Tuesday, 31 December 2013

రంగవల్లి -183

నూతన సంవత్సర స్పెషల్ 


వచ్చే టపాలలో మరిన్ని ముగ్గులు మీ కోసం .... 

మీ...అనామిక....

రంగవల్లి -182

నూతన సంవత్సర స్పెషల్ 

అందరం ఉత్సాహంగా ఉన్నాం కదూ, కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడానికి 
పాత సంవత్సరానికి వీడ్కోలు, కొత్త సంవత్సరానికి ఆహ్వానం ... 
నూతన సంవత్సర శుభాకాంక్షలు ... 

మరీ పెద్ద ముగ్గులైతే చాల సమయం పడుతుంది-అందుకే ఈ చిన్ని ముగ్గు. మీకు నచ్చిన రితి లో రంగులు నింపండి, పువ్వులు లతలతో అలంకరించండి. లేదా పురేక్కలతో నింపండి. మీ ఇష్టం. 


మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు 

మీ...అనామిక....

Thursday, 26 December 2013

రంగవల్లి -180


5X 5 మెలిక ముగ్గు. 

మరిన్ని ముగ్గులు తరువాతి టపాలలో ..... 


మీ...అనామిక....

Wednesday, 25 December 2013

రంగవల్లి-179-ముగ్గు బార్డర్లు-1

ఇదిగోనండి ముగ్గులకు వేసుకునే బార్డర్లు. ఇవి ముగ్గు చుట్టురా, లేదా మెట్ల పైన, ద్వారం/గుమ్మాల  దగ్గర ఇలా మీకు నచ్చిన చోట వేసుకోవచ్చును ముదురు ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నిలం, క్రిస్మస్ పండుగకు ఇంటిని అలంకరించేటప్పుడు వాడే రంగులు, అందుకే ఈ రంగులను నేనూ వాడాను.


ముగ్గు వేసిన తరువాత వాటికీ మరింత అందం తెచ్చేవి ముగ్గు బార్డర్లు. అలాగే మెట్ల పైన, గుమ్మాల దగ్గర తప్పక వేస్తాం. ఏవో రెండు గీతలు కాకుండా ఇలా సందర్భాన్ని బట్టి వేస్తే  అందంగా ఉంటుంది కదూ ?

ఇలాంటి మరెన్నో ముగ్గు బార్డర్లు తరువాతి టపాలలో మీ కోసం ..... 

మీ...అనామిక....

రంగవల్లి -178

క్రిస్మస్  స్పెషల్ 


20 చుక్కలు 4 వరుసలు- 4 వరకు-సరి చుక్కలు. ఇందులో, కొవొత్తులు , గంటలు, హోలీ-బెర్రిస్, బహుమతులు, గులాబీ- క్రిస్మస్  పండుగ సందడిని సూచిస్తాయి. 

ముదురు ఆకుపచ్చ, ఎరుపు, తెలుపు, నిలం, క్రిస్మస్ పండుగకు ఇంటిని అలంకరించేటప్పుడు వాడే రంగులు, అందుకే ఈ రంగులను నేనూ వాడాను

మీ అందరికి 

          క్రిస్మస్ శుభాకాంక్షలు మీ...అనామిక....

Tuesday, 24 December 2013

రంగవల్లి -177


ఇది 4X4 చుక్కలు. చిన్న ముగ్గు ఎక్కడైనా వేసుకోవచ్చు. 
ఈ చిన్న ముగ్గు నాలుగింటిని జోడించి వేసినది. ఇలా మీ ఇష్టం ఎంత పెద్దది కావాలంటే అన్ని జోడించి వేసుకోవచ్చు. 

మీకు నా ఈ రంగవల్లులు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మీ సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే దయ చేసి నాకు మెయిల్ ద్వారా పంప గలరు. 


మీ...అనామిక....

Sunday, 22 December 2013

రంగవల్లి -176ఇదిగోనండి ఇవాళ్టి ముగ్గు. ఇది మా అమ్మమ్మగారి రంగవల్లుల నోటు పుస్తకం లోనిది. 23 నుండి 1 వరకు సరి చుక్క. 

అలా మన పెద్దవాళ్ళు వాళకి  తెలిసిన ముగ్గులు ఒక చోట వేసి పొందు పరిస్తే మనకి బోలెడన్ని ముగ్గులు ఉంటాయి. మా అమ్మగారు కూడా ఇలా ఒక పుస్తకం లో తనకు వచ్చిన ముగ్గులన్నీ వేసి పెట్టారు. నేను నాకు వచ్చినవి, నేర్చుకున్నవి, పేపర్లో/పత్రికల్లోనివి కత్తిరించి దాచుకుంటాను. ఇలా నా దగ్గిర ఇప్పటికి చాల ఉన్నాయి. 

అప్పుడపుడు అవి తిరగ వేస్తుంటే కొత్త ఐడియాలు వస్తాయి. 

మరిన్ని ముగ్గులకు నా టపాలు చూస్తూ ఉండండి ...... 


మీ...అనామిక....

Saturday, 21 December 2013

రంగవల్లి -175


13 నుండి 1 సరి చుక్క. 

మీ...అనామిక....

రంగవల్లి -174


11 నుండి 1 వరకు సరి చుక్కలు. చాలా సుళువుగా వేసుకోవచ్చు. మరిన్ని ముగ్గులు వచ్చే టపాలలో.... 


మీ...అనామిక....

Friday, 20 December 2013

రంగవల్లి -173
ఇదిగోనండి చాల సులభంగా వేసుకోగలిగే మెలిక ముగ్గు. ఇది 5X5 ముగ్గులను కలిపి వేసినది. మీకు కావలసిన రీతిలో మీరు ఇంకా కలుపుకుని పెద్దదిగా వేసుకోవచ్చును.

చూస్తూ ఉండండి మరెన్నో ముగ్గులకు నా టపాలను.....

మీ...అనామిక....

Tuesday, 17 December 2013

రంగవల్లి -172


కొంగలు - చేపల ముగ్గు ఇది 18-6 వరసల నుండి 6 వరకు సరి చుక్కలు. 

మీ...అనామిక....

Sunday, 15 December 2013

రంగవల్లి -171


రేపటి నుండి ధనుర్మాసం మొదలు. మరి మన వాకిళ్ళు శుభ్ర పరచి, అలికి, చక్కని ముగ్గులు వేయాలి. అదికూడా సూర్యుడు ఉదయించ కుండా సుమా. అప్పుడే ఆ స్వామీ, ఆ విష్ణు మూర్తి, ఆ గోపాల కృష్ణుడు మన  ఇంటికి వచ్చి మనని  చల్లగా చూస్తాడని, సుఖ-శాంతులు, భోగ-భాగ్యాలు, ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలకు కొదవ ఉండదని మన పెద్దలు చెపుతారు. మరి నేను నా రంగవల్లులతో రెడి. మీరు? 

ఇదిగోండి మొదటిది ... 

21, 19, 17, 15, 15, 11, 9, 9, 5, 3, 1-సరి చుక్కలు. 

ఇది చాలా సులభంగా వెసుకొవచ్చు. నేను రోజు ఒక రంగవల్లి పోస్ట్ చేయటానికి ప్రయత్నం చేస్తాను. 

మరి రోజు నా టపాలు  చూస్తూ ఉండండి .... ఎన్నో ఎనెన్నో అందమైన రంగవల్లులు .... 

మీ సూచనలు, సలహాలు, కామెంట్స్ నాకు టానిక్ లా పని చేస్తాయి  :) మరిన్ని రంగవల్లులు గీయటానికి  ఉత్సాహాన్ని ఇస్తాయి. మరి తప్పక కామెంట్ చేయండి .... 

ముగ్గు వేసేటప్పుడు భగవంతుని స్మరణ తప్పక చేయండి- శ్రీ రామ అనో గోవింద అనో ఇంకేదైనా సరే మీ ఇష్టం. 


మీ...అనామిక....