ఈ మధ్యన చీరెలకి వర్క్ చేసిన patches కుడుతున్నారు. మనం కష్టపడి చీరెల మిద స్వయంగా చేతితో కుట్టే బదులు, ఇలా రెడీగా దొరికేవి కుట్టటం సులభం. త్వరగా చీరె కుట్టేయచ్చు.
ఈ patches రక రకాలైన ఆకారాలు, డిజైన్లు, రంగులు, సైజులలో దొరుకుతున్నాయి. వాటి డిజైను, సైజు, వాడిన సామాగ్రి, పనితనాన్ని బట్టి ధర ఉంటుంది. మనం ఒకే రకం patch కాని లేదా వివిధమైనవి మన సృజనని బట్టి వాడుకోవచ్చు. ఈ patches చీరెలు, రవికెలు, చున్నీలు, కుర్తీలు,సల్వార్ సుట్లు ఇలా అన్నిటి మీద కుట్టుకోవచ్చు.
మరి ప్రస్తుతం ఫేషన్ లో ఉన్న కొన్ని Patches చూద్దమా ?
ఇది చిన్న సైజ్ పూల patch. మధ్యలో స్టోన్/కుందన్ చుట్టూ జరితో వర్క్ చేసారు. ఇవి అనేక రంగులలో, సైజ్లలో దొరకుతాయి. చిన్నవైతే 10, 25, 50, 100 లేదా వాళ్ళ పాకెట్లో తీసుకోవాలి. పెద్దవైతే ఒకటి కూడా ఇస్తారు. ఏదైనా ధర ఒక్కింటికి ఇంతని ఉంటుంది.
వీటికి వెనకవైపు బట్ట అతికించి ఉంటుంది. అందుకని పలుచని చీరె మీద కుట్టినా వెనక వైపు ఎమ్బ్రాయిడరి దారాలు కనిపించవు.
ఇవి మామిడి పిందెల ఆకారంలో ఉన్నాయి.
ఇవి వెల్వెట్ మీద చేసిన వర్క్.
వీటిని, చిన్నవైతే ఫ్యాబ్రిక్ గ్లూ తో అతికించుకోవచ్చు. పెద్దవైతే తప్పనిసరిగా టాకాలు వేసి కుట్టటమే మంచిది. ముందుగ ఎలా కుడితే బాగుంటుందో చూసుకుని, అటు తరువాత గ్లూ పెట్టి అంటించి ఆరిన దాక వదిలేయాలి. అటు తరువాత మనం చేతితోకాని, మెషిన్ తో కానీ కుట్టుకుంటే అవి ఊడి పొతాయని భయం ఉండదు.
మరికొన్ని వచ్చే టపాలలో.....

మీ...అనామిక....
No comments:
Post a Comment