Wednesday 25 March 2015

విద్యా వృద్ధికి - పరీక్షలలో జయానికి మంత్రం

ఈ సమయంలో పిల్లల్లందరూ చదువులతో కుస్తీ పడుతూ ఉంటారు. పరీక్షల సమయం కదూ. ఏడాది పొడువునా చదివిన వారు, లేదా పరీక్షలని చివరి రోజులలో చదివే వారు, ఎవరైనా సరే, ఎంత చదివినా, పరీక్ష సమయంలో పేపర్ చేతిలో పెట్టిన తరువాత, చదివిన దంతా  వ్రాసేటప్పుడు గుర్తు రావాలి. కంగారు పడకుండా చక్కగా వ్రాయగలగాలి . 

జీవితంలో ఎందులో అయినా విజయం సాధించాలంటే మన కృషితో పాటుగా భగవంతుని కృప కూడా చాలా అవసరమే కదా. మరి పరిక్షలలో, చదువులలో కుడా అంతే. పరీక్షలల్లో విజయం లేనిదే జీవితంలో ఉన్నతి పొందలేము. 

మరి అందుకనే మన పెద్దలు మనకు భగవంతుని కృపా కటాక్షాల కోసం చక్కని మార్గాలు ఎన్నో చెప్పారు. అందులోనుండి ఒక మార్గము ఇప్పుడు ఇక్కడ మీ కోసం; 

హయగ్రీవుడు విష్ణుమూర్తి అవతారాలలో ఒకటి. ఆశ్వ వదనం అంటే -గుఱ్ఱపు మోహము, మెడ, మానవుని శరీరం కలిగి ఉంటారు. ఈ స్వామీ, జ్ఞానానికి, అలౌకిక ఆనందానికి ఆధారం అంటారు. నిర్మలమైయిన స్ఫటిక కాంతిని పోలిన కాంతితో మెరిసిపోతున్న దేహం కలిగి ఉండి, ధవళ వస్త్రాలను ధరించి, తెల్లని పద్మముపై ఆసీనులై ఉంటారు. 

అన్ని విద్యలకు, జ్ఞానానికి, మహోన్నతమైన మేధా శక్తికీ హయగ్రీవుని ఆరాధించాలి. అందుకని, చదువుకునే పిల్లలూ, జ్ఞానం  కోసం సాధన చేసే పెద్దలు ఎవరైనా ఈ హయగ్రీవ మంత్ర జపం చేస్తి, తప్పక విజయం లభిస్తుంది. 


పై శ్లోకాన్ని ఉదయాన్నే, స్నానం చేసిన తరువాత (లేదా పూజా సమయం లోకాని) 3 సార్లు చదివి, హయగ్రీవ మంత్రాన్ని 11, 108 లేదా అంతకంటే ఎక్కువసార్లు జపం చేయవచ్చు. అటు తరువాత రోజంతా కేవలం మంత్రం ఒకటే  అనుకుంటూ ఉండవచ్చు. దీనికి పెద్దగా నియమాలు లేవు. 

పిల్లలు  రోజూ ఈ శ్లోకము + మంత్రం  చెప్పుకోవాలి. పిల్లలు ఎక్కువ సేపు చేయలేరు కాబట్టి, వారి, తల్లి తండ్రులు గాని, ఇంకెవరైనా కాని వారి కోసం ఈ జపం చేయవచ్చు. ముఖ్యంగా వారు పరీక్ష వ్రాస్తున్నంత సేపు ఆ  సమయంలో,  వారి తల్లి తండ్రులు గాని, ఇంక ఎవరైనా కాని ఈ జపం(ఇంట్లోనే) చేస్తే  ఫలితం ఉంటుంది. పరీక్షా ఫలితాలు వచ్చే  వరకు చేస్తే మంచిది. 

అసలు పిల్లలకు రోజు ఈ శ్లోకము , మంత్రమూ చదివే అలవాటు చేయాలి. వారికి చదువు పై శ్రద్ధ కుడా పెరుగుతుంది.




మీ...అనామిక....

ఆణిముత్యాలు - 18

ఆణిముత్యాలు - 18

మీ...అనామిక....

Saturday 21 March 2015

రంగవల్లి - 200

 ఉగాది స్పెషల్  ముగ్గు 

25 నుండి 1 వరకి సరి చుక్కలు. 

మామిడి తోరణాలు, ముచ్చటైన ముగ్గులతో కళ  కళలాడు తున్న తెలుగు లోగిళ్ళు, మామిడి కాయలు, రంగురంగుల పువ్వులతో కళ  కళలాడుతున్న ప్రకృతిని ఈ రంగవల్లికి థీమ్. 
మీ అందరికి  మన్మథ నామ ఉగాది శుభాకాంక్షలు ..... 

మీ...అనామిక....