Monday 18 November 2013

విధి విలాసం

పుస్తకాలు మన నేస్తాలు. నాకు చిన్నప్పటి నుండి పుస్తక పఠనం అంటే చాలా ఇష్టం. అసలు ఒక్క పేజీ అయిన చదువని రోజు ఉండదు. ఇలా నేను ఎన్నో పుస్తకాలు చదివాను. హిందీ, ఇంగ్లీష్, తెలుగు- ఈ మూడు భాషలలో మంచి మంచి పుస్తకాలు చదవడమంటే నాకు ఇష్టం. రక రకాలైన విషయాల పై చదువుతాను. 

కొన్ని పుస్తకాలను చదివి అందులోని విషయాన్ని మర్చిపోతాము, కొన్ని చదివి గుర్తు పెట్టుకుంటాం, కొన్ని మాత్రం ఎన్ని సార్లు చదివినా తనివి తీరదు - అలాంటివి కొని జాగ్రత్త చేసుకుంటాం. 

అలంటి పుస్తకం ఇది. ఎవరు ఇస్తే చదివాను. నాకు చాల నచ్చింది. కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం గారు రచించిన విధి విన్యాసం. ఇది ఒక మహా తపస్వి అద్భుత గాథ. నిజంగా అంత  బాగుంది. చదువుతూ ఉంటే అసలు పుస్తకం కింద పెట్టాలనిపించదు. తరువాత ఏమిటి అని, ఆ కాలంలో ఉన్న దేశ  కాల పరిస్తితుల వర్ణన మనని కట్టి పడేస్తుంది. ఆ తపస్వికి కృష్ణ పరమాత్ముడు, నారదుడు వంటి మహాను భావులు సక్షాత్కరించటం వంటి ఘటనలు మనని మరల మరల చదివిస్తాయి. 

ఈ పుస్తకం కొనుకుందాం అనుకుంటే ఆ ప్రతులు నాకు దొరక లేదు. చాలా ప్రయత్నం చేసాను.  దయ చేసి మీకు ఇవి ఎక్కడ దొరుకుతాయో తెలిస్తే నాకు మెయిల్ చేయ గలరు. 
ప్రతులకు ఈ అడ్రెస్స్ ఇచ్చారు. కాని ఫోన్ నంబరు ఇవ్వలేదు. 

మికెవరికైనా తెలిస్తే దయ చేసి నాకు వివరాలు మెయిల్ చేయండి. ఆంగ్ల మూలం కూడా తెలిస్తే నాకు తెలుపగలరు. 


మీ...అనామిక....

Sunday 17 November 2013

రంగవల్లి - 170

కార్తీక  పూర్ణిమ స్పెషల్ 

21, 19, 17, 15, 13, 13, 11, 7, 5, 3, 1 చుక్కలు. 
కార్తిక పూర్ణిమ, శివునికి ప్రియమైన రోజు కాబ్బట్టి, శివ లింగాలు, కలువలు, దీపాలు, బిల్వ దళాలు, రుద్రాక్షలు -అన్ని శివ ఆరాధనకై. 

ఓం నమః శివాయ. 

ఇది శివ రాత్రి రోజున కుడా వేసుకోవచ్చును. 

మీ...అనామిక....

Saturday 16 November 2013

అమ్మమ్మ చిట్కాలు - 10


షాంపు  తో  - 2 

షాంపు తో ఎన్నో ఉపయోగాలో.  ఇవి చూడండి :

  • టబ్  స్నానం చేసే వారు షాంపును బాత్ సాల్ట్ , బబుల్ బాత్ బదులు వాడ వచ్చును. 
  • బ్యాండ్ ఎయిడ్ పట్టి అతుక్కుని తీయటం కష్టం అయినప్పుడు కాటన్ బడ్ తో కొంచం షాంపు  ను పట్టిపైన అద్ది, కొంచం సేపు వదిలి వేయండి. షాంపు  లోనికి వెళ్లి జిగురును కరిగిస్తుంది. ఇప్పుడు నొప్పి లేకుండా పట్టీని సులభంగా తీయవచ్చును. 
  • జిప్ తీయటానికి కష్టం అయినప్పుడు, ఒక కాటన్ బడ్ షాంపూలో ముంచి కొద్ది కొద్దిగా జిప్ అంతా పూయండి. తరువాత జిప్ లాగితే సులభంగా వస్తుంది. 
  • షేవింగ్ క్రీం బదులు షాంపు  వాడవచ్చును. ఇది చర్మానికి హాని కలిగించదు. సాఫ్ట్ లేదా బేబీ షాంపు  వాడితే మంచిది. 
  • పాదాలకి రాత్రి పడుకునే ముందు కొంచం బేబీ షాంపూ పట్టించి కాటన్ సాక్స్ తొడిగి పడుకోండి. పొద్దున్న లేవగానే కడిగి వేయండి.  మీ పాదాలు మృదువుగా ఉంటాయి. 
  • దుస్తుల పైన రక్తపు మరకలు కనక ఉంటె, అక్కడ కొంచం షాంపూ వేసి, తడి బట్టతో కప్పి ఒక అరగంట తరువాత కొంచం రుద్ది నీటితో కడిగి వేయండి. మరకలు మాయం. 
  • కాలరు పైన ఫుల్ హాండ్స్ చేతుల కఫ్స్ పైన, పైజమల కాళ్ళ  అంచుల పైన , లంగాల అంచుల పైన పడిన మట్టి/జిడ్డు మరకలు వదిలించటం కష్టం. ఆ ప్రదేశాలలో షాంపును పులిమి, కోక అరగంట నాన పెట్టి తరువాత కొద్దిగా బ్రష్ చేసి(లేదా చేతితో) రుద్ది మాములుగా డిటర్జెంట్ పెట్టి ఉతకండి. మరకలు మాయం. 
  • షాంపుని  మల్టీ పర్పస్ క్లీనర్ లా వాడ వచ్చును. ఇంట్లో నేల తుడవడానికి, టాయిలెట్ కడగడానికి, ఫర్నిచర్ వంటి చెక్క సామగ్రిని శుభ్ర పరచటానికి వాడ వచ్చు. 
  • షాంపులో కొద్దిగా వంట సోడా కలిపి మెటల్ ముఖ్యంగా క్రోమ్ తో చేసిన వాటిని చక్కగ శుభ్ర పరచవచ్చును - అంటే క్రోమ్  తో చేసిన పంపులు  (వంటింట్లో / స్నానాల గదిలో) వంటివి. 
  • వంటింట్లో పొయ్యి, ఫ్రిజ్జ్ వంటివి శుభ్రం  చేయ వచ్చు. 
  • జిడ్డు/మురికి పట్టిన దువ్వెనలు/బ్రష్ లను షాంపులో నీళ్ళు  కలిపి అందులో కొంచం సేపు నానబెట్టి, తరువాత  కడగండి. కొత్త వాటి లాగా మెరుస్తాయి. 
  • తివాసి పైన/రగ్గుల పైన ఏదైనా వొలికినా లేదా మరకలు పడినా,  కొద్దిగా షాంపు ఒక తడి గుడ్డ పై వేసి ఆ ప్రదేశాన్నికొద్ది కొద్దిగా తుడవండి (మరీ గట్టిగా రుద్దకండి, అటు ఇటు పులిమేయకండి-అలా చేస్తే ఆ మారక అంతా అంట వచ్చు). ఇలా మారక పోయినదాక చేయండి. 
  • పిల్లలు అల్లరి చేస్తుంటే, కొద్దిగా షాంపూను నీళ్ళలో కలిపి ఒక ప్లాస్టిక్ గ్లాసులో స్ట్రా వేసి ఇవ్వండి - బుడగలు ఊది ఆడుకుంటారు. 

మీకు కుడా ఈ చిట్కాలు ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. 

మరి మికేమైనా షాంపు తో ఉపయోగాలు ఇంకా తెలిస్తే నాకు మెయిల్ చేయండి లేదా కామెంట్స్ లో వ్రాయండి. అందరికి ఉపయోగ పడుతుంది. 


మీ...అనామిక....

Friday 15 November 2013

రంగవల్లి - 169

ఇప్పుడు టౌన్లో నూ ఎక్కువగా ఫ్లాట్స్ కల్చర్ వచ్చేసింది. నగరాల్లో ఫ్లాట్స్ లోనే ఉండటం. పెద్ద ఇల్లు అదీ, విడిగా ఇండిపెండంట్ ఇల్లు అంటే మాటలు కాదు. మరి అలాంటప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేయటానికి చోటు ఉండదు. సరే మరి పరుగులు పెడుతూ మనం అంత సమయం కూడా వెచ్చించ లేము. 

అందుకని ఫ్లాట్స్ ఉన్న వారు ఇప్పుడు చిన్న ముగ్గులు ఇష్ట పడుతున్నారు. ఈ ముగ్గులు వేయటం తేలిక. ఇంట్లో కూడా పూజా మందిరం ముందరో, హాలు లోనో ఇలా నచ్చిన చోట వెసుకొవచ్చు. పండగలకి, ఇంట్లో శుభ కార్యాలకి ఎప్పుడైనా వెసుకొవచ్చును. 

ఇవిగో కొన్ని చిన్న ముగ్గులు మీ కోసం: ఇవి 5 X 5 చుక్కల ముగ్గులు:






ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ ముగ్గులు అక్కడక్కడ పెట్టి రంగులు వేసి దీపాలు పెడితే ముచ్చటగా ఉంటాయి. ఇంట్లో పార్టీ ఉన్నా ఇలా చేయవచ్చు. 

మీ...అనామిక....

Sunday 10 November 2013

రకరకాల బ్యాగులు - 2

ఇవి చూడండి: జీన్ క్లాత్ తో చేసిన చిన్న బ్యాగ్. రంగురంగుల జిప్ లతో బాగుంది కదూ? దీని స్ట్రాప్ చాల పొడువుగా ఉంది.  కావలసినట్లుగా అడ్జస్ట్ చేసు కోవచ్చు. 
ఇన్ని జిప్పులు ఉన్నాయి కాని అరలు నాలుగే. ఒక వైపు రెండు, రెండవ వైపు రెండు. 


ఇది ఇంకొక బ్యాగు. 
మన దగ్గెర ఉన్న పాత జిప్పులు, జీన్ పేంట్లతో ఇలా బ్యాగు కుట్టుకోవచ్చును. 


మీ...అనామిక....

అతివల అందం-పాదరక్షలు-6

ఇవి చూడండి బౌస్ ఉన్న పాదరక్షలు అతివల కోసం .... 




మీ...అనామిక....

Saturday 9 November 2013

రకరకాల బ్యాగులు -1

మనం అంటే లేడిస్, బట్టల తరువాత ఎక్కువగా ఇష్టపడేది బ్యాగులు. రక రకాలైనవి, రంగు రంగులవి, వివిధ సైజులవి కొంటాం. ప్రయాణాలకి, ఆఫీసుకి, పార్టిలకి ఇలా మనం వెళ్ళే పనిని బట్టి, ఉపయోగ పడేటట్లు ఉండాలి. 

ఇది చూడండి:
ఇది చాలా  తేలికగా ఉంది, రంగు రంగులలో దొరుకుతుంది, ధర తక్కువే. 
అయితే ఇది పారదర్శకంగా ఉన్నందు వలన లోపల పెట్టిన వస్తువులు కనిపిస్తో ఉంటాయి. 
వివిధ రంగులలో లభ్యం. 
నగలు పెట్టుకోవటానికి, నగలు మనతో తీసుకు వెళ్ళటానికి, కాస్మెటిక్స్ పెట్టుకోవటానికి వాడు కోవచ్చును. పిల్లల కలాలు, రంగు పెన్సిల్స్ వంటివి పెట్టుకోవచ్చు. చెక్ బుక్స్, క్రెడిట్ /డెబిట్ /పాన్ కార్డ్లులు వంటివి భద్రంగా అటు ఇటు చెల్లా చెదురు అయిపోకుండా పెట్టుకోవచ్చు. దీనిని మన భుజానికి తగిలించే పెద్ద షోల్డర్ బ్యాగులో వేసుకుని మనతో తీసుకు పోవచ్చును. 

బాగుంది కదూ? ఎవరికైనా గిఫ్ట్ ఇవటానికి కూడా బాగుంటుంది. 
మీ...అనామిక....

ఆణి ముత్యాలు - 9


మనసుకు కష్టం కలిగించే విషయాలను 
మరచిపోవాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి, 

మనసుకి సంతోషం కలిగించే విషయాలను 
గుర్తుచేసుకుంటూ ఉండాలని ఎప్పుడు మరిచిపోకూడదు. 

మరి మీరు ఏమంటారు?


మీ...అనామిక....

Friday 8 November 2013

ఆణిముత్యాలు -8



బాగుంది కదండీ? 

కష్టాలు మన మనసుని మార్చేందుకు భగవంతుని ప్రయత్నం, 
ప్రార్ధనలు భగవంతుని మనసును మార్చేందుకు మన యత్నం . 

చివరికి గెలుపు ఎవరిదీ అనేదే జీవితం. మనకు పట్టుదల, ఆత్మా విశ్వాసం, భగవంతుని పై అపార నమ్మకం ఉండి, ఆ భగవంతుని ఆర్తి తో వేడుకుంటే ఆ కరుణామయుడు మనని చల్లగా చూస్తాడని నా నమ్మకం. ఏమంటారు? 

మీ...అనామిక....

ఆకు సంపెంగ


మా తోటలో మొట్ట మొదటగా పూసిన ఆకు సంపెంగ పువ్వు. 
నాకు సంపెంగలంటే చాలా ఇష్టం. మా ఇంట్లో మూడు రకాల సంపెంగలు ఉన్నాయి. ఇదిగో ఇది ఆకు పచ్చ సంపెంగ. మొన్ననే పూసింది మెదటి సారి. చాలా సంతోషం అనిపించింది ఆ పువ్వును చుస్తే. వీటి సువాసన అంటే నాకు చాల ఇష్టం. ఇప్పుడిప్పుడే  మొగ్గలు తోడుగుతోంది. 

మీ...అనామిక....

Saturday 2 November 2013

రంగవల్లి - 168

దీపావళి స్పెషల్ 

21 నుండి 1 సరి చుక్క. 

అందరికి దీపావళి శుభాకాంక్షలు. 

మీ...అనామిక....

రంగవల్లి - 167

దీపావళి స్పెషల్ 

ఈ సారి చతురస్రాకారం లో ముగ్గు. 
13X 13 చుక్కలు. చుక్కలు దూరంగా పెట్టుకుంటే, పెద్దగా  కనిపిస్తుంది. పద్మాలు లక్ష్మీ దేవికి చాలా ఇష్టం కదూ, అందుకనే పద్మాల/దీపాల ముగ్గు. దీపం చీకటిని పారద్రోలి వెలుగును నింపుతుంది.  

మీ...అనామిక....

Friday 1 November 2013

రంగవల్లి - 166

దీపావళి స్పెషల్ 

5X5


మీ...అనామిక....

రంగవల్లి - 165

దీపావళి స్పెషల్ 

6 X 6
ఇది కూడా సులభంగా వేసుకోవచ్చు.  

మీ...అనామిక....

రంగవల్లి-164

దీపావళి స్పెషల్ 

ఇది 5 X 5 బ్లొక్స్-నాలుగింటిని జత చేసి వేసినది. 

మీ...అనామిక....

రంగవల్లి - 163

దీపావళి స్పెషల్ 

4 X 4 చుక్కలు
దీపాలు, మధ్యలో ఓం. చాలా సులభంగా వేసుకోవచ్చును. 

మీ...అనామిక....