Saturday 31 December 2011

రంగవల్లి-28


నూతన సంవత్సర రంగవల్లులు-4
ఈ ముగ్గు ఇంకా ఓపికగా వేస్తె బాగుంటుంది. నేను హడావిడిగా వేసాను.


మీ...అనామిక....

రంగవల్లి -27

నూతన సంవత్సర రంగవల్లులు-3
ఇంకొక రంగవల్లి. ఓపిక ఉంటె ఇంకా క్లిష్టమైనవి వేసుకోవచ్చు. 

మీ...అనామిక....

రంగవల్లి-26

నూతన సంవత్సర రంగవల్లులు-2 




చూసారుగా, చాలా సులభమైనది. దీనిని మీరు background contrast (లేత) రంగుతో నింపి దాని పై సందేశం ముగ్గుతో కాని రంగు పొడి తో కాని వ్రాయొచ్చు. పువ్వులతో అలంకరించ వచ్చు. చుట్టురా ఇంకా లతలు, పువ్వులు, డిజైన్లు వేయొచ్చు. 


మీ...అనామిక....

రంగవల్లి-25

దేవుని విస్తరి 
19 X10 చుక్కలు మధ్య చుక్క.


మధ్యలో ఉన్న డిజైన్ ని విస్తరాకు అంటారు.ఇది మనందరికీ సుపరిచితమే. శుభకార్యాలలో కానీ, విందులలో కాని మన ఉళ్ళలో దీనినే కదా భోజనానికి వాడతాము. పర్యావరణానికి ఎంతో మేలు. ప్లాస్టిక్ విస్తళ్ళు కన్నా రుచికి రుచీ, ఆరోగ్యానికి ఆరోగ్యము.


దానిని చుట్టి ఉన్నది ఒక 6 కోణాలు కలిగిన స్టార్ డిజైన్. ఇది శ్రీ చక్రానికి ప్రతీక. 


చుట్టురా ఉన్నవి మూడు దళాలు -మారేడు దళాలు లేక బిల్వ దళాలు . మూడు దళాలు  శివుని త్రిశులానికి ప్రతీక అని అంటారు. శివునికి ఇవి ఎంతో ప్రీతికరమైనవి. అందుకే స్వామిని ప్రసన్నం చేసుకోవటానికి బిల్వ దళ పూజ చేస్తారు.  


ఈ దళాల లో లక్ష్మి నివాసముంటుందని కూడా అంటారు. వీటితో అమ్మవారికి దేవి నవ రాత్రులలో పూజ చేస్తే అమ్మకి ఇష్టం అని కూడా అంటారు. 


ఇన్ని చిహ్నాలు కలిగిన ఈ ముగ్గుకి దేవుని విస్తరి అని పేరు పెట్టాను. పరమైన రోజులలో, పండుగలలో కొందరు నిత్యమూ తాము వండుకున్నది దేవునికి సమర్పించి కాని తినరు.అదే దేవుని విస్తరి. 


ఈ ముగ్గు వేయటము సులభమే.చుక్కలు దూరంగా పెట్టుకుంటే ముగ్గు పెద్దగా కనిపిస్తుంది. 


మరి వేసి చూడండి...

మీ...అనామిక....

Friday 30 December 2011

రంగవల్లి -24

నూతన  సంవత్సర రంగవల్లులు-1

కేకుల ముగ్గు. తీయ తియ్యని  కేకులు, వెలుగును విరజిమ్మే కోవోత్తులు, అందమైన రంగు రంగుల పువ్వులతో మీరు నూతన సంవత్సరాన్ని ఆనదంగా ఆహ్వానించండి. 
15X15 చుక్కలు.


మీ...అనామిక....

Thursday 29 December 2011

రంగవల్లి -23

చాక్లెట్ల ముగ్గు. 13X7 చుక్కలు 

మీ...అనామిక....

రంగవల్లి-22

పట్టణాలలో ముంగిట పెద్ద పెద్ద ముగ్గులు వేయాలన్న ఇబ్బందే. సరైన స్థళం ఉండదు. అందుకని, కొన్ని చిన్నవి సులభంగా వేసేందుకు. పెద్ద ముంగిలి ఉన్నవారు ఒకే పెద్ద ముగ్గు కంటే రెండు మూడు చిన్నవి వేసికోవచ్చు.
13 నుండి 7 చుక్కలు -మధ్య చుక్కలు.

మీ...అనామిక....

రంగవల్లి-21


నెల ముగ్గులు



వీటికి ముందుగ నాలుగు మూలలలో గడులు గీసుకుని, తరువాత వాటిని పైన చూపిన విధంగా కలపాలి.


మీ...అనామిక....

Wednesday 28 December 2011

రంగవల్లి-20



20 చుక్కలు 10 వరుసలు 
18, 16, 14,12, 10 చుక్కలు 
పైన చూపిన విధంగా కలపండి.


మీ...అనామిక....

Tuesday 27 December 2011

రంగవల్లి -19

పొంగలి కుండలు 


మధ్య వరుస 23 చుక్కలు; తరువాత 
21--2 వరుసలు 
5 చుక్కలు వదిలి 11 చుక్కలు 3 వరుసలు 
3 చుక్కలు వదిలి 5 చుక్కలు 5 వరుసలు
2 వదిలి 1 చుక్క 


పైన చూపిన విధంగా కలపండి. 


మీ...అనామిక....

రంగవల్లి-18

అష్ట దళ పద్మం 

 మాములుగా మనం వేసే పద్మం.
ఇదీ అష్టదళ పద్మం. లక్ష్మీ దేవి పాదాలను కూడా చూడ వచ్చు. దీనిని పూజా సమయాలలో కూడా వేస్తారు. 4 గీతలతో  వేస్తారు . నేను రెండు గీతలతో మాత్రమే వేసాను. 

మీ...అనామిక....

Monday 26 December 2011

రంగవల్లి -17


దివ్యేష్ వర -రంగావల్లుల్లు వేసే కళాకారులు. ఆయన ఆహామదాబాదు, గుజరాతు నివాసి. తానూ ఒక కళా పిపాసినని, ప్రత్యేకించి  Tribal Art అంటే ఇష్టమని, రంగావల్లుల్లు వేయటం చాల ఇష్టమని, చెప్పారు. ఆకృతి అనే ఒక సంస్థ ద్వార తన సేవలను అందిస్తున్నారు, పలు పోటిలలో కూడా పాల్గొన్నారు. ఆయన సహృదయంతో, తానూ వేసిన రంగవల్లులు కొన్ని మనతో పంచుకున్నారు.

చూడండి ఎంత బాగున్నాయో. సామజిక అంశాలు, పోర్త్రైత్స్, పురాణ అంశాలు ఇలా పలు విషయాల మీద రంగవల్లులు వేసారు.































బాగ్గున్నాయి కదూ. 




మీ...అనామిక....