Sunday 26 August 2012

మా అతిథులు

మా తోటలో అప్పుడప్పుడు కొంత మంది అతిథులు వస్తూ ఉంటారు. మవారి వాళ్ళ సందడి మాకు. కొంత కాలక్షేపం కూడా.

నాకు ప్రొద్దునే లేవగానే తోటలో కాసేపు తిరగటం అలవాటు. ఇవాళ నాకు ఇదిగో ఈ సీతా కోక చిలుక కనిపించింది. 
మరి ఆ భగవంతుని సృష్టి ఎంత అందంగా ఉన్నదో చూడండి.
దాని పెద్ద పెద్ద కళ్ళు పొడువైన నాలుక. 

ప్రొద్దున్నే రెక్కలు తడిగా ఉంటాయి. అందుకే సూర్య భగవానుడు ఉదయించాక రెక్కలు విప్పి ఆరబెట్టుకుని అప్పుడు తమ పని చేసుకుంటాయి. 

ఇంకా ఇలాంటి వెన్నో వస్తాయి మా తోటలోకి . మేము పెంచిన చిన్న తోట ఇలా వేరే జీవాలకు కొంతైన ఆశ్రయం కలిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది మరి. 

మీ...అనామిక....

3 comments:

haritha said...

అనామిక గారు కోనసీమ అందాలు అద్భుతంగా ఉన్నాయి మీ తోట అతిథి ఫోటోలు మరింత అందం గా ఉన్నాయి. మన పెరటి తోట ఆతిథ్యమిచ్చే అతిథుల్ని మనమూ ఓ సారి పలకరిస్తే మనసుకెంత హాయిగా ఉంటుందో .....

Unknown said...

అనామిక గారు కోనసీమ అందాలు అద్భుతంగా ఉన్నాయి మీ తోట అతిథి ఫోటోలు మరింత అందం గా ఉన్నాయి. మన పెరటి తోట ఆతిథ్యమిచ్చే అతిథుల్ని మనమూ ఓ సారి పలకరిస్తే మనసుకెంత హాయిగా ఉంటుందో .....

అనామిక... said...

Dhanyavaadalandi