పాత దిండు గలేబుల తో ..... 2
- గాజు/పింగాణి సామాను గాలేబులలో చుట్టి భద్ర పరుస్తే గీతలు పడకుండా ఉంటాయి.
- వెండి వస్తువులు గీతలు పడకుండా భద్ర పర్చుకొవచ్చును.
- పిల్లల బొమ్మలు, ఆడిన తరువాత గలేబులో వేసి భద్ర పరచ వచ్చు
- నవారు కాని, గుడ్డ ముక్కలతో టేపు లాగా కుట్టి కాని, గాలేబులకు హ్యాండిల్ లాగా కుట్టి సంచీల లాగా వాడుకోవచ్చును. ఎక్కువ బరువు ఉండవు. మనం కూరలు/పళ్ళు/సరుకులు తెచ్చుకొవచ్చు. ప్లాస్టిక్ సంచులు వాడనవసరం లేదు.
- గళ్ళు ఇతర ప్రింట్ ఉన్నవి లేదా ఎంబ్రాయిడరి చేసిన గాలేబులయితే ఇలా సంచులుగా బాగుంటాయి. ఓపిక ఉంటే అందంగా బ్యాగ్ లు కుట్టు కొవచ్చును.
- కొత్తవి, వాడనివి, అందంగా ఉన్న గలేబులతో పిల్లల స్కర్ట్లు, టాప్స్, నైటీలు కూడా కుట్టు కొవచ్చును. స్ట్రాప్ లు, జిప్పులు, బటన్లు , రిబ్బన్లు, లేదా అందమైన పువ్వులు, లతలు కుట్టి కాని, పెయింట్ చేసి కాని పిల్లల దుస్తులు కుట్ట వచ్చును. ఈ క్రింది లింక్ లు చూడండి
- పిల్లల సాఫ్ట్ టాయ్స్ గలేబులు వేసి మూతి బిగించి వాషింగ్ మెషిన్ లో ఉతక వచ్చును.
- గలేబులు ఇంకా కొత్తగా కనిపిస్తోనట్లయితే, అలాగే వాడటం బోర్ గా అనిపిస్తే, లేసులు, రిబ్బన్లు, అందమైన పువ్వులు, లతలు, బొమ్మలు కుట్టి కాని, పెయింట్ చేసి కాని, అప్లిక్ చేసి కాని, వాటిని మరింత కొత్తగా కనపడేటట్లు మార్చి వేయండి .
- చున్నీలు స్కార్ఫులు వీటిలో వేసి భద్ర పరుచుకోవచ్చును.
- అందమైన గాలేబులతో, ఎప్రాన్ కుట్టు కోవచ్చును.
- హాంగర్ కి వేళ్ళాడ దీసిన కోట్/చొక్కాలు మొ. దుమ్ము నుండి రక్షించుకోవటానికి, గలేబుల చివర(అంచులు కుట్టి ఉన్న చోట) హాంగర్ కొక్కెం పట్టే టట్లు ఒక రంధ్రం(కావాలంటే చుట్టూ కాజా కుట్టు కుట్టు కోవచ్చు) చేసి తోడగండి. గలేబు మూతి క్రిందకు రవాలి. ఈ క్రింది లింక్ చూడండి
మరి మీరు కూడా దిండు గలేబుల తో ఏదైనా చిట్కా చెప్తారా ? నాకు మెయిల్ చేయండి
No comments:
Post a Comment