మనం చిన్నప్పుడు ఈ ఆకారాలను తిలకంతో పెట్టుకునే వాళ్ళం కదూ, ఒక్క సారి గుర్తు చేసుకుందామా ?
చుక్క లేదా గుండ్రని బొట్టు, కోల బొట్టు, నిలువు లేదా పొడువు బొట్టు, దోస గింజ బొట్టు.
డైమండ్
చంద్ర వంక
సూర్యవంక
ఇవి కుడా మనకి తెలుసు.
నామం
తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి నామాలు- వైష్ణవ సాంప్రదాయం వారు ధరిస్తారు. వాటి గురించి ఈ లింకులలో చూడండి
ఎన్ని రకాలైన నామాలో
అడ్డ బొట్టు శైవ మతం వారు ధరిస్తారు.
కళ్యాణ తిలకం/బొట్టు -దిని అందమే వేరు. వరుడు వధువు దీనిని ధరిస్తే కాని ఆ పెళ్లి కళ రాదు.
కనుబొమ్మల పైన చుక్కలు, ఎరుపు తెలుపు రంగులతో పెట్టు కుంటారు. తెలుపు కనిపించదు కాబ్బట్టి నేను పసుపు రంగు ఇంకు వాడాను.
మరి ఆ స్టిక్కర్ బొట్లను పక్కకి పెట్టి, మళ్లీ తిలకం దిద్దుదామా ... ఇంకొన్ని వచ్చే టపాలలో .....
మీ...అనామిక....
No comments:
Post a Comment