Pages

Wednesday, 8 March 2023

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవము.


మన భారతీయ సంస్కృతిలో స్త్రీని అదిశక్తిగా, ప్రకృతిగా, సృష్టికి ప్రతిసృష్టికర్తగా వర్ణించారు. స్త్రీకి ఏంతో ఉన్నతమైన స్థానం కల్పించారు. భారతీయ సంప్రదాయంలో స్త్రీకి పెద్దపీట వేసి గౌరవించారు. మాతృదేవోభవ అని తల్లిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించారు. పంచభూతాలలో భూమిని, నీటిని కూడా స్త్రీస్వరూపంగానే భావించి, భూమాత, నదీ మాత అని గౌరవించారు.

తల్లిగా, అక్కగా, చెల్లిగా భార్యగా కూతురిగా ఓర్పు, నేర్పు, ఓదార్పు, క్షమా ఇలాంటి అనేక సుగుణాలతో తన వారికి అత్మియత అనురాగం పంచే అమృతమూర్తిగా మన సమాజంలో ఒక ప్రత్యేక స్థానం కల భారతీయ నారి పూజ్యురాలైనది.

యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః!

ఎక్కడ స్త్రీలు పూజింపబడతరో, అక్కడ దేవతలు నివసిస్తారు అని మన సంస్కృతీ సంప్రదాయాలు స్త్రీని గౌరవించాయి.

ఇప్పుడు స్త్రీకి ఆ గౌరవమర్యాదలు మన దేశంలో, మన సమాజంలో కరువయ్యాయి. చాలా బాధ కలుగుతుంది.

నా అభిప్రాయంలో విద్య వ్యవస్థ, కుటుంబ వ్యవస్థల పతనం వలన నేడు స్త్రీ పురుషులు ఇరువురు సరి అయిన నడవడిక లేకపోవడానికి ఒక కారణమేమో. (అందరు ఆలా ఉన్నారని కాదు)

ఇప్పుడు మన సంస్కృతీ సంప్రదాయాలను మరచిపోయి, పాశ్చాత్య పోకడలను గుడ్డిగా అనుకరిస్తూ స్త్రీ పురుషులు ఇరువురు తమ సంసారం నరకప్రాయం చేసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తున్నారు. కేవలం ధానోపార్జనే ధ్యేయంగా నీతినియమాలను వీడి తమ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే కుటుంబము, సమాజము రెండూ నాశనం అవుతున్నాయి.

దీనికి అడ్డుకట్ట వేయాలంటే మన విద్యా వ్యవస్థ మారాలి. చదువు అంటే కేవలం మాథ్స్, సైన్సు, సోషల్ బట్టీయం వేయడం కాదు. పిల్లకి జీవితంలో ఆటుపోట్లను తట్టుకునే సామర్ధ్యం కలింగిచాలి. తల్లితండ్రులను , పెద్దలను, స్త్రీలను గౌరవించడము నేర్పాలి.

అలాగే కుటుంబవ్యవస్థ కూడా మారాలి. పిల్లల పెంపకంలో తల్లితండ్రులు, తాతలు, బామ్మలు, అమ్మమ్మలు, ఇతర బంధువులు ఇలా ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా ముఖ్యమైనదే. కుటుంబము స్థిరంగా బలంగా చక్కగా ఉండాలి. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉంటేనేగా పిల్లలు చక్కగా పెరిగేది. బాల్యంనుండి పిల్లల పెంపకం సక్రమంగా లేకపోతే వారు మంచి వ్యక్తులుగా ఎలా ఎదుగుతారు?

ఈనాటి బాలలు రేపటి మంచి పౌరులుగా ఎదిగితేనే స్త్రీకి దక్కాల్సిన గౌరవ మర్యాదలు దక్కుతాయి.

ఇలా ఇంకా ఏంతో చెప్పవచ్చు. ఎన్నో చెప్పవచు. అంతు లేదేమో.

సఖులందరికి మహిళా దినోత్సవ  శుభాకాంక్షలు 


మీ...అనామిక....

No comments:

Post a Comment