Friday 26 July 2013

ఆణిముత్యాలు - 3


రెండే ముక్కల్లో ఎంతో సత్యం చెప్పారు. 

మన జీవితం లో చాలా సమస్యలు రెండిటి వలన కలుగుతాయి - ఆలోచించ కుండా చేసే పనులు, పనులు చేయ కుండా ఆలోచిస్తూ కూర్చోవడం. 

ఆలోచించకుండా ఏ పని చేసినా, అసలు ఒక్క మాట మాట్లాడినా ఎంతో కష్టం. ఒక మాట అనే ముందు ఆచి, తూచి, అలోచించి అనాలని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే అనాలోచితంగా మాటలనేసి ఆ తరువాత నాలిక కర్చుకుంటే ఏమి లాభం? అసలు ఇలాంటి మాటల వలన చాలా నష్టం జరగడం అనేది మనం రోజు ఎదురుకుంటూ ఉంటాం. నోరు జారిన తరువాత అయ్యో అని చెంపలు వేసుకున్న సందర్భాలు ఎన్నొ. ఒక్క మాట మనసుని నొప్పించినంతగా బహుశ ఒక దెబ్బ కూడా నొప్పించక పొవచ్చు. 

ఇహ చేతల విషయానికి వస్తే ఏ పని అయినా అన్ని జాగ్రత్తగా అలోచించి, ఇతరుల(పెద్దలు, అనుభవగ్యులు) సలహా కూడా అవసరమైతే అడిగి మరీ చేస్తేనే మంచిది. దీని వలన శ్రమ, సమయం మరియు డబ్బు వృధా అవకపోవడమే కాక మంచి ఫలితాన్ని పొంద వచ్చు. 

ఆలోచించి చేయాలి కదా అని ఆలోచిస్తూ కూర్చుంటే కూడా నష్టమేగా. కొంత మంది అలా ఆలోచిస్తూ జాప్యం చెస్తారు. ఏ పాటికి ఒక నిర్ణయం తీసుకోరు. ఇది ఇబ్బందే. చేయవలసిన పని సకాలంలో చేయక పొతే చేసినట్లే కాదు కదా. 

అందుకే బాగా అలోచించి, ఉన్న పరిస్తితులను బట్టి సకాలంలో నిర్ణయం తీసుకుని సరి అయిన సమయం లో ఆచరిస్తేనే  సరి అయిన ఫలితం ఉంటుంది. 

మరి మీరేమంటారు ?

మీ...అనామిక....

No comments: