Monday 17 June 2013

భద్రం బీ కేర్ఫుల్ ..... 1


మన ఆడవాళ్లకి నగలు అంటే ఎంతో  ఇష్టం.  బంగారం, ముత్యాలు, రత్నాలు ఇలా ఒకటేమిటి ఎన్నో కొంటాము. ఇప్పుడు బంగారం కొనలేక గిల్టు నగలు (వన్ గ్రామ్ బంగారం) కొంటున్నాము. చెవి దుద్దులు, లోలాకులు, హారాలు, గాజులు ఇలా ఎన్నో ఎన్నెనో. అయితే వీటిని మనం సరిగ్గా భద్ర పరుచుకుంటున్నామా?

కొనగానే సరి పోదు. వాటిని సరిగ్గా భద్రపరుచు కోవాలి. లేదంటే అంత ఖరీదు పెట్టి కొన్నవి పనికి రాకుండా పొతాయి. ముఖ్యంగా బంగారంవి అయినా  గిల్టువి అయినా వాటి మెరుగు తగ్గుతాయి, గీతలు పడవచ్చు, రాళ్ళూ, ముత్యాల వంటివి ఊడి పోవచ్చు. కాబ్బట్టి నగలను జాగ్రత్తగా భద్ర పరుచుకొవాలి. 

ముందుగా ఈ టపాలలో నగలను భద్రపరుచుకునేందుకు ఉన్న వివిధ మార్గాల గురించి చెప్పుకుందాం. 

గాజులను భద్రపరచడం ... 

గాజులంటే నాకు చాలా ఇష్టం. అందులోను మట్టివి అంటే మరీను. మెటల్, రాళ్లవి , మట్టి, లక్క ఇలా ఎన్నో గాజులు కొంటాను. కొత్త చీర కొన్నప్పుడల్లా నప్పే గాజులు కోన వలసిందే. యాత్రలకి వెళితే గుడి దెగ్గర పసుపు కుంకుమతో పాటు గాజులు కొంటాము. ఇలా నా దెగ్గర చాలా గాజులు పోగు అయ్యాయి.  వాటిని భద్రపరచటం నాకు పెద్ద సమస్యగా మారింది. 

ఇదిగో ఇలా చెక్కతో చేసిన గాజుల స్టాండ్  కొన్నాను. 
ఇవి  రెండు-మూడు  సైజుల లో దొరుకుతాయి. ధర పెద్ద ఎక్కువేమి కాదు. మనకు ఉన్న గాజులను బట్టి చిన్న-పెద్ద స్టాండు ఎంచుకొవచ్చును. గాజులు అమ్మే కోట్లల్లో కాని లేదా ఫ్యాన్సీ వస్తువులు అమ్మే షాపులలో దొరుకుతాయి. 
ఇదిగో ఇలా నా గాజులను అమర్చుకున్నాను. రెండు వైపులా అమర్చుకొవచ్చును. 
పైన ఒక ప్లాస్టిక్ కవర్ తోడిగితే దుమ్ము పడకుండా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ పైన కాని, అలమార లో కాని కిటికిలో కాని మనకి కావలసిన చోటు పెట్టుకోవచ్చు. 

అన్నీ  పేర్చినట్లు చక్కగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు కావలసినవి చటుక్కున తిసుకొవచ్చును. గాజులను తీయటము, పెట్టటము సుళువు. 

మరి వచ్చే టపాలలో ఇంకొన్ని .... 

మీ...అనామిక....

No comments: