Thursday 20 September 2012

గోలుసు కుట్టు- Chain Stitch-10


Checkered Chain Stitch or Magic Chain Stitch

ఈ కుట్టు పేరుకు  తగ్గట్లుగానే ఉంటుంది. అంతా గొలుసు కుట్టు లాగానే కుట్టాలి. కాని రెండు వేర్వేరు రంగు దారాలను ఒకే సుదిలోకి ఎక్కించు కోండి. నేను ముదురు-లేత గులాబీ రంగు దారాలను వాడాను.
ముందుగా సూది ని  బట్ట అడుగు నుండి పైకి తీసుకోండి.
మాములు గొలుసు కుట్టు లాగానే కుట్టండి. కాని దారాన్ని లూప్ (సూది చుట్టూ) వేసినప్పుడు ఒక రంగు దారాన్ని మాత్రమే వేయండి. సూదిని పైకి లాగండి. 
 ఒక గొలుసు ఇలా రావాలి.
ఇప్పుడు రెండో గొలుసు కుట్టేటప్పుడు రెండో రంగు దారాన్ని వాడండి. ఇలా మొత్తం కుట్టేటప్పుడు ఒకొక్క రంగు దారాన్ని ఒకొక్క గోలుసుకి ఒకదాని తరువాత ఒకటి వాడండి. 
కుట్టు చివరన మాములు గొలుసు కుట్టుకి మాదిరి దారాన్ని బాట పైనుండి అడుగుకి దించి, ముడి వేయండి.

ఇలా ఒక దాని తరువాత ఒకటి కాకుండా 2/3 ఒకే రంగు గొలుసులు కుట్టి తరువాత 2/3 వేరే రంగువి ఇలా రక రకాలుగా కుట్టుకోవచ్చును. 

దారం తక్కువ పోచలు వాడినా లేదా సన్ననిది అయితే రెండు కంటే ఎక్కువ రంగులు వాడవచ్చు. కాని కుట్టేటప్పుడు దారం చిక్కు పడకుండా జాగ్రత్త పడాలి. 

ఇది ఫిల్లింగ్ కుట్టు లాగా కాని లేదా అవుట్ లైన్ లాగా కాని లేదా బోర్డర్ లాగా కాని, వేరే కుట్లతో కలిపి కాని వాడుకోవచ్చును.

మీ...అనామిక....

No comments: