Tuesday 25 August 2015

అమ్మమ్మ చిట్కాలు -16


నిమ్మ రసం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ సి అధికంగా ఉంటుంది. కూరల్లో, పచ్చళ్లలో వాడుకోవచ్చు. నిమ్మ రసం నీళ్ళతో కలిపి, షర్బత్ లాగా తాగవచ్చు. మజ్జిగలో కొద్దిగా కలిపి తాగినా మంచిదే. 

నిమ్మ రసం కావలిసిన ప్రతీ  సారి కాయల నుండి రసం తీయటం చిరాకుగా ఉంటుంది. ఉద్యోగాస్తులైనా, కాకపోయినా ఆడవాళ్లు, పొద్దున్న ఒక చిన్న యుద్ధమే చేయాలి. అన్ని సమయానికి చేయగలగాలి, అందించగలగాలి. ఇక రాత్రి వంట చేయాలంటే కూడా విసుగ్గా ఉంటుంది. 

మరి బంధువులో, స్నేహితులో సడన్ గా ఇంటికి వచ్చారనుకోండి, ఏ  ఉప్మనో  చేయాలి అంటే నిమ్మకాయ రసం ఉండాలి. నిమ్మకాయ పులిహోర, సలాడ్, నిమ్మ షర్బత్ , చాట్ ఇలా చాలా వాటికి నిమ్మ రసం కావాలి. ప్రతీ  సారి కాయను కోసి రసం తీయటం కొద్దిగా ఇబ్బందే. 

అందుకని ఇలా చేయండి; 
అవసరం అనుకున్నప్పుడు కావలసిన క్యూబ్స్ ని మళ్లీ  రాసంలా చేసి వాడుకోవచ్చు. ఈ క్యూబ్స్  ని  సాఫ్ట్  డ్రింక్స్ లేదా జ్యూస్ ల్లోకి కూడా వేసి సర్వ్ చెయచ్చు.

మీ...అనామిక....

No comments: