Tuesday 13 August 2013

ఆణి ముత్యాలు -7


మనం మనకి చెప్పని/అందని క్షమాపణలను అంగీకరించినప్పుడే మన జీవితం సుగమ మౌతుంది. (నాకు అంత బాగా తర్జుమా చేయటం రాదు.)

జీవితం హాయిగా బతికేయటానికి ఇది ఒక చిట్కా. మనకి ఎవరైనా కష్టం కాని నష్టం కాని కలిగించినప్పుడు, వారి మిద మనకు కోపం కలగటం సహజమే. మనమూ  మనుషులమేగా. వారు తమ తప్పును తెలుసుకుని మనకు క్షమాపణలు చేపితే సరే. లేదంటే మనకు బాధ కసి రెండూ కలగవచ్చును. అయితే కాలమే ఆ గాయాన్ని మన్పుతుంది. 

కాని కొంత మంది ఆ విషయాన్నే పడే పదే గుర్తుకు తెచ్చుకుని లోలోనే రగిలిపొతారు. కసి కాస్తా  ద్వేషంగా మారుతుంది.  పగ ద్వేషాలతో రగిలిపోయే హృదయం అల్లకల్లోలంగా ఉంటుంది. విచక్షణ కోల్పోతుంది.

ఇంకొక అడుగు ముందుకి పడితే ప్రతీకారం తీర్చుకోవాలని కుడా అనిపిస్తుంది. కొంతమంది ఆవేశపరులు తీర్చుకుంటారు కూడా. అయితే దీని వలన నష్ట పోయేది మనమే అని ఎంత మంది ఆలోచిస్తారు? 

మనకు మానసిక ప్రశాంతత ఉండదు. దిని వలెనే అనేక రోగాలు వస్తాయి- బీపి, షుగరు, కేన్సర్, హార్ట్ ఎటాక్ వంటివి. ప్రతీకార చర్యగా కొట్టుకోవడమో, చంపుకోవడమో జరిగిందంటే, ఇహ జీవితం అయిపొయినట్లే. పోలీస్ స్టేషన్, కోర్ట్ , జైలు -వీటిలో చిక్కు బడి పోతాం. 

అదే మనం ఎదుటివారి తప్పులని వారు క్షమాపణ చెప్పక పోయినా, వారిని క్షమించి వదిలేస్తే మనకి మంచిది. క్షమా అనేది చాల గొప్ప గుణం అని అన్ని మాతాలు బోధిస్తాయి. ఇది చెప్పినంత తేలిక కాక పోయినా, ఆచరిస్తే మన జీవితమే హాయిగా ఉంటుంది. లేదా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వారం అవుతాము. 


మీ...అనామిక....

No comments: