Saturday, 25 January 2014

రంగవల్లి -191

గణతంత్ర దినోత్సవ స్పెషల్ 
25 నుండి 1 సరి చుక్కలు. 

మువ్వన్నెల ఝండాలు ఎగురవేసి మన భారత మాతకు, బంగారు తల్లికి జేజేలు పలుకుతో ....   మీ అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .... 

మన స్వతంత్ర సమరయోధులు, ఎందఱో దేశ భక్తులు, వారి సేవలు, బలిదానాలు -ఇవన్ని గుర్తుకు తెచ్చుకుని మన వంతు దేశ సేవ మనం చేద్దాం. 

మీ...అనామిక....

Tuesday, 14 January 2014

రంగవల్లి - 190

సంక్రాంతి స్పెషల్ -రథం ముగ్గు 
ఇది నవరత్నాల రథం. రథంలో స్వామికి ఒక ఆసనం కూడా ఏర్పాటు చేశాను. మీకు నచ్చినదనుకుంటాను. 

మీ...అనామిక....

Monday, 13 January 2014

రంగవల్లి-189

 సంక్రాంతి స్పెషల్ 
21 చుక్కలు 7 వరుసలు -7 వరకు సరి చుక్కలు. 

పొంగలి కుండలు, చెరుకు గడలు, గాలి పటాలు, గొబ్బిళ్ళు, రేగు పళ్ళు -సంక్రాంతి సంబరాలు ... 

మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .... 

మీ...అనామిక....

రంగవల్లి -188

సంక్రాంతి స్పెషల్ 

23 నుండి 1 సరి చుక్కలు. పొంగలి/భోగి కుండలు, గాలి పటాలు ముత్యాల ముగ్గులు -సంక్రాంతి సంబరాలు .... 

మీ కందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి కొన్ని ముగ్గులు వచ్చే టపా లలో 


మీ...అనామిక....

Saturday, 11 January 2014

రంగవల్లి -187


25 నుండి 1 సరి చుక్కలు. 

ముక్కోటి ఏకాదశికి ఆ నారాయణుడికి, ఆ శేష సాయికి, ఆ పద్మనాభునికి ఈ పద్మాలతో పాటు మన మనసు అనే కుసుమాన్ని కూడా సమ్పర్పిస్తూ ఆ స్వామి పాదాలకు పుష్పాంజలి.... 


మీ...అనామిక....

Sunday, 5 January 2014

రంగవల్లి -185


21 నుండి 1 సరి చుక్క. 
ఇదిగో ఇలా కలిపాను. 

సంక్రాంతి అంటేనే, ముగ్గులు, గాలి పటాలు. మన పల్లెలో ఈ పండుగను ఎంతో  చక్కగా చేసుకుంటారు. అందుకే నేను గుడిసెలు, గాలి పటాలు ఈ ముగ్గులో పొందు పరిచాను. 

చిన్నప్పుడు పెరిగిన పల్లె వాతావరణం ముఖ్యంగా ధనుర్మాస-సంక్రాంతి వేడుకలను ఎప్పటికి మర్చిపోలేము. అందుకే ఈ రంగవల్లి. 
మీ...అనామిక....

Wednesday, 1 January 2014

రంగవల్లి -184

ఇదిగోనండి ఇది ప్లస్సుల (+) ముగ్గు. నేను చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గులలో ఇదీ  ఒకటి. ఇప్పటికీ తప్ప కుండా వేస్తాను. 

పైన చూపిన విధంగా + లను వేసుకుని కలుపుకోవాలి. ఎంత కావాలంటే అంత పెద్దది కాని చిన్నది కాని వేసుకోవచ్చును. మధ్యలో రంగులు నింపుకోవచ్చును. 

మరిన్ని వచ్చే టపాలలో....... 


మీ...అనామిక....