Tuesday 25 June 2013

Monday 24 June 2013

ఆణి ముత్యాలు -2


ఎంత చక్కని సుత్రాలో ఇవి.  నాకు నచ్చిన వాటిలో ఇది ఒకటి. 

1. మనం చేసిన తప్పులు ఒప్పుకునేందుకు ఎంతో ధైర్యం కావాలి. ఎదుటి వారి ముందర మనం చేసిన తప్పులు ఒప్పుకోవటమంటే చాలా కష్టం. మన అహం అడ్డు  వస్తుంది. ఇంక క్షమాపణలు కోరుకోవటం అంటే ఇంకా కష్టం. అందుకేనండి చేసిన తప్పులను ఒప్పుకుని క్షమాపణలు కోరుకునేవారు అందరికంటే ధర్యవంతులు అని అన్నారు. 

అసలు చేసిన తప్పులను ఒప్పుకుని క్షమాపణలు చెప్పుకుంటే, గుండె తేలిక పడుతుంది. లేదా జీవితాంతము మనం శాంతిని పొందలేము. 

2. & 3. ఎదుటి వారి తప్పులను/కీడుని మనం గుర్తించినప్పుడు, ఆ తప్పుల లేదా కీడు వలన మనకి నష్టం కలిగినప్పుడు, వాటిని మర్చిపోయి, వారిని క్షమించ గలగటం అనేది చాలా అరుదు. అలా చేయగలిగిన నాడు  మనం అందరికంటే బలవంతులమే కాదా.

మనకి జరిగిన చెడుని మర్చిపోయి ఆ చెడు చేసిన వారిని క్షమించాలంటే  ఎంతో గుండె ధ్యైర్యం కావాలి. కాని అలా చేయక పొతే, ఆ చెడుని తలుచుకుని మనం భాద పడటం, ఆవేశ పడటం చేస్తాం. ఆవేశం లో మనం ఏదైనా తప్పటడుగు వేస్తే మన జీవితం నాశనమే. అదే తలచుకుని భాద పడుతూన్నా మానసికంగా కుమిలి పోతాం. అదే రోగానికి దారి తీస్తుంది. అలా కాక వారిని క్షమిస్తే మనం ఆనందంగా సుఖంగా ఉంటాము. 

అందుకని మన పెద్దలు క్షమా గుణం చాలా గొప్పది అన్నారు. ఈ 3 సూత్రాలను పాటిస్తే మన జీవితం హాయిగా, ప్రశాంతంగా సాగి పోతుంది. మరి మీరు ఏమంటారు ?

మీ...అనామిక....

లేటెస్ట్ చెవి దుద్దులు- కమ్మలు -2

టీనేజ్ అమాయిలకీ,  ట్రెండీ గా కనిపించాలనుకునే వారి కోసం ..... ఫైబర్ జ్యువలరీ 



ఇవి ఫైబర్ తో చేసినవి అనుకుంటాను. బరువు చాల తక్కువ, రకరకాలైన రంగులు, ఆకారాలలో లభ్యం. ధర కూడా తక్కువే. 

మరి కొన్ని వచ్చే టపాలలో ....... 

మీ...అనామిక....

Sunday 23 June 2013

ఆణి ముత్యాలు -1

జీవితం ముఖ్యంగా మనవ జన్మ ఏంతో ఉన్నతమైనది. మనం సరైన మార్గం ఎంచుకుని, అందులో ముందుకు సాగితే ఏంతో సాధించగలం. మధ్యలో వచ్చిన ఆటు-పోట్లను తట్టుకుని మనం ధైర్యంగా ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఇతరులకు మార్గదర్శకులు కావాలి. 

వివిధ మతాలలోని సారాంశం అయినా, మహాత్ముల జీవితాలను తరచి చుసినా ఈ జీవిత సత్యాన్నే తెలుసుకుంటాము. అవే మనం చిన్న చిన్న ఆణి ముత్యాల రూపం లో చెప్పుకుంటే బాగుంటుంది కదూ ?

ఈ శీర్షికలో నా ప్రయాస అదే. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను... 


మీ...అనామిక....

Saturday 22 June 2013

భద్రం బీ కేర్ఫుల్ - 4


ఇప్పటి వరకు మనం గాజులు భద్రపరచు కోవటానికి ఉన్న సాధనాలు చూసాం. ఇప్పుడు భద్రపరచు కోవటానికే కాదు మనతో ఎక్కడి కైనా తీసుకు వెళ్ళటానికి కూడా ఉపయోగ  పడేవి చూద్దామా?
ఇది లెదర్ తో చేసినది. గుండ్రంగా, గట్టిగా ఉండటం వలన గాజులు సురక్షితంగా ఉంటాయి. 

లోపల ఫెల్ట్  ఉండడం వలన గాజులకు కుషన్  లాగా ఉండి భద్రంగా ఉంచుతుంది. మధ్యలో సెపరేటర్ లు రెండు ఉన్నాయి. ఇవి మనకి నచ్చినట్లుగా పెట్టుకోవచ్చును. 
ఇది ఖరీదైన గాజులు పెట్టుకోవటానికే  కాక ప్రయాణాలలో తిసుకు వెళ్లటానికి  కూడా బాగుంటుంది. ఇందులో వివిధ సైజులు ఉన్నాయి. 

మీ...అనామిక....

తిలకము దిద్దరుగా -4


కొన్ని డిజైన్లు మీ కోసం :
గుండ్రని చుక్క--మన ముఖాన్ని బట్టి నప్పే సైజు లో పెట్టుకుంటే బాగుంటుంది. 


మీరు మీకు నచ్చిన రంగులలో పెట్టుకుని చూడండి. మరి కొన్ని వచ్చే టపాలలో. 



మీ...అనామిక....

Friday 21 June 2013

లేటెస్ట్ చెవి దుద్దులు - కమ్మలు -1

ప్రస్తుతం మార్కెట్ లో  ఉన్న లేటెస్ట్ చెవి దుద్దులు,  కమ్మలు 
ముదురు ఆకు పచ్చ , మజెంత రంగులలో .. 
ఇవి రకరకాలైన ఆకారాలలో/డిజైన్ల లో  దొరుకుతున్నయి. కాని రంగులు మాత్రం ఇవే కనిపించాయి మరి.  పెద్ద ఖరీదు కాదు. బాగున్నాయి కదూ ? టీనేజ్ వాళ్ల  నుండి 40+ వరకు కూడా పెట్టు కొవచ్చును. 

మరి కొన్ని వచ్చే టపాలలో ..... 

మీ...అనామిక....

భద్రం బీ కేర్ఫుల్ -3


మనం గాజులను భద్ర పరిచే సాధనాలను గురించి చెప్పుకుంటున్నాము కదా? ఇప్పుడు మరి ఒకటి చూద్దాం. 

ఇవి ఫైబర్ తో చేసిన పెట్టెలు. వీటిల్లో చిన్న పెద్ద సైజులు ఉన్నాయి.  ఖరీదైన  గాజులు-రాళ్ళవి, మెటల్, లక్క వంటివి ఇందులో భద్ర పరిస్తే చక్కగా ఉంటాయి. దుమ్ము పడుతుందేమో అని భయం లేదు.  పెట్టె పారదర్శకంగా ఉంది కాబట్టి లోపలి గాజులు పెట్టెను తెరవకుండానే చూడవచ్చు. 

కాకపొతే ఇవి క్రింద పడినా ఏదయినా గట్టిగా తగిలినా విరిగె ప్రమాదం ఉండ వచ్చు. అలాగే వీటి అంచులు  పదునుగా గీసుకునేటట్లు  ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే మేలు.  అయినా గాజులంటే మనము జాగ్రత్తగానే ఉంటాం కదా. 
చాల గాజులు పడతాయి














ధర మరీ ఎక్కువేమి కాదు. ఇవి 3-4 రంగులలో దొరుకుతాయి. ఇప్పటి వరకు, నాకు ఈ పెట్టేలే బాగా నచ్చాయి. అలమారలో పెట్టుకోవటానికి కూడా చక్కగా ఉన్నాయి. చాలా  గాజులు ఒకే పెట్టెలో పెట్టు కావచ్చును. 

మీ...అనామిక....

Thursday 20 June 2013

భద్రం బీ కేర్ఫుల్-2


గాజులు పెట్టుకోవడానికి, ఇదిగో ఈ స్టాండ్ ఉపయొగపడుతుంది. చెక్కతో చేసింది. వీటిలో కూడా సైజులు ఉన్నాయి. 
రోజు వేసుకునేవి ఇలా తగిలించుకొవచ్చును. డ్రెస్సింగ్ టేబుల్ పై అమర్చుకుంటే వీలుగా ఉంటుంది. ఈ లింకు లో ఉన్న స్టాండ్ చూడండి. 

ప్రొద్దునే హడావిడిగా ఉండే వారు, ముందు రోజు రాత్రే కావలసిన గాజులు, ఇతర నగలు తీసి ఇలా ఈ స్టాండ్ కు పెట్టుకుంటే, సమయం వృధా అవదు. చివరి నిమిషంలో వాటికోసం వెతుక్కునే పనీ  ఉండదు. 

మీ...అనామిక....

తిలకము దిద్దరుగా ...3

 ఇదిగోనండి కొన్ని డిజైన్లు 


ఇంకా ఆలస్యమెందుకు? మీకు నచ్చిన్న రంగుల తిలకంతో పెట్టుకోండి బొట్టు.   అందరికంటే ప్రత్యేకంగా కనిపించండి. చీర /చుడిదార్/డ్రెస్ ఏదైనా సరే ఇవి నప్పుతాయి. ఎథ్నిక్ లుక్ మీ సొంతం. 

మరి కొన్ని వచ్చే టపాలలో .... 

మీ...అనామిక....

Monday 17 June 2013

భద్రం బీ కేర్ఫుల్ ..... 1


మన ఆడవాళ్లకి నగలు అంటే ఎంతో  ఇష్టం.  బంగారం, ముత్యాలు, రత్నాలు ఇలా ఒకటేమిటి ఎన్నో కొంటాము. ఇప్పుడు బంగారం కొనలేక గిల్టు నగలు (వన్ గ్రామ్ బంగారం) కొంటున్నాము. చెవి దుద్దులు, లోలాకులు, హారాలు, గాజులు ఇలా ఎన్నో ఎన్నెనో. అయితే వీటిని మనం సరిగ్గా భద్ర పరుచుకుంటున్నామా?

కొనగానే సరి పోదు. వాటిని సరిగ్గా భద్రపరుచు కోవాలి. లేదంటే అంత ఖరీదు పెట్టి కొన్నవి పనికి రాకుండా పొతాయి. ముఖ్యంగా బంగారంవి అయినా  గిల్టువి అయినా వాటి మెరుగు తగ్గుతాయి, గీతలు పడవచ్చు, రాళ్ళూ, ముత్యాల వంటివి ఊడి పోవచ్చు. కాబ్బట్టి నగలను జాగ్రత్తగా భద్ర పరుచుకొవాలి. 

ముందుగా ఈ టపాలలో నగలను భద్రపరుచుకునేందుకు ఉన్న వివిధ మార్గాల గురించి చెప్పుకుందాం. 

గాజులను భద్రపరచడం ... 

గాజులంటే నాకు చాలా ఇష్టం. అందులోను మట్టివి అంటే మరీను. మెటల్, రాళ్లవి , మట్టి, లక్క ఇలా ఎన్నో గాజులు కొంటాను. కొత్త చీర కొన్నప్పుడల్లా నప్పే గాజులు కోన వలసిందే. యాత్రలకి వెళితే గుడి దెగ్గర పసుపు కుంకుమతో పాటు గాజులు కొంటాము. ఇలా నా దెగ్గర చాలా గాజులు పోగు అయ్యాయి.  వాటిని భద్రపరచటం నాకు పెద్ద సమస్యగా మారింది. 

ఇదిగో ఇలా చెక్కతో చేసిన గాజుల స్టాండ్  కొన్నాను. 
ఇవి  రెండు-మూడు  సైజుల లో దొరుకుతాయి. ధర పెద్ద ఎక్కువేమి కాదు. మనకు ఉన్న గాజులను బట్టి చిన్న-పెద్ద స్టాండు ఎంచుకొవచ్చును. గాజులు అమ్మే కోట్లల్లో కాని లేదా ఫ్యాన్సీ వస్తువులు అమ్మే షాపులలో దొరుకుతాయి. 
ఇదిగో ఇలా నా గాజులను అమర్చుకున్నాను. రెండు వైపులా అమర్చుకొవచ్చును. 
పైన ఒక ప్లాస్టిక్ కవర్ తోడిగితే దుమ్ము పడకుండా ఉంటుంది. డ్రెస్సింగ్ టేబుల్ పైన కాని, అలమార లో కాని కిటికిలో కాని మనకి కావలసిన చోటు పెట్టుకోవచ్చు. 

అన్నీ  పేర్చినట్లు చక్కగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనకు కావలసినవి చటుక్కున తిసుకొవచ్చును. గాజులను తీయటము, పెట్టటము సుళువు. 

మరి వచ్చే టపాలలో ఇంకొన్ని .... 

మీ...అనామిక....

Saturday 15 June 2013

డిజైనర్ కోస్టర్ -4

ఈ సారి కూడా కుందన్ సీతాకోక చిలుకలు, కుందన్ లతో అలంకరణ 


ఇలా ఎన్నో అలంకరణలు మనకు నచ్చినవి చెసుకొవచ్చును. ... మరి కొన్ని వచ్చే టపాలలో ...... 

మీ...అనామిక....

Friday 14 June 2013

తిలకము దిద్దరుగా ...2

మనం చిన్నప్పుడు ఈ ఆకారాలను తిలకంతో పెట్టుకునే  వాళ్ళం కదూ,  ఒక్క సారి గుర్తు చేసుకుందామా ?
చుక్క లేదా గుండ్రని బొట్టు, కోల  బొట్టు, నిలువు లేదా పొడువు బొట్టు, దోస గింజ బొట్టు. 
 డైమండ్ 
చంద్ర వంక 
సూర్యవంక

ఇవి కుడా మనకి తెలుసు. 
నామం 
తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి నామాలు- వైష్ణవ సాంప్రదాయం వారు ధరిస్తారు. వాటి గురించి ఈ లింకులలో చూడండి 

ఎన్ని రకాలైన నామాలో 
అడ్డ బొట్టు శైవ మతం వారు ధరిస్తారు. 
కళ్యాణ తిలకం/బొట్టు -దిని అందమే వేరు. వరుడు వధువు దీనిని ధరిస్తే కాని ఆ పెళ్లి కళ  రాదు. 
కనుబొమ్మల పైన చుక్కలు, ఎరుపు తెలుపు రంగులతో పెట్టు కుంటారు. తెలుపు కనిపించదు కాబ్బట్టి నేను పసుపు రంగు ఇంకు వాడాను. 

మరి ఆ స్టిక్కర్ బొట్లను పక్కకి పెట్టి, మళ్లీ తిలకం దిద్దుదామా ... ఇంకొన్ని వచ్చే టపాలలో ..... 

మీ...అనామిక....