Thursday 11 April 2013

రంగవల్లి-153

ఉగాది ప్రత్యేకం 

మీ అందరికి నా విజయ నామ సంవత్సర శుభాకాంక్షలు. 
21 నుండి 1 వరకు సరి చుక్క. 

నాకు ఆరోగ్యం బాగుండలేక, అది కాక పవర్ కట్ లతో ముందుగా  ఈ రంగవల్లి పోస్ట్ చెయలేక పొయాను. 

ఈ రోజు నుండి చైత్ర లేక వసంత నవరాత్రులు ప్రారంభం కనుక, అమ్మావారికి శ్రీ రామ నవమి వరకు పూజలు చేసుకుంటాం కనుక ఈ ముగ్గు ఈ రోజులలో వెసుకొవచ్చును.  

వసంత కాలం కనక పువ్వులు, మామిడి పిందెలు, మన్మధ బాణాలు వేసాను ఈ రంగవల్లి లొ. 

మీ...అనామిక....

Sunday 7 April 2013

లక్ష్మీ గాజులు

నాకు ఈమధ్యన ఆరోగ్యం అసలు  బాగుండటం లేదు . అందుకని టపాలు  వ్రాయటం లేదు. ఇంకా పూర్తిగా కోలుకో లేదు. ఇంకొంత సమయం పడు తుంది. అందుకని తరుచి టపాలు పెట్ట లేను. 

అయిన ఇది మాత్రం మీకు తప్పక చూపించాలని ఉబలాటం. అవేనండి లక్ష్మి గాజులు.  కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. 

బాగున్నాయి కదూ ... 

ఇవి 1 గ్రాము బంగారంవి. ఇందులో రక రకాలా డిజైన్లు ఉన్నాయి. 

మీ...అనామిక....