Tuesday 6 August 2013

పండంటి జీవితానికి ......

15 సూత్రాలు -3

3. Give up on blaming others: ఇతరులపై నిందలు వేయటం అపాలి. 

మనం సాధారణంగా మనకు జరిగిన కష్ట-నష్టాలకు ఇతరులను దోషులను చేస్తాం. ఇతరులను కారణంగా చూపించి, మన వైఫల్యాలకు వారిని బాధ్యులను చేస్తాం. ఇలా చేసి హమ్మయ్య మన తప్పు లేదు అని అనుకుంటాం. ప్రతి వైఫల్యానికి పరిస్థితులనో, సమాజాన్నో లేదా ఇతరులనో దోషులుగా నిలబెడతాం.  అది ఆత్మా వంచన- మనని మనము మోసం చేసుకున్నట్లే.  మనం చేసిన పనులకు మనమే బాధ్యులం అన్నది సత్యం. ఇదేగా మన పెద్దలు చెప్పిన కర్మ సిద్ధాంతం కూడా. 

సమయానికి చేరుకో లేక పొతే ట్రాఫిక్ ను నిందిస్తాం. అంతే కాని మనం తొందరగా బయలుదేరవచ్చుగా అని అనుకోం. మార్కులు తక్కువ వస్తే అధ్యాపకులను, జీవితంలో ఆశించిన ఎత్తుకు ఎదగ లేక పొతే తల్లి-తండ్రులను, సమాజాన్ని నిందిస్తాం. అయితే దీని వలన ఏమి సాధిస్తాం? 

దీని వలన మనకే నష్టం. మనం చేసిన తప్పొప్పులను మనం గ్రహించగలిగితే, మనని మనం సరిదిద్దుకుని సరి అయిన మార్గంలో ముందుకు పోగలుగుతాం.  

ఒక వేళ నిజంగా ఎవరివల్లనైన నష్టం జరిగినా, వారిని నిందిస్తూ కూర్చుంటే లాభం ఉండదు కదా. మనం తప్పు చేసినా సరే, ఈ సూత్రం వర్తిస్తుంది. చేసిన తప్పును తెలుసుకుని దానినుండి మనం పాఠం నేర్చుకుని ముందుకు సాగిపొవాలి. అంతే  కాని మనని మనం నిందిస్తూ కూర్చుంటే ఎలా? 

పరిస్థితులు కాని, సమాజం కాని లేదా మన చుట్టూ ఉన్నవారు కాని మనని నిరంతరం ప్రభావితం చేస్తూ ఉంటారు. మంచి-చెడు రెండూ ఉంటాయి. ఎంతోమంది ఎన్నో చెప్తారు. అన్ని విని పరికించి మంచి-చెడ్డ అలోచించి ఆచరణలో పెట్టాలి. ఏదైనా క్రియ చేసేది మనమే కాబ్బట్టి, దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి. 

మంచి చెడు తేడాలను తెలుసుకోగల తెలివిని మానవులకు మాత్రమే ప్రసాదించిన వరం. మరి మనకిచ్చిన తెలివితేటలను ఉపొయొగించకున్ద ఇతరులను నిందిస్తూ కూర్చుంటే మనం సంతోషంగా ఉండలేం. 

అందుకని ఈ అలవాటుని మానుకుని మనం చేసిన/చేస్తున్న క్రియను, తీసుకున్న నిర్ణయాలను విశ్లేషించుకుని ఎక్కడ తప్పు చేసామో చూసుకుని, మనకున్న పరిధిలో మనని మనం సరి అయిన మార్గంలో పెట్టుకుంటే విజయాలు తప్పక మనవే. 

నేనూ ఈ నిజాన్ని ఆలస్యంగా ఒప్పుకున్నా. కొంత వరకు ఆచరణలో పెట్టా. ఏదైనా అలవాటు, అదీ చెడు అలవాటు తొందరగా మార్చలేము కదా. దీని వలన కొంత వరకు ప్రశాంతత పొందా,  ప్రగతిని సాదించా. 

కొన్ని సందేశాలు మీ కోసం:

All blame is a waste of time, no matter how much fault.

Blaming others is excusing yourself. 

Never blame any one in life:
Good people give happiness,
Bad people give experiences,
Worst people give a lesson,
Best people give memories.

మరి మీరు నాతొ ఏకిభావిస్తారా ?


మీ...అనామిక....



No comments: