Wednesday 31 October 2012

రంగవల్లి - 100


ఇది నా 100వ టపా రంగవల్లి అనే శీర్షిక తో.  చాలా ఆనందంగా ఉంది. 

ప్రతి పండుగకు ఒక ప్రత్యేకమైన ముగ్గు ఆ పండుగ యొక్క విశేషం ను తెలియచేస్తూ ఉండాలని, అలాగే రక రకాలైన అంశాల పైన ముగ్గులు, అలనాటి ముగ్గులు మన పెద్దవాళ్ళు మనకు అందించినవి, ఇలా ఎన్నో ఎన్నెన్నో ముగ్గులు మీకు అందించాలని నా తపన. 

ఇంకా చాలా చెప్పాలని మీతో పంచుకోవాలి అని ఉన్నది. మీకు ఈ రంగవల్లులు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. 
20 చుక్కలు 10 వరుసలు; 10 వరకు, సరి చుక్కలు. 


మీ...అనామిక....

Tuesday 30 October 2012

Monday 29 October 2012

రంగవల్లి - 98

దీపావళి ప్రత్యేకం 
11,9,7,7,3,1 చుక్కలు. 

స్వస్తిక శుభానికి చిహ్నం. గణపతికి  ప్రతీక  అని, శుభానికి సంకేతమని, లక్ష్మీ దేవికి ఆహ్వానం పలుకుతుంది అని అంటారు. దీపావళి నాడు లక్ష్మీ పూజ చేస్తాం కాబట్టి ఈ ముగ్గు ఇంట్లోని పూజ స్థలం లో వేయండి. ఏ పూజ కైనా వేసుకోవచ్చును. 


మీ...అనామిక....

Saturday 27 October 2012

రంగవల్లి-97

దీపావళి స్పెషల్ 

9 నుండి 1 సరి చుక్క. దీపాలు, పువ్వులు, స్వస్తిక - ఇవి దీపావళి పండుగను గుర్తు చేస్తాయి....

దీపావళి కోసం ప్రత్యేకంగా కొన్ని ముగ్గులు మీకోసం... సులభంగా వేసుకునేటట్లు ......


మీ...అనామిక....

రంగవల్లి-96

చేపల ముగ్గు 

9X 9 చుక్కలు.

మీ...అనామిక....

Tuesday 16 October 2012

Monday 15 October 2012

రంగవల్లి - 94

దసరా స్పెషల్ -కలువల తివాచీ 

రేపటి నుండి దసరా మొదలు. మరి అమ్మవారిని భక్తి-శ్రద్ధలతో కోలుచుకుంటాం. బాల, లలితా, దుర్గ, కాళి, మహిషాసుర మర్ధిని, గాయిత్రి, సరస్వతి, లక్ష్మి ఇలా ఎన్నో రూపాలో.

మరి ఈ దసరాలకోసం కొన్ని ముగ్గులు:
ఇది 21 నుండి 1 వరకు, సరి చుక్క. చాలా  సుళువు.

సింహ వాహిని అయిన అమ్మ పద కమలాలు కంది పోకుండా కలువల తివాచీ. మరి పరచి చూడండి ..అమ్మ తప్పక వచ్చి తీరుతుంది.

మిగతావి వచ్చే టపాల్లో .....

మీ...అనామిక....

Friday 5 October 2012

అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు-2012


హైదరాబాద్ లో 1-10-12 నుండి 19-10-12 వరకు అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు-Bio Diversity Convention- 2012 - జరుగుతోంది. 

నా వంతు ఏదో ఉడుతా  భక్తీ నేను చేస్తున్నాను...వీటికోసం మొక్కలు పెంచి..

మరి మీరో ??????????

మీ...అనామిక....