కూరలు ఉడికించిన నీళ్లు ...
మనం చాలా సార్లు ఎంతో పుష్టికరమైన ఆహారం తిందామని అనుకుంటాం. కాని అలాంటివాటినే పనికిరావని పారేస్తాం. ఉదాహరణకి కూరలు, ఆకు కూరలు, శనగలు, పెసలు, రాజ్మా, బొబ్బర్లు వంటివి ఉడికించిన నీళ్లు.
అసలు సరిపోయేంత నీరే పోసి ఉడకపెట్టండి. కాని
శనగలు వంటివి ఉడకపెట్టినప్పుడు నీళ్లు మిగిలిపోతాయి. ఎక్కువగా ఉన్న నీరును వేరే పాత్రలోకి వంపి పక్కన పెట్టుకోండి. వాటిని ఇలా వాడుకోవచ్చును:
- పులుసు, చారు వంటివాటిలో
- చపాతీల/పూరిల పిండి కలిపేటందుకు
- సూప్ ల తయారీలో
- కూరలు వండేటప్పుడు గ్రేవి లో
- ఉప్మా, ఖిచిడి వంటివి చేసేందుకు
- చనా మసాలా, రగడ వంటివి చేసేటప్పుడు
- దాల్ (దాల్ ఫ్రై ) వంటివి చేసేటప్పుడు
- చల్ల బరచి చెట్లల్లో పోయండి. వాటికీ బలం.
సాధ్యమైనంత వరకు ఆ నీటిని అదే రోజు వాడేయండి లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని అవసరమయినప్పుడు వాడుకోండి. కొంత మంది ఆ నీటిని ఐస్ క్యూబ్ గా మార్చి నిలువచేసుకుంటారు. నాకు మాత్రం ఎక్కువ రోజులు నిలువ ఉంచి వాడటం ఇష్టం ఉండదు.
మీ...అనామిక....
మీరు వంటలు బాగా చేస్తారని విన్నాను. అయితే ఇదనమాట మీ రహస్యం :)
ReplyDeleteవాటిల్లో, వీటిల్లో కలిపి వండటం ఎందుకని మా అమ్మమ్మ ఆ నీళ్ళు నా చేతిలో పెట్టి తాగవే అంటుంది. ఇదెలా తాగను అంటే సూప్ అనుకుని తాగు అంటుంది.
mari peddavallu cheppina maata vinali manam. leda opika chesukuni chitakaalu patinchaali...:) Thanks Rasagya
ReplyDelete