మనం గాజులను భద్ర పరిచే సాధనాలను గురించి చెప్పుకుంటున్నాము కదా? ఇప్పుడు మరి ఒకటి చూద్దాం.
ఇవి ఫైబర్ తో చేసిన పెట్టెలు. వీటిల్లో చిన్న పెద్ద సైజులు ఉన్నాయి. ఖరీదైన గాజులు-రాళ్ళవి, మెటల్, లక్క వంటివి ఇందులో భద్ర పరిస్తే చక్కగా ఉంటాయి. దుమ్ము పడుతుందేమో అని భయం లేదు. పెట్టె పారదర్శకంగా ఉంది కాబట్టి లోపలి గాజులు పెట్టెను తెరవకుండానే చూడవచ్చు.
కాకపొతే ఇవి క్రింద పడినా ఏదయినా గట్టిగా తగిలినా విరిగె ప్రమాదం ఉండ వచ్చు. అలాగే వీటి అంచులు పదునుగా గీసుకునేటట్లు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మేలు. అయినా గాజులంటే మనము జాగ్రత్తగానే ఉంటాం కదా.
చాల గాజులు పడతాయి
ధర మరీ ఎక్కువేమి కాదు. ఇవి 3-4 రంగులలో దొరుకుతాయి. ఇప్పటి వరకు, నాకు ఈ పెట్టేలే బాగా నచ్చాయి. అలమారలో పెట్టుకోవటానికి కూడా చక్కగా ఉన్నాయి. చాలా గాజులు ఒకే పెట్టెలో పెట్టు కావచ్చును.
మీ...అనామిక....
No comments:
Post a Comment