పూజ చేస్తారు. తులసి కోట ముందు 5 పద్మాల ముగ్గులు వేసి, వాటిలో దీపాలు పెట్టి, 5 రకాల పిండి వంటలు, పళ్ళు నివేదన చేసి, తులసమ్మకి వస్త్ర తాంబూలాలు, పసుపు కుంకం సమర్పిస్తారు.

ఉసిరి కాయలో ఆవునేతితో దీపాలు వెలిగించి, రోటిలో చలిమిడి వేసి, పాలు పోసి చెరుకు గడతో తొక్కుతారు. ఆ పాలు చింది మనమిద పడితే ఒకొక్క చుక్కకు వెయ్యి సం. చప్పున మనకి స్వర్గ సుఖము కలుగుతుందని ఒక నమ్మకం. ఈ పూజ వలన, మాంగల్య వృద్ధి, వంశ వృద్ధి కలుగుతుందని నమ్ముతారు. అలనాడు, రాధమ్మకూడా కృష్ణుడి కోసం ఇలా చేసిందిట.
ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో చెట్లని కూడా పూజేంచే గొప్పతనం ఉన్నది. తులసి వలన మనకి ఎంతో మేలు కలుగుతుంది. అందుకని ఆ తల్లిని మన పెరట్లో ఉంచి పూజించటం మంచిదేగా.
ఏది ఏమైనా మన భారతీయ సంస్కృతిలో చెట్లని కూడా పూజేంచే గొప్పతనం ఉన్నది. తులసి వలన మనకి ఎంతో మేలు కలుగుతుంది. అందుకని ఆ తల్లిని మన పెరట్లో ఉంచి పూజించటం మంచిదేగా.
నాకు మా అమమ్మగారితో చిన్నప్పుడు ఈ ద్వాదసి నాడు చేసుకున్న పూజలు ఇంకా గుర్తు ఉన్నాయి.
ఆ గుర్తుగా ఈ రంగవల్లి:
ఇలా తులసి కోట రంగవల్లులు (మెలిక ముగ్గులు) ఎన్నో ఉన్నాయి. కొన్ని వేయటం చాల కష్టం. పైన ఇచ్చినది సుళువుగ వేసేయచ్చు. మరి మీరు వేసి చూడండి.
మీ...అనామిక....
1 comment:
మన సంస్కృతిలో ఒక్క చెట్లనేంటి..నీరు, వాయువు, అగ్ని, భూమి ఇలా అన్నీ పూజ్యనీయాలే కదండీ. ముగ్గులు బావున్నాయి.
Post a Comment