Friday, 24 July 2015

టేబుల్ క్లాత్ పై ఫాబ్రిక్ పెయింటింగ్


టేబుల్ క్లాత్, కుషన్ కవర్స్ , దివాన్ సెట్- ఇలాంటి వాటిపైన అందంగా కనిపించడానికి  ఫాబ్రిక్ పెయింటింగ్ వెసుకొవచ్చు.  ఎంబ్రాయిడరీ కంటే తక్కువ సమయం పడుతుంది. మనకు వీలుగా చిన్న లేదా పెద్ద డిజైన్లు ఎంపిక చెసుకొవచ్చు.

ఇదిగో ఇది ఎప్పుడో చాలా కాలం కిందట నేను వేసిన డిజైన్.  టేబుల్ క్లాత్ పైన వేసాను. దివాన్ సెట్, కుషన్ కవర్స్, టేబుల్ క్లాత్- వీటన్నిటి పైన సముద్రంలోని అండర్ వాటర్ సీన్. అందుకే సీ  గ్రీన్ కలర్ క్లాత్ ఎంచుకున్నాను. అది కాటన్ కేసమేంట్ క్లాత్. చాలా మందంగా ఉండటం వలన పెయింట్ వేయటానికి చాలా ఇబ్బంది పడ్డా. కాని చాలా ఏళ్ళు మన్నింది. ఎన్నో సార్లు ఉతికినా చెక్కు చెదరలేదు. కాని కొంత రంగు తగ్గింది. క్లాత్ కూడా వెలిసిపోయింది. ఇది గోల్డ్ ఫిష్

ఇలా నాలుగు చివర్లలో చేపలను వేసి, మధ్యలో గోల్డ్ ఫిష్ వేసాను. 

చాలా పాతది కాబ్బట్టి పెయింటింగ్ కొంత రంగు తగ్గింది. క్లాత్ కూడా వెలిసింది. కాబ్బట్టి కొత్తల్లో ఉన్నంత బ్రైట్ గా లేదు. 

మీరు వేసి చూడండి. వేసినవి ఉంటే  మీరు మన సఖులందరితో  పంచుకోండి. సఖులందరమూ ఎంతో  కొంత ప్రేరణ పొందుతాము. 


మీ...అనామిక....

ఆణిముత్యాలు - 114


మీ...అనామిక....

Thursday, 23 July 2015

పల్లవి - అనుపల్లవి

ఈ పాట  నాకు చాలా  ఇష్టం. వినడానికి ఎంతో  హాయిగా ఉంటుంది. అంతేనా,  రొమాంటిక్ పాట  అయినా చక్కని సందేశం కూడా  ఉంది. 

చిత్రం: ప్రేమించి చూడు 
రచన: దాసరథి 
గానం : పి. బి. శ్రీనివాస్, పి . సుశీల 
స్వరకల్పన: మాస్టర్ వేణు 


పల్లవి:
అతడు :   వెన్నెల రేయి ఎంతో  చలి చలి 
               వేచ్చనిదానా రావే నా చెలి           ॥ వెన్నెల॥ 

ఆమె:      చల్లని జాబిలి  నవ్వెను మరీ  మరీ
               అల్లరివాడా  నీదే ఈ చెలి
చరణం 1: 
అతడు:    చూపులతోనే మురిపించేవు   (2)
               ఆటలతోనే మరిపించేవు   (2)
               చెలిమి ఇదేనా మాటలతో సరేనా (2)
ఆమె:       పొరపాటైతే పలకనులే పిలువనులే
               దొరకనులే  ఊరించనులే  ॥ వెన్నెల
చరణం 2: 
ఆమె       నా మనసేమో పదమని  సరి సరి
             మర్యాదేమో   తగదని పదే  పదే
             మూడు ముళ్ళు పడనీ  ఏడడుగులు నడవనీ (2)
అతడు:    వాదాలెందుకులే  ఔననినా
               కాదనినా  ఏమనినా  నా దానివిలే
ఆమె:      చల్లని జాబిలి  నవ్వెను మరీ  మరీ
               అల్లరివాడా  నీదే ఈ చెలి   ॥ వెన్నెల


మీ...అనామిక....

ఆణిముత్యాలు - 113
మీ...అనామిక....

Thursday, 16 July 2015

కుట్లు-అల్లికలు

సఖులందరికి ఒక మనవి:
కుట్లు-అల్లికలు  శీర్షిక లో 31 రకాల కుట్లు నేర్చుకున్నాం. అవి ;
1. Running Stitch - టాకా  కుట్టు -8 రకాలు 
2. Back Stitch -  వెనుక కుట్టు - 6 రకాలు
3. Stem Stitch  - కాడ కుట్టు -6 రకాలు 
4. Chain Stitch  - గొలుసు కుట్టు - 11 రకాలు 

మీకు ఈ శీర్షిక  ఎంతవరకు నచ్చిందో లేదా ఉపయోగ పడిందో నాకు తెలియలేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవటానికి. 

కొత్తవి నేర్చు కోవాలని ఉంటే,  ఈ బ్లాగ్ లో మీ కామెంట్ ఈ టపా క్రింద వ్రాయండి. లేదా ఈ-మెయిల్ చేయండి. మీ స్పందనని బట్టి నేను కొత్త కుట్లు నేర్పుతాను. మీ...అనామిక....

ఆణిముత్యాలు - 106

ఆణిముత్యాలు - 106 

మీ...అనామిక....

Sunday, 12 July 2015

కుట్లు-అల్లికలు - మనవి

సఖులందరికి ఒక మనవి:
కుట్లు-అల్లికలు  శీర్షిక లో 31 రకాల కుట్లు నేర్చుకున్నాం. అవి ;
1. Running Stitch - టాకా  కుట్టు -8 రకాలు 
2. Back Stitch -  వెనుక కుట్టు - 6 రకాలు
3. Stem Stitch  - కాడ కుట్టు -6 రకాలు 
4. Chain Stitch  - గొలుసు కుట్టు - 11 రకాలు 
మీకు ఈ శీర్షిక  ఎంతవరకు నచ్చిందో లేదా ఉపయోగ పడిందో నాకు తెలియలేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి నేర్చుకోవటానికి. 

కొత్తవి నేర్చు కోవాలని ఉంటే,  
  1. నా బ్లాగ్ ను ఫాలో అవ్వండి. 
  2. నా ఈ బ్లాగ్ లో మీ కామెంట్ ఈ టపా క్రింద వ్రాయండి. మీ స్పందనని బట్టి నేను కొత్త కుట్లు నేర్పుతాను. 
మీ నుండి మంచి స్పందనని ఆశిస్తో


మీ...అనామిక....