Tuesday 4 September 2012

రంగవల్లి-83

కుందన్ తో రంగవల్లి...Reusable Rangavalli

మన తెలుగునాట పండగైనా, పబ్బమైనా అందమైన రంగవల్లులు వేసుకోవటం ఆచారం. అసలు ముగ్గుల పండగ సంక్రాంతి ఉండనే ఉంది.

ముగ్గు పిండితో రంగవల్లి  వేసి, రంగులు వేయటం మనకి తెలుసు. ఇప్పుడు రంగు రంగుల ఇసుకలతో, మార్బుల్ చిప్స్  తో , లేదా ధాన్యాలతో ఇలా రక రకాలుగా వేస్తునారు.  పువ్వులతో, పువ్వు రెక్కలతో, ఆకులతో రంగవల్లులు  కూడా తెలుసు. మన కేరళ సోదరిమణులు ఓణం  పండుగకు వేసుకుంటారు.

అయితే, ఎంత వేసినా వాటిని తరువాత తుడిచి వేయ వలసినదే. అలా కాకుండా ఒక సారి వేసినది మళ్లి వాడుకోగలిగితే బాగుంటుంది. అంతే కాదు. ముందుగా ముగ్గు వేసి పెట్టుకోగలిగితే మనకి చివరి నిమిషంలో హడావిడి పడనక్కరలేదు.

ఇది కుందన్ తో వేసిన(చేసిన?) ముగ్గు. ప్లాస్టిక్ షీట్  (స్పైరల్ బైండింగ్) కి వాడతారు. ఆ షీట్ పైన చేసినది. అది అయితే కొంచెం మందంగా ఉంటుంది. నీలం, గులాబి మొ. రంగులలో దొరుకుతుంది. సైజులు కూడా ఉంటాయి. 

కుందన్ రాళ్ళు మాములు చీరలపై కుట్టేవి, కావలసిన ఆకారం లో అంటించాను. అంటించే ముందు మనకి నచ్చినట్లుగా అమర్చుకుని, చూసుకుని, తరువాత జిగురు(క్విక్ ఫిక్స్/ఫెవికోల్) పెట్టి అంటించు కోవాలి.  ప్రతి కుందన్ అంటించిన తరువాత కొంచం సేపు అదిమి పట్టి ఉంచితే, త్వరగా/బాగా అతుక్కుంటాయి. బాగా ఆరాక వాడుకోవచ్చు. 

నేల  పైన, టేబుల్ పైన మనకి నచ్చినట్లుగా అమర్చుకోవచ్చు. పార్టిలకీ , పండగలకి ఇవి బాగుంటాయి. పని అయిపోగానే జాగ్రత్త చేసుకుని తరువాత వాడుకోవచ్చు.

అంతే కాదు. కొన్నిసార్లు వాడిన తరువాత. ఇంకొన్ని కుందన్లు అంటించి, కొత్త డిజైన్ తయారు చేసుకోవచ్చు. ఇలా విడి విడి షీట్లు కొన్ని కలిపి పేర్చుకుని  పెద్ద ముగ్గు పెట్టుకోవచ్చు.

ఇంకొన్ని తరువాత టపాలలో.....
మీ...అనామిక....