Thursday 31 October 2013

రంగవల్లి - 162

దీపావళి స్పెషల్ 

ఇంకొక ముగ్గు-చాలా  తేలికైనది. 
11 X 1 సరి చుక్క. 
పైన ఉన్న ముగ్గును ఇంకొంచం అలంకరించాను.. ఐతే నేను వేసిన స్వస్తిక తప్పు. అది ఇలా ఉండాలి. దయచేసి గమనించి సరి చేసుకోండి. 
ఇది నేను ఎప్పుడో వేసినది. మళ్లీ సరి చేయలేక అలాగే పెట్టాను. 

మీ...అనామిక....

Wednesday 30 October 2013

రంగవల్లి -161

 దీపావళి స్పెషల్ 

ఇది 11 X 1 సరి చుక్క. 

మీ...అనామిక....

రంగవల్లి -160

 దీపావళి స్పెషల్ 

ఇదిగోనండి చాలా సులభమైన ముగ్గు. 
ఇది 5X5 బ్లొక్. మధ్యలో స్వస్తిక, నలుగు కోణాలలో దీపాలు. చిన్న ముగ్గు కావాలంటే ఇది ఒకటే వేసుకొవచ్చును.

ఇంట్లోనూ, బయట అక్కడక్కడ ఇలాంటి చిన్న ముగ్గులు వేసి, రంగులు నింపి దీపాలు పెడితే బాగుంటుంది

కార్తీక మాసమంతా దీపాలు పెడతాం కాబట్టి రోజు వేసుకోవచ్చును ఇలాంటి చిన్న ముగ్గులు. 

చుక్కలు దూరంగా పెట్టుకుంటే ఇంకా పెద్దదిగా కనిపిస్తుంది.  
పెద్దదిగా కావాలంటే ఇలా వేసుకొవచ్చును. ఇక్కడ 5X4-అంటే ఒక వరుస రెండు బ్లొక్స్ కి కామన్. అలా కాక 5X5 కూడా విడివిడిగా వేసుకొవచ్చును. 

మరి చూస్తూ ఉండండి నా బ్లొగ్ మరిన్ని దీపావళి రంగవల్లుల కోసం........ 

మీ...అనామిక....

Saturday 19 October 2013

హాయ్

హాయ్ అండీ. ఎలా ఉన్నారు మీరంతా? చాలా రోజులు అయ్యింది కదూ మనం కలుసుకుని. నాకు ఆరోగ్యం బాగుండటం లేదు. ఎక్కువగా టైపు చేయలేను. ఇప్పుడు కొద్ది కొద్దిగా కోలుకుంటున్నా. 

అదీ కాక తెలుగు లో టైపు చేసి టపా పెట్టాలంటే "అ"-తెలుగు ఐకాన్ కనబడ కుండా పోయింది. ఏమి చేయాలో  తెలియలా. వేరే చోట టైపు చేసి ఇక్కడ పేస్టు చేద్దాము అని అనుకున్నాను. కాని తప్పులు వస్తే మళ్లి అక్కడకి వెళ్లి సరి చేసి తెచ్చుకోవాలి. 

మిమ్మల్ని ఎవరినైనా అడుగుదాము అని అనుకుంటుండగా ఇవాళ ఐకాన్ ప్రత్యక్ష మైనది. ఎంత సంతోషం అనిపించిందో చెప్పలేను. 

దీనికి తోడూ, కరెంటు కోతలు, గంటలు గంటలు. అందుకనే ఎన్నో ముగ్గులు, శ్రావణ మాసం వ్రతాలకి, దసరాకి రెడీ  చేసి కూడా పోస్ట్ చేయ లేక పొయను. 

ఇప్పుడు దీపావళికి  మంచి మంచి ముగ్గులు వేస్తున్నా. నా బ్లాగ్ చూస్తూ ఉండండి, పోస్ట్ చేస్తాను. ఇంకా ఎన్నో మీతో పంచుకొవాలి. కాని ఒకే సారి ఎక్కువ టైపు చేయలేను. 

కాని మీరు చూస్తూ ఉండండి నా బ్లాగ్. నేన్ను చాలా విషయాలు మీతో పంచుకొవాలి. 


మీ...అనామిక....