Tuesday, 16 December 2014

రంగవల్లి - 193

గొడుగుల ముగ్గు 


ధనుర్మాసం వచ్చేసింది. ఇక సంక్రాంతి దాక ముగ్గుల పండగ. సారి నేను చాలా ఆలస్యంగా టపా రాస్తున్నాను. ఇదిగో ఇది మొదటి ముగ్గు :

15 నుండి 1 సరి చుక్కలు. ఇంక రోజు చూస్తూ ఉండండి నా బ్లాగ్ మరిన్ని కొత్త ముగ్గుల కోసం. 

దయచేసి  నా ఈ  ముగ్గుల గురించి మీ బ్లాగలో  కాని ఇతర సైట్ లో కాని చెప్పి లింక్ ఇవ్వండి. మన సఖులందరికి కూడా ఉపయోగంగా ఉంటుంది.

రోజు ప్రొద్దున్నే ముగ్గు వేసేటప్పుడు భగవనామ స్మరణ చేయండి. ఏదైనా సరె. ఓం నమో నారాయణాయ అనో ఓం నమో భగవతే వాసుదేవాయ అనో, గోవిందా  అనో ఇలా ఏదైనా సరె. 


మీ...అనామిక....

Thursday, 7 August 2014

రంగవల్లి -192

వరలక్ష్మి వ్రతం స్పెషల్ 

వరలక్ష్మి  వ్రతం మంగళ గౌరి వ్రతం చేసుకునే సఖులందరి కోసం.

19 చుక్కలు, 17, 15, 13, 11,11,11,7,5,3,1. సరి చుక్కలు. 

కలశము, స్వస్తిక, పద్మాలు, పువ్వులు మధ్యన అష్ట దళ పద్మము -అమ్మవారికి ప్రీతి పాత్రమైనవి. నేను ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులను మాత్రమే వాడాను. పసుపు కుంకుమలు సౌభాగ్యానికి చిహ్నం. ఆకుపచ్చ ఆరోగ్యానికి,  ఐశ్వర్యానికి  చిహ్నం. 

మీకు నచ్చినదనుకుంటాను. 

మీరంతా వ్రతాలు చక్కగా చేసుకుంటారని, లక్ష్మీ  కటాక్షము మన అందరికి ఉంటుందని భావిస్తూ ...... 

మీ...అనామిక....

Saturday, 22 February 2014

ఆణిముత్యాలు - 10


ఆణిముత్యాలు - 10

కాలం విలువ తెలిసిన వారు దానిని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకుంటారు. కాబట్టి వారి జీవితాలు సుఖంగా సంతృప్తిగా ఉంటాయి. మరి వారు ఆనందంగా కూడా ఉంటారు.

 ఏమంటారు మీరు ? 


మీ...అనామిక....

Friday, 21 February 2014

హలో

మిమ్మలిని పలకరించి చాల రోజులైంది కదూ ?  ఇప్పుడు నేను మీ కోసం మళ్లి కొత్త టపాలతో వస్తున్నాను. కుట్లు-అల్లికలు, వంట-వార్పూ , అమ్మమ్మ చిట్కాలు, గృహ అలంకరణ ఇలా ఆనేకమైన అంశాలతో వస్తున్నాను మీతో కాసేపు, ఎన్నెన్నో విషయాలను పంచుకోవడానికి ...

మరి చూస్తూ ఉండండి నా బ్లాగ్ .......


మీ...అనామిక....

Saturday, 25 January 2014

రంగవల్లి -191

గణతంత్ర దినోత్సవ స్పెషల్ 
25 నుండి 1 సరి చుక్కలు. 

మువ్వన్నెల ఝండాలు ఎగురవేసి మన భారత మాతకు, బంగారు తల్లికి జేజేలు పలుకుతో ....   మీ అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు .... 

మన స్వతంత్ర సమరయోధులు, ఎందఱో దేశ భక్తులు, వారి సేవలు, బలిదానాలు -ఇవన్ని గుర్తుకు తెచ్చుకుని మన వంతు దేశ సేవ మనం చేద్దాం. 

మీ...అనామిక....

Tuesday, 14 January 2014

రంగవల్లి - 190

సంక్రాంతి స్పెషల్ -రథం ముగ్గు 
ఇది నవరత్నాల రథం. రథంలో స్వామికి ఒక ఆసనం కూడా ఏర్పాటు చేశాను. మీకు నచ్చినదనుకుంటాను. 

మీ...అనామిక....

Monday, 13 January 2014

రంగవల్లి-189

 సంక్రాంతి స్పెషల్ 
21 చుక్కలు 7 వరుసలు -7 వరకు సరి చుక్కలు. 

పొంగలి కుండలు, చెరుకు గడలు, గాలి పటాలు, గొబ్బిళ్ళు, రేగు పళ్ళు -సంక్రాంతి సంబరాలు ... 

మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .... 

మీ...అనామిక....

రంగవల్లి -188

సంక్రాంతి స్పెషల్ 

23 నుండి 1 సరి చుక్కలు. పొంగలి/భోగి కుండలు, గాలి పటాలు ముత్యాల ముగ్గులు -సంక్రాంతి సంబరాలు .... 

మీ కందరికీ, సంక్రాంతి శుభాకాంక్షలు. మరి కొన్ని ముగ్గులు వచ్చే టపా లలో 


మీ...అనామిక....

Saturday, 11 January 2014

రంగవల్లి -187


25 నుండి 1 సరి చుక్కలు. 

ముక్కోటి ఏకాదశికి ఆ నారాయణుడికి, ఆ శేష సాయికి, ఆ పద్మనాభునికి ఈ పద్మాలతో పాటు మన మనసు అనే కుసుమాన్ని కూడా సమ్పర్పిస్తూ ఆ స్వామి పాదాలకు పుష్పాంజలి.... 


మీ...అనామిక....

Sunday, 5 January 2014

రంగవల్లి -185


21 నుండి 1 సరి చుక్క. 
ఇదిగో ఇలా కలిపాను. 

సంక్రాంతి అంటేనే, ముగ్గులు, గాలి పటాలు. మన పల్లెలో ఈ పండుగను ఎంతో  చక్కగా చేసుకుంటారు. అందుకే నేను గుడిసెలు, గాలి పటాలు ఈ ముగ్గులో పొందు పరిచాను. 

చిన్నప్పుడు పెరిగిన పల్లె వాతావరణం ముఖ్యంగా ధనుర్మాస-సంక్రాంతి వేడుకలను ఎప్పటికి మర్చిపోలేము. అందుకే ఈ రంగవల్లి. 
మీ...అనామిక....

Wednesday, 1 January 2014

రంగవల్లి -184

ఇదిగోనండి ఇది ప్లస్సుల (+) ముగ్గు. నేను చిన్నప్పుడు నేర్చుకున్న ముగ్గులలో ఇదీ  ఒకటి. ఇప్పటికీ తప్ప కుండా వేస్తాను. 

పైన చూపిన విధంగా + లను వేసుకుని కలుపుకోవాలి. ఎంత కావాలంటే అంత పెద్దది కాని చిన్నది కాని వేసుకోవచ్చును. మధ్యలో రంగులు నింపుకోవచ్చును. 

మరిన్ని వచ్చే టపాలలో....... 


మీ...అనామిక....