టెర్రకోట (Terracotta) అనే పదం లాటిన్ భాషలోని "టెర్ర కోట్ట" అనే పదం నుండి పుట్టింది. కొందరు ఇది ఇటాలియన్ నుండి పుట్టిందని అంటారు. టెర్రకోట అంటే కాల్చిన మన్ను అని అర్ధం. ఇది బ్రౌనిష్ ఆరంజ్ రంగులో ఉంటుంది. ఆయా ప్రాంతాలను బట్టి అక్కడి మన్నుని బట్టి రంగులలో తేడ ఉండవచ్చు. అంతే కాదు ఈ మన్నుతో వస్తువులను తయారు చేసేటప్పుడు కుమ్మరి వాడె చక్రం వాడకుండా చేతితో తయారు చేస్తారు.
మన పూర్వీకులకు సింధు నాగరికత కాలం నుంచే ఈ కళ తెలుసు. పశిమ బెంగాలు, ఉత్తర ప్రదేశ్, గుజరాతు, మధ్య ప్రదేశ్ లోని ఝాబువా మరియు బస్తర్ ప్రాంతాలు, బీహార్లొని దర్భంగా, రాజస్తాన్, తమిళనాడు- ఇలా మన దేశంలో అనేక ప్రాంతాలలో ఈ టెర్రకోట వస్తువులను తయారు చేస్తారు.
అనాదిగా, గ్రామీణ జీవితంలో ఈ కళ, ఈ కళను ఉపయోగించి తయారు చేసిన వస్తువులు ఒక భాగం. ఈ నాటికీ టెర్రకోట వస్తువుల వాడకం పల్లెలోనూ, చిన్న చిన్న పట్టణాలలోను ఇంకా ఉంది.
పాత్రలు, కుండలు, ఇటుకలు, ఇళ్ళకు వాడే పెంకులు, బొమ్మలు మొదలైనవి తయారు చేస్తారు. బొమ్మలలో, గుఱ్ఱాలు, ఒంటెలు, ఏనుగులు, పులులు, కోతులు, ఎడ్లు, పాములు, పక్షులు-ఇలా ఎన్నో తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో, ఈ బొమ్మలను ఆయా ప్రాంతాలలోని దేవుళ్ళకి, దేవతలకి మొక్కుబడి చెల్లించుకోవటానికి సమర్పించుకుంటారు. బీహారు వంటి ప్రాంతాలలో ఈ బొమ్మలకి రంగులు కూడా వేస్తారు.

ఈ టెర్రకోట పెంకులను, ఇళ్ళ పై కప్పులకు వాడటం మనకి తెలుసు. ఇక పాత్రలు, కుండలు, వంటకీ, నీళ్ళకి, గృహాలంకరణకీ వాడటం కుడా మనకి తెలుసు. ఇవి ఆరోగ్యానికి, పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి.
కొంత కాలంగా ఈ కళ మరుగున పడినా, ఇప్పుడు మన పట్టణ వాసులు కూడా ఆదరిస్తున్నారు. అందంగా తయారు చేసిన కుండలు, పాత్రలు, ట్రేలు, బౌల్సు పార్టీలలో సర్వింగ్ కి ఉపయోగిస్త్తున్నారు. ఇళ్ళలో, తోటల్లో పూలమొక్కల పెంపకానికి ఈ టెర్రకోట కుండీలు ఉపయోగిస్తున్నారు. నేడు టెర్రకోట కళాకృతులు ఎన్నో లబ్యామవుతున్నాయి.
ఇవి చూడండి :

ఈ గంటలు చూసారా? ఇవి అందంగా వెళ్లాడదిసుకోవచ్చు. లేదా ప్రమిదెలు/కొవ్వొత్తి పైన గాలికి ఆరి పోకుండా పెట్టవచ్చు. అందులోంచి దీపకాంతి మిణుకు మిణుకు మంటూ అందంగా కన్పిస్తుంది. క్రింది వాటికి చిరు గంటలు ఉన్నాయి. వీటికి వెండి రంగు పూసారు. మనకి మట్టి రంగు వద్దనుకుంటే మనమే రంగులు అద్దవచ్చు.
ఇవి మాములు ప్రమిదలు, హంస ఆకారంలో ఉన్న ప్రమిదలు , కొవ్వొత్తి స్టాండ్ మరియు సూర్యుడి ఆకారంలో వాల్ హంగింగ్.
ఇక్కడ తమ తమ కుల వృత్తులను చేసుకుంటున్న పల్లె జనం.
ఇవ్వన్ని ఇంట్లో కాని, మొక్కలలో కాని అందంగా అమర్చుకుంటే ఎంతో బాగుంటుంది కదా?
ఇంకొన్ని వచ్చే టపాలో.....
ఇవ్వన్ని ఇంట్లో కాని, మొక్కలలో కాని అందంగా అమర్చుకుంటే ఎంతో బాగుంటుంది కదా?
ఇంకొన్ని వచ్చే టపాలో.....
మీ...అనామిక....
No comments:
Post a Comment