Wednesday 1 August 2018

Card Kit - Card 1

మనం స్వయంగా మన చేతితో గ్రీటింగ్ కార్డ్స్ చేయాలనుకుంటే వాటికీ కావాల్సిన వస్తువులు అంటే కార్డు, రంగు కాగితాలు, స్టిక్కర్లు, రిబ్బన్లు  ఇలా సరంజామా అంట అందరి దగ్గర ఉండక పోవచ్చు. 

ఇపుడు క్రాఫ్ట్ షాప్ లో కార్డు కిట్ అని దొరుకుతున్నాయి. ఇవి రకరకాలుగా ఉంటాయి. కేవలం కార్డులు, వాటికీ సరిపోయే కవర్లు ఉండే కిట్ దొరుకుతుంది. ఇది ఒక కార్డు సెట్ కానీ ఇంకా ఎక్కువ అంటే 3, 5 ఇలా ఉన్న కిట్లు ఉంటాయి. ఇవి తెలుపు లేదా రంగులలో దొరుకుతాయి. ఇవి కేవలం ప్లేయిన్ సెట్. వాటి పైన మనం పెయింట్ కానీ ఇంకేదైనా వర్క్ లేదా క్రాఫ్ట్ చేయాలంటే కావలసినవి మన దగ్గర ఉండాలి. 

కార్డు + కవర్ + వాటికీ కావలసిన స్టిక్కర్లు, రిబ్బన్లు  ఇంకా ఇతరత్రా అలంకరించే సామాగ్రి ఉండే కిట్లు కూడా దొరుకుతాయి. ఇవి కొంటే  అన్ని అందులో ఉంటాయి కనుక మనం కేవలం మన సృజనను అనుసరించి మనకి కావలసినట్లు కార్డు తయారుచేసికోవచ్చును. 

అలాంటి ఒక కిట్ తో నేను తయారు చేసిన కార్డు ఈ  టపాలో మీ కోసం:


ఇది ఆ కార్డు కిట్ లో ఇచ్చినవి. మూడు కార్డులు ( 3 రంగులలో) మూడు తెల్ల కవర్లు, ఇంకా కొన్ని స్టికర్లు, రిబ్బెన్లు మొదలైనవి ఉన్నాయి. 

అందులోంచి ఒక కార్డు నేను ఇలా చేశాను. 

అయితే నేను చెక్స్ టేప్ పర్పుల్ రంగుది,  సీతాకోకచిలుక పఫ్ స్టిక్కర్ నా దగ్గర ఉన్నది  వాడాను. మిగిలినవి ఆ ప్యాక్ లోనివి. 


ఇదిగో ఇలా కవర్ కూడా మాచింగ్ గా ఉండేటట్లు చేశాను. 

మీకు నచ్చిందా? ఇంకొన్ని వచ్ఛే టపాలలో ... 

మీ...అనామిక....

No comments: