ధనుర్మాసం వస్తోందంటే నాకు చాల సంతోషంగా అనపిస్తుంది. కార్తికమంతా చక్కగా ఉపవాసాలు, శివుడికి అభిషేకాలు, పూజలు చేసి ఈ మాసమంతా మర్గాశీర్ష మాసం కాబట్టి విష్ణువుని, పూజించాలి.
అన్నిటికంటే, ధనుర్ సంకరమణం నుండి మకర సంక్రాంతి వరకు ముగ్గులు వేయటం అంటే భలే సరదా. దీనినే నెల పట్టటం అంటారు. తెల్లవారే లేచి, సూర్యోదయానికి ముందే మూగు పెటుకోవాలని తొందర.
మరి ఈ ఏడాది 16 నుండి ముగ్గుల నెల ప్రారంభం. నేను ఎన్నో కొత్త కొత్త ముగ్గులు వేసి పెట్టుకుంటున్నాను. మీతో పంచుకోవటానికి. నేను రెడి మీరు రెడి నా?
15 నుండి నా టపాలలొ ముగ్గులు చూడండి.
ఒక్క మాటా. ముగ్గులు వేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేయండి. నేను రోజు అలాగే చేస్తాను. ఈ మాసం అయితే "ఓం నమో నారాయణ" అనో లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనో "శ్రీ రామ" అనో లేదా "సాయి రామ్" అనో ఇలా ఏదైనా మీ ఇష్టం. ఏదో ఒక నామం జపం చేయవచ్చును. ముగ్గు పెడుతో చేస్తే, సమయం ఉంటుంది, ఏకాగ్రత కుదుర్తుంది.
మరి రంగవల్లుల కోసం నా టపాలు చూస్తూ ఉండండి....మీ suggestions, comments దయ చేసి పంపించండి....
మీ...అనామిక....
No comments:
Post a Comment