Friday 17 June 2016

ఆణిముత్యాలు - 293

ఆణిముత్యాలు   - 293 

మీ...అనామిక....

హలో

హలో!

వేసవి సెలవలు అయిపోయాయి. మళ్ళీ అందరూ ఉరుకులు పరుగులు.  సారి  నేనూ  బిజీగా ఉండి టపాలు వేయలేక పోయాను.

ఎండలు మండిపోతున్నాయి. నీటి  కొరత. చాలా ఇబ్బందులు పడ్డాము. కానీ గాలి వానలతొ  కొద్దిగా ఉపశమనం కలిగింది. మా పెరట్లో చెట్లకు కొద్దిగా ప్రాణం పోసినట్లు అయినది. కొన్ని మొక్కలు ఎండను తట్టుకో లేక పోయాయి. కొన్ని గాలి వనకి. మళ్లీ  వర్షా  కాలం లో కొన్ని కొత్త మొక్కలు వేసుకోవాలి. ఇది ప్రతీ  ఏడాది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా  మామూలే. 

అయితే గాలి వానలకి కరంటు సరిగ్గా ఉండటం లేదు. కొద్దిగా గాలి వీచినా  కట్ చేస్తున్నారు. మరి తప్పదు కదా. సేఫ్టీ అవసరం. వాన పడితే చాలాసేపు కరంటు ఉండదు. ఇచ్చినా  హెచ్చు తగ్గులు ఉండటం తో కంప్యూటర్ ఆన్  చేయ్యలంటేనే భయం వేస్తోంది. అందుకని కూడా టపాలు  వేయటం లేదు.

మళ్ళీ కొద్ది రోజుల నుండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. నీళ్ల కొరత సారే సరి. ఈ బాధలు ఎప్పుడూ  ఉండేవే లేండి.  

ఇప్పుడు నేను కొంచెం ఉపిరి పీల్చుకుని ఫ్రీ అయ్యా. మళ్లీ  టపాలు  వేస్తాను. చూస్తూ ఉండండి ......


మీ...అనామిక....