Wednesday 31 July 2013

పండంటి జీవితానికి ......

15 సూత్రాలు -1


ప్రతి మనిషి తన జీవితం హాయిగా ఎలాంటి కష్టాలు లేకుండా సాగి పొతే  బాగుంటుంది అని అనుకుంటాడు. అసలు కష్టాలు, దు:ఖాలు లేకుండా జివింతం ఉండదు, సాధ్యం కాదు. ఉన్నా మనం ఆనందించ లేము. మన జీవితంలో కష్ట నష్టాలను ఎదురుకుంటో, పరిస్థితులను మనకి కావలసిన రీతిలో మలచుకుంటూ జీవించటం లోనే ఒక ఆనందం, ఒక తృప్తి. అసలు అదే ఒక సవాల్. 

కొన్ని సూత్రాలు పాటిస్తే, జీవితం హాయిగా ఆనందంగా గడపవచ్చు. కొంతైన మన వంతు ప్రయత్నం మనం చెయ్యాలి. ఎన్నో సూత్రాలు ఉన్నయి.  

ఇప్పుడు మాత్రం పండంటి జీవితానికి 15 సూత్రాలను చెప్పుకుందాం. 

1. Give up your need to be always right: నేను చెప్పినదే సరి అయినది లేదా నేను చెప్పినదే సత్యం అనే ఆలోచన/పధ్ధతి మానుకొవలి. 

మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఏదో ఒక మాట అంటాం. మనం చెప్పింది అక్షరాలా నిజమే అయి ఉండవచ్చును. మనం చెప్పింది మంచి మాటే కావచ్చు. కాని ఎదుటి వ్యక్తి దానిని ఒప్పుకోకపోవచ్చును- సరిగ్గా అర్ధం చేసుకోలేక కాని, తనకు నచ్చక కాని. కొంత మందికి ఎదుటి వారు చెప్పినదంతా ఖండిచడమే పని. ఎదురు వాదిస్తారు. 

మనం మంచికి చెప్పినా ఒకటికి రెండు సార్లు చెప్పి ఊరుకోవాలి. మృదువుగా చెప్పాలి. అలా  కాక వాళ్లతో వాదం పెట్టుకుంటే మాట మాట పెరుగుతుంది. చూస్తూ ఉండగానే చిన్న మాట పెద్దదై పోట్లాటల వరకు దారి తీస్తుంది. బంధువులతో కాని స్నేహితులతో కాని వివాదాలకు పొతే చిన్న మాటతో సంబందాలు తెగే  దాకా రావచ్చును.  

మనం చెప్పిన ప్రతి దానితో ఎదుటి వారు ఏకీభవించాలని లేదు. వారు చూసే కోణం కాని లేదా వారి అనుభవం వలన కాని మనం చెప్పేది వారికి సరి అనిపించక పొవచ్చును. 

కాని కొంతమంది మాత్రం తానూ చెప్పింది ఎదుటి వారు ఒప్పుకున్నాదాకా వదలరు. కొందరు విసిగి పోయి చివరికి వీరు చెప్పినది అయిష్టంగా ఒప్పుకుంటారు. 

ఇలా చేసినందు వల్ల ఆ నిమిషంలో మనం గెలిచినా, వారితో నున్న సంబంధాలు దెబ్బతింటాయి. ఇది భార్య-భర్తల మధ్యన గొడవలకి ఒక కారణం కూడా

అందుకే మన పెద్దలు ఒక మాట అన్నారు: The more arguments you win, the more friends you loose అని. కాబట్టి మనం మరీ  తెగే దాక కాక, మృదువుగా చెప్పి ఒప్పించ గలిగితే సరి. లేదా అంతటితో ఆ మాటను వదిలేయాలి. 

మరి మీరేమంటారు?

వచ్చే టపాలలో మిగిలినవి..... 


మీ...అనామిక....

No comments: