Sunday, 18 September 2011

తాటాకు పళ్ళాలు-Palm Leaf Plates

మన భారత దేశం ప్రకృతిని పూజించే దేశం. అనాదిగా ప్రకృతిని తల్లిగా దేవతగా భావించి పూజించటం మన సాంప్రదాయం. ఇప్పుడు పాశ్చ్యాత్య సంస్కృతిని  గుడ్డిగా అనుసరించి అనుకరించడం మనకి  అలవాటై పోయింది. 

పూర్వం భోజనమైన, ఇడ్లి ఉప్మా లాంటివైన చక్కగా, అరిటాకో, విస్తరాకులోనో  తినే వాళ్ళం. ఇది ఆరోగ్యానికి చాల మంచిది. ఒకళ్ళు తినే  కంచంలోనో పళ్ళెంలోనో  తినటం  అనేది ఎంగిలి కిందే లెక్క . ఎవరు తినే కంచం, తాగే గ్లాస్ ఇప్పటికీ  వేరే ఒకరు వాడరు. అథితులోస్తే వాళ్లకి మన వాడేవి వాడాలంటే ఇబ్బంది. 

నా చిన్న తనంలో మా అమ్మమ్మగారింట్లో బాదం చెట్టు ఉండేది. ఎవరైనా భోజనానికి వస్తే వెంటనే ఆ ఆకులతో విస్తరి కుట్టి చక్కగా భోజనం వడ్డించేవారు. 

ఇలా ఆకులో తినటం వలన ఎంగిలి దోషం ఉండదు. చాల రుచిగా ఉంటుంది. పత్ర హరితముతో వేడిగా ఉన్న పదార్ధం  చర్య పొంది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

మీరు ఎప్పుడైనా వేడి వేడి ఇడ్లి కానీ, ఉప్మా లేదా దోశ, పెసరట్టు ఆకులో తిని ఉంటె, దాని రుచే వేరు. వేడి వేడి చారన్నం కూడా చాల రుచిగా ఉంటుంది. 

ఆకు లో తినటం వలన ఉపయోగాలు:
  • రుచి
  • శుభ్రత
  • ఆరోగ్యం
  • తిన్న తరువాత పత్రాలు శుబ్రం చేసే పని లేదు
  • పార వేసిన త్వరగా మట్టిలో కలిసిపోతుంది- ఇకో ఫ్రెండ్లీ: పరియావరణానికి  కూడా  ముప్పు లేదు
  • పెరట్లో  చెట్టు ఉన్నా, లేదా విస్తరాకులు కొని పెట్టుకున్నా, ఎంత మంది అథితులు  వచ్చిన ఇబ్బంది ఉండదు
  • ప్రయాణం చేసేటప్పుడు తీసుకుని వెళ్తే బరువు ఉండవు, పారవేయటం  తేలికే


ఇప్పుడు ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయి. పేపరుతో చేసిన పళ్ళాలు, దొన్నెలు, కంచాలు వస్తున్నాయి. విస్తరాకుతో  చేసినవి కుడా ఉంటాయి. అవి గట్టిగ ఉండటానికి, కింద పేపరు వేసి చేస్తున్నారు. ఇలా అన్నో రకాలు. 

ఇవి చూడండి. ఈ మధ్యన నేను ఒక ప్రదర్శనలో చూసాను. 
ఇవి తాటాకుతో చేసినవి. చాల ధృడంగా ఉన్నాయి. వివిధ ఆకృతులలో, పరిమాణాలలో దొరుకుతున్నాయి. ధర కూడా మరి అంత ఎక్కువేమి కాదు. చూడడానికి కూడా చాల బాగున్నాయి. 
ఇవి రాలిపోయిన తాటాకులతో చేస్తారట. వాడి పడేసిన తరువాత త్వరగా మట్టిలో కలిసిపోతుంది. అందుకని, పరియావరణానికి  కూడా  ముప్పు లేదు.  ఇవి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో తయారు చేస్తున్నారు. మన ఆంద్ర దేశంలో ఎవరూ తయారు చేస్తోనట్లు లేదు. ఇక్కడ ఎక్కడ దొరకుతాయో కొంచం వెదకి చూడాలి. మన రాష్ట్రంలో కూడా తాటి చెట్లు ఉంటాయి. ఇప్పుడు కనుమరుగై పోతున్నాయి. ఇలాంటి పరిశ్రమ మన వాళ్ళు కూడా పెడితే, వారికీ ఆదాయమే, మనకీ ఆరోగ్యమే. 

ఈ క్రింది లింక్ లో  మరిన్ని ఉత్పత్తులను చూడొచ్చు ...


ఇది వారి చిరునామా:

Eco Palm Leaf Industries
Nandhavana Thottam, Vaiyapuripudur, Puttuvikki,
Sundakkamuthur Road, Coimbatore 641010
Tamilnadu, India
Tel: +91 422 4208665 Fax: +91 422 4355866
Email: view@ecopalmleafplates.com

మీరు కొని వాడి చూడండి.......

మీ...అనామిక....

2 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

బాగుంది.పర్యావరణానికి మేలు చేసే వస్తువులను వాడటం మంచిది కధా! పని సులభతరం. ధన్యవాదములు

అనామిక... said...

Thanks andi