మనం ఎన్నో వస్తువులు పనికి రావని, చెత్త అని పడేస్తాం. కాని వాటిని ఉపయోగించి కళాకృతులు కాని లేదా పనికొచ్చే వస్తువులు కాని తయారు చేయోచ్చును.
అలాంటిదే ఇది - గడియారం.
ఇందులో వాడినవి-
- గడియారం కిట్టు - మార్కెట్ లో దొరుకుతుంది,
- గణేష్ బొమ్మ ఉన్న పెళ్లి పత్రిక దళసరిగా ఉంటుంది కనుక మొత్తంగా అలాగే వాడేం
- దాని పైన పాత కాలెండర్ నుండి కత్తిరించి, నంబర్లు అంటిచాం
- దాని పైన ముందు వైపు దుమ్ము నుండి రక్షణ కొరకు ప్లాస్టిక్ షీట్ వాడేం
- వెనుక థర్మొకొల్ ముక్కలను వాడేం. దీనిపైన పెళ్లి పత్రిక అంటిచాం ఇది గడియారానికి ధృడత్వం ఇవ్వటమే కాక స్టాండ్ లాగా కూడా పని చేస్తుంది.
ఈ గడియారాన్ని టేబుల్ పైన పెట్టుకోవచ్చును లేదా గోడకు తగిలించుకోవచ్చును. ఇప్పటికి 2-3 ఏళ్ల నుంచి బాగానే పనిచేస్తోంది.
పెళ్లి పత్రికలను, చించ లేము. పారేయను లేము. అందుకని ఇలా వాడితే బాగుంటుందని అనిపించింది. ఈ ఐడియా నాది. గడియారం మాత్రం మా తమ్ముడు తయారు చేశాడు. నాకు అంత ఇంజినీరింగ్ తెలియదు.
మరి నా ఈ ఐడియా మీకు నచ్చిందా? ....
మీ...అనామిక....
No comments:
Post a Comment