Wednesday, 30 January 2013

ముత్యాల దండ

నేను మా అమ్మకి అప్పుడెప్పుడో మంచి ముత్యాలు కొనిచ్చాను. బంగారపు తీగె పెట్టి చుట్టిదాము అని అనుకున్నాను. ఇంతలో బంగారం ధరలు పెరిగాయి. తగ్గుతాయి  అని  చాలా  ఎదురు చూశాం. ఇంకా ఇంకా పెరుగుతో పోయింది. ముత్యాలను పెట్టెలో భద్రపరచి మర్చిపోయాం.

మొన్న అకస్మాత్తుగా గుర్తుకు వచ్చింది, ఈ ముత్యాలు ఉన్నట్లుగా. అలా పెట్టె లో పెట్టి చాలా కాలం ఉంచితే అవి పాడైపోతాయని అంటారు. బంగారంతో నగ చేయించాలంటే ఇప్పుడు మాటలా? అందుకే వెంటనే, వాటిని తీసి, ఇలా నైలాను దారానికి గుచ్చి, వెనక వైపున డోరి అమర్చాను. 
చక్కగా అమరింది. మేడలో వేసుకుంటే బాగుంది. తక్కువ ఖర్చులో అయిపొయింది. చేయటం కూడా సుళువే. మరి మీరేమంటారు?


మీ...అనామిక....

Tuesday, 29 January 2013

చెవి లోలాకులు -5

ఈ హంసలు నాకు చాలా నచ్చాయి. గులాబీ, ఎరుపు, నీలం -ఈ మూడు రంగుల కలయిక చాల బాగుంది.

మరిన్ని వేరే టపాలలో..........
మీ...అనామిక....

Monday, 28 January 2013

చెవి లోలాకులు -4

వీటిలో కుడా ఇంకా రంగులు ఉన్నాయి. నాకు ఇది నచ్చింది.

ఇంకొన్ని వచ్చే టపాలలో.....
మీ...అనామిక....

Sunday, 27 January 2013

చెవి లోలాకులు -3

ఇవి చూడండి ఆకుల ఆకారంలో ఉన్నాయి. నాకు ముదురు ఆకుపచ్చ, ముదురు ఎరుపు రంగులు నచాయి. ఇంకా రంగులు ఉన్నాయనుకోండి. కాని అన్ని కొనలేం కదా 


మరి కొన్ని వచ్చే టపాలలో...

మీ...అనామిక....

Saturday, 26 January 2013

రంగవల్లి -152

గణతంత్ర  దినోత్సవ స్పెషల్ 

27 చుక్కలు 7 వరుసలు- సరి చుక్కలు 7 వరకు.

మీ అందరికి                      
64 వ గణతంత్ర దినోత్సవ
శుభాకాంక్షలు                   మీ...అనామిక....

Wednesday, 23 January 2013

అమ్మమ్మ చిట్కాలు -7

పాత  దిండు గలేబుల తో ...1

పాత దిండు గలేబులు మన ఇంట్లో చాలానే ఉంటాయి. దుపట్లు చిరిగి పోయిన ఒక్కొక్క సారి గలేబులు మిగిలి పోతాయి. అలాగే కుషన్  కవర్లు, దీవాన్  పై వేసే బాలిసుల కవర్లు లాంటివి కుడా మిగిలి పోతాయి. మరి వాటిని ఎలా వాడుకోవచ్చును చూద్దామా ? 

వాటిని ఇలా వాడుకోవచ్చు :

నూలువి అయితే, అదీ కొద్దిగా చిరిగి పోయి ఉంటే,
 1. మెత్తగా ఉంటాయి కనుక దుమ్ము తుడుచుకోవటానికి - ముఖ్యంగా ఇంట్లో ఖరీదైన వస్తువులు, పింగాణి, గాజు సామగ్రి, అద్దాలు, కంప్యూటర్ స్క్రీన్స్ లాంటివి తుడుచుకుని పరేయచ్చు 
 2. నేల  తుడవటానికి 
 3. ఏదైనా ఒలికినప్పుడు-పాలు, నీళ్లు, నూనె వంటివి-తుడిచి పరేయచ్చును.
 4. వంటింట్లో గట్టు,  టేబులు తుడవడానికి కాని, వేడి పాత్రలు పట్టుకోవటానికి కాని 
ఏవైనా (నూలు , సిల్క్..) గలేబులు, చిరగకుండా చక్కగా ఉంటే, 
 1. మన లో దుస్తులు, మేజోళ్ళు, రుమాళ్ళు వంటివి అందులో  భద్రపరిస్తే,  అలమారా వెతుక్కోనవసరం  లేదు.
 2. పైన చెప్పినవి మాసి పోయినవి, ఉతక వలసినవి అన్ని ఒకే టబ్బు లో  వేరే దుస్తులతో కాకుండా ఇలా గలేబులో పెట్టి విడిగా ఉంచవచ్చు 
 3. పైన చెప్పినవి, గలేబులో వేసి మూతి కట్టేసి, వాషింగ్ మెషిన్ లో ఉత్తుకోవటానికి సుళువు 
 4. అలాగే, సున్నితంగా ఉండే దుస్తులు -లేసువి, సిల్క్ వి, నెట్టు తో చేసినవి ఇలా విడిగా గలేబులో వేసి, మూతి కట్టేసి, వాషింగ్ మెషిన్ లో ఉతక వచ్చు.
 5. ఖరీదైన-పట్టువి కాని, అద్దాలు కుట్టినవి, జార్దోజి వర్కు చేసినవి, కుందన్ వర్కు లేదా ఎక్కువ ఎంబ్రాయిడరి చేసిన చీరెలు కాని, రవికెలు కాని విడివిడిగా (నూలు తో చేసిన) గాలేబుల లో  పెట్టుకోవచ్చును. భద్రంగా ఉంటాయి.
 6. ఎంబ్రాయిడరీ చేసినవి, లేదా మంచి నూలు/సిల్కు గుడ్డ తో కుట్టిన గలేబుల లో దూది (కాటన్ కాని రేక్రోన్ కాని) నింపి, దిండ్లు/కుషన్లు తయారు చేసుకోవచ్చు. 
 7. ఫోటో ఫ్రేములు, పోస్టర్లు వంటివి దాచాలంటే, గాలేబులలో పెట్టి దాచవచ్చు. 
 8. ఉన్ని దుస్తులు, రగ్గులు, బొంతల వంటివి చలి కాలం అయిపోగానే, గాలేబులలో పెట్టి భద్ర పరచ వచ్చు.
 9. పసి పిల్లల బొంతలు, బేబి బ్లంకేట్, గలేబులో పెట్టి భద్ర పరచవచ్చు. ప్రయాణాలలో తీసుకు వెళ్ళటానికి సుళువు. త్వరగా మాసి పోవు .
 10. ఊలు, స్వెటర్లు/షాల్ వంటివి ఎవైనా మనం అల్లుతో ఉన్నప్పుడు, రోజు కొంత కొంత మాత్రమే అల్లుతాం. ఇలాంటప్పుడు అవి మాసి పోకుండా  గలేబులో పెట్టి భద్ర పరచండి. 
ఇంకొన్ని తరువాతి టపాలలో..


మీ...అనామిక....

Tuesday, 22 January 2013

చెవి లోలాకులు-2

పురి విప్పిన నెమళ్ళు - వాటి అందమే వేరు. 
ఇది చూడగానే కొనకుండా ఉండలేకపోయాను. ఇందులో వేరే రంగులు ఉన్నా నాకు నెమలి కి సహజంగా ఉండే ఈ రంగులే ఇష్టం. అందుకని వేరే రంగుల లోలాకులు పక్కకు నెట్టి ఇవి కొనేశా. బాగున్నాయి కదూ....

మరి కొన్ని వచ్చే టపాలలో....

మీ...అనామిక....

Monday, 21 January 2013

చెవి లోలాకులు-1

ఈ మధ్యన అందరు, చెవికి వేలాడే లోలాకులను ఇష్ట పడుతున్నారు. చాలా పెద్దవిగా ఉండి, ముత్యాలు, రాళ్ళూ, కుందన్లు  పొదిగినవి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాని రోజువారిగా పెట్టుకోవాలంటే కొంచెం చిన్నవిగా ఎక్కువ బరువు మెరుపు లేకుండా ఉన్నవే బాగుంటాయి. 
ఇది చూడండి  - నీలం, గులాబీ రంగుల కలయిక తో బాగుంది కదూ ? మరి కొన్ని వచ్చే టపాలలో...

మీ...అనామిక....

Sunday, 20 January 2013

చీరెల పై ఫాబ్రిక్ పెయింటింగ్-2

ఇదిగో ఇంకొక చీర - చీరె  పై ఫాబ్రిక్ పెయింటింగ్ చాల అందంగా ఉంది.
బెంగాలీ కాటన్ చిర. అత్తా కోడలి అంచు. మధ్యన లేత బూడిద రంగు + లేత ఆకుపచ్చ కలనేత. అంచు పైన ఉన్న డిజైన్ చూడండి.
చిరె  అంతా  ఈ డిజైన్ ఉంది.
కాని పమిట పైన వినాయకుడి బొమ్మ చాలా బాగుంది. చూడగానే కొనాలనిపించి కొనేశా. కాని తీరా కొన్నాక ఇలా దేవుడి బొమ్మలున్న చీర  మనం ధరించ వచ్చునా అని సందేహం.

మీ...అనామిక....

రంగవల్లి - 151

కాదేది కవితకి అనర్హం అన్నట్లుగా ...ఇది చుడండి. ఇది కాళ్ళు తుడుచుకున్నే పట్టా. దీనిని చూడగానే ఇలా రంగు రంగుల రంగవల్లి వేస్తే  బాగుంటుంది కదా అని అనిపించింది.
ఇలా మనం చాలా వాటి నుండి ప్రేరణ పొందవచ్చు. మరి మీరేమంటారు ?

మీ...అనామిక....

రంగవల్లి - 150

ఇది నా 150వ టపా ఈ శిర్షికతో. ఈ వేళాడే దీపాలు చాల అందంగా ఉంటాయి. 


ఇవి కార్తిక మాసంలో కాని దీపావళికి కాని లేదా పుజాలకి కాని వేసుకోవచ్చును.

మీ...అనామిక....

Saturday, 19 January 2013

మీనకారి చెవి లోలాకులు - బుట్టలు

ఇదిగో చూడండి. ఇది కూడా బుట్టలో బుట్ట . ఎరుపు, నిలం, ఆకుపచ్చ. బాగుంది కదూ ?
ఇప్పుడు ఇలా రెండేసి ముడేసి బుట్టలు ఒక దాని నుండి ఇంకొకటి  వేళ్ళాడుతూ ఉండటం ఫ్యాషన్. ఇందులో ఇంకా చాలా రకాలు దొరుకుతాయి. 


మీ...అనామిక....

Tuesday, 15 January 2013

రంగవల్లి-149

రథం ముగ్గు 

ఇది చుక్కలు పెట్టి వేసినది. చుక్కలు లేకుండా కూడా వేసుకోవచ్చును. కావలసినట్లుగా పెద్దదిగా వేసుకోవచ్చును. 

మీ...అనామిక....

రంగవల్లి -148

రథం ముగ్గు 

చుక్కలు పైన చూపిన విధంగా పెట్టుకుని, కలుపుకోవాలి.

మీ...అనామిక....

Monday, 14 January 2013

రంగవల్లి -147

రథం ముగ్గు 
21 నుండి 1 వరకు సరి చుక్కలు. కనుము, ముక్కనుము నాడు రథం ముగ్గు వేయాలి. కాబట్టి మీ కోసం. నలుగు వైపులా నాలుగు రథాలు. మీకు నచ్చిందని అనుకుంటాను.

మీ...అనామిక....

Sunday, 13 January 2013

రంగవల్లి - 146

సంక్రాంతి స్పెషల్ 

25 నుండి 1 సరి చుక్కలు. 

పొంగలి కుండలు, చెరుకు గడలు, గాలి పటాలు, ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్ళు...సంక్రాంతి లక్ష్మిని సాదరంగా భక్తితో మన ఇళ్ళలోకి ఆవ్హానిద్దామా?

మీ...అనామిక....

శుభాకాంక్షలు


మీ అందరికి లోహరి, పొంగలి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు 

మీ...అనామిక....

రంగవల్లి - 145

భోగి కుండలు-పొంగలి కుండలు 

21 నుండి 1 వరకు-సరి చుక్కలు. మెలిక ముగ్గులు కావాలని రాసజ్ఞ  అడిగారు. ఇలా భోగి కుండలు వేస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న ప్రయత్నం. 

అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ......

మీ...అనామిక....

Saturday, 12 January 2013

రంగవల్లి - 144

పద్మాలు - సీతాకోక చిలుకలు 

25 చుక్కలు - 7 వరుసలు, 7 వరకు సరి చుక్కలు. 

మీ...అనామిక....

రంగవల్లి - 143

కలువలు-గాలి పటాలు 
21 నుండి 1 సరి చుక్కలు. మరిన్ని ముగ్గులు మీ కోసం...వచ్చే టపాలలో...

మీ...అనామిక....

Friday, 11 January 2013

Thursday, 10 January 2013

మీనాకారి చెవి లోలాకులు-బుట్టలు

ఈ బుట్టలు చూడండి, పైన కొద్దిగా పెద్ద బుట్టలోంచి చిన్న బుట్ట వేలాడుతోంది. మరి పెద్దవి కాదు. కాబ్బట్టి పెట్టుకుంటే ఎబెట్టుగా ఉండవు. తెలుపు, ఎరుపు, ఆకు పచ్చ, పసుపు పచ్చ, నీలం ఇలా రంగులు చాలా ఉన్నాయి. ఏ  పట్టు చీర అయినా చుడిదార్ అయినా నప్పుతాయి 

ఇంకొన్ని వచ్చే టపాలలో...
మీ...అనామిక....

రంగవల్లి - 141

15 చుక్కలు 3 వరుసలు, తరువాత 1 వరకు సరి చుక్కలు. 


మీ...అనామిక....