Friday 31 August 2012

రంగవల్లి -81

14 చుక్కలు 2 వరుసలు. సరి చుక్క 2 వరకు.

మీ...అనామిక....

గొలుసు కుట్టు-Chain Stitch-4

Zig Zag Chain Stitch

ఈ కుట్టు కి గొలుసులు పైన చూపిన విధంగా వాలుగా కుట్టు కోవాలి. వాలు ఎంత అన్నది మనం మార్చుకోవచ్చు. అంటే వాలును బట్టి "V" (గొలుసుల మధ్య దూరం)  ఎక్కువ తక్కువ ఉంటుంది. కుట్టు చక్కగా రావాలి అంటే రెండు సమాంతర రేఖలను గీసుకుని కుట్ట వచ్చు.

మొదట ఒక గొలుసు కుట్టి దాని (చివర/tip) నుండి రెండవ గొలుసు కుట్టాలి. ఇలా ప్రతి గొలుసు ముందు కుట్టిన గొలుసును pierce చేస్తూ (చిల్చుతో?) కుట్టాలి. లేదా గొలుసులు నిలబడవు. 

మరి కొన్ని కుట్లు తరువాతి టపాలలో.....

మీ...అనామిక....

Thursday 30 August 2012

రంగవల్లి-80

15 నుండి 1 వరకు సరి చుక్క.

మీ...అనామిక....

రంగవల్లి-79

21 చుక్కలు 5 వరుసలు, అటు ఇటు 4 చుక్కలు వదిలి, 13 చుక్కలు 4 వరుసలు, అటు ఇటు 4 చుక్కలు వదిలి, 5 చుక్కలు 4 వరుసలు. పైన చూపిన విధంగా కలపండి.


మీ...అనామిక....

Monday 27 August 2012

గొలుసు కుట్టు-Chain Stitch-3

Threaded or Laced Chain Stitch


ముందుగా గొలుసు కుట్టు కుట్టుకోవాలి. తరువాత వేరే రంగు దారం తో క్రింద చూపిన విధంగా గోలుసులనుండి పైకి క్రిందికి అల్లుకోవాలి. బట్టలోకి మాత్రం దారం దూర్చకూడదు(కేవలం మొదలు పెట్టేటప్పుడు ముగించేటప్పుడు మాత్రమే)
ఇది ఒక వైపు మాత్రమే చేసినది. అందుకే దీనిని Single Threaded Chain Stitch అంటారు. చివరకి బట్ట అడుగుకు దారాన్ని దింపి ముడి వేసుకోవాలి.
ఇది పైన చెప్పిన విధంగా ముందు ఒక వైపు (ఎడమ నుండి కుడికి) చేసి తరువాత దారాన్ని మరల రెండో వైపునకు (కుడి నుండి ఎడమ)కి అల్లుకుంటూ రావాలి. చివరకి బట్ట అడుగుకు దారాన్ని దింపి ముడి వేసుకోవాలి (అంటే మొదలు పెట్టిన చోటుకే మరల దారం రావాలి). ఇది Double Threaded Chain Stitch.
ఇదిగో ఇలా కనిపిస్తాయి ఈ రెండు కుట్లు.


ఇవి బార్డర్ గాని ఫిల్లింగ్ కి కాని బాగుంటాయి. వేరే కుట్లతో పాటు కుట్టుకోవచ్చు.


మీ...అనామిక....

రంగవల్లి-78

ఇంకొక మెలిక ముగ్గు.
14 చుక్కలు 2 వరుసలు. ఎదురు లేదా సరి చుక్కలు 2 వచ్చే వరకు.


మీ...అనామిక....

Sunday 26 August 2012

మా అతిథులు

మా తోటలో అప్పుడప్పుడు కొంత మంది అతిథులు వస్తూ ఉంటారు. మవారి వాళ్ళ సందడి మాకు. కొంత కాలక్షేపం కూడా.

నాకు ప్రొద్దునే లేవగానే తోటలో కాసేపు తిరగటం అలవాటు. ఇవాళ నాకు ఇదిగో ఈ సీతా కోక చిలుక కనిపించింది. 
మరి ఆ భగవంతుని సృష్టి ఎంత అందంగా ఉన్నదో చూడండి.
దాని పెద్ద పెద్ద కళ్ళు పొడువైన నాలుక. 

ప్రొద్దున్నే రెక్కలు తడిగా ఉంటాయి. అందుకే సూర్య భగవానుడు ఉదయించాక రెక్కలు విప్పి ఆరబెట్టుకుని అప్పుడు తమ పని చేసుకుంటాయి. 

ఇంకా ఇలాంటి వెన్నో వస్తాయి మా తోటలోకి . మేము పెంచిన చిన్న తోట ఇలా వేరే జీవాలకు కొంతైన ఆశ్రయం కలిపిస్తే చాలా ఆనందంగా ఉంటుంది మరి. 

మీ...అనామిక....

Saturday 25 August 2012

గొలుసు కుట్టు-Chain Stitch-2

Whipped Chain Stitch

ముందుగా   గొలుసు కుట్టు కుట్టుకోవాలి. తరువాత వేరే రంగు దారం (కాంట్రాస్ట్ కానీ, ముదురు, లేత కాని ) తీసుకుని, Whip చేయాలి. ఇంతకూ ముందు మనం, టాకా కుట్టు, వెనక కుట్టు లో చెప్పుకునట్లే ఈ కుట్టు ఉంటుంది.



కాక పొతే ఈ కుట్టు గొలుసు కుట్టు కనుక 5 రకాలుగా ఈ కుట్టుని కుట్ట  వచ్చు. 

ముందుగా ఒక్క వైపు (one sided whipping) చూడండి. 

దారాన్నిబట్ట అడుగు నుండి మొదటి గోలుసుకి దెగ్గరగా బట్ట పైకి తీయండి. తరువాత  కేవలం కుట్లలోనుండి  తీయాలి, బట్ట లోకి దూర్చ కూడదు. ఆఖరున గోలుసుకి దెగ్గరగా బట్టలోకి పై నుండి అడుగుకి దారాన్ని దించి ముడి వేయాలి.  నేను whipping ఎడమ నుండి కుడికి చేశాను. మన భారతీయులకి ఇదే అలవాటు.  కాని కుడి నుండి ఎడమకి చేస్తారు ఇంగ్లీష్ వారు. 




3వ కుట్టు లో whipping ముందుగా క్రింద వైపు చేసి(ఎడమ నుండి కుడికి) మరల పై వైపు (ఎడమ నుండి కుడికి) చేశాను.

4వ దానిలో ఎదురు బొదురు చేశాను. 

5వ దానిలో మొత్తం గొలుసు ను whip చేశాను.


 ఇందులో రెండు వరుసలు గొలుసు కుట్టు కుట్టి, whip చేశాను.

ఇలా ఇంకా అనేక రకాలు చేయవచ్చు. ఇవి చున్నిలకి , చిరేలకి, టాబుల్ క్లాత్, గలేబులు ఇలా వేటికైనా బార్డర్  లాగ కుట్ట వచ్చు. ఏదైనా ఒక ఆకారాన్ని నింపటానికి (filling) వాడ వచ్చు.  చాల రిచ్చ్ గా కనిపిస్తుంది. విప్ చేయటానికి జరి లేదా మెటల్ రంగుల మెరిసే దారం వాడితే ఇంకా బాగుంటుంది. వీటిలో ఇంకా వివిధ రకాలను తరువాత చెప్పుకుందాం.

విప్ చేయటానికి tapestry సూది(మొన బండగా ఉంటుంది)  వాడితే బాగుంటుంది. 

మీకు పైన ఇచ్చిన ఫోటోల ద్వారా కుట్టు ఎలా కుట్టాలో  అర్ధం అయ్యింది అనుకుంటాను. లేదా నాకు ఈమెయిలు చేయండి. 

ఇంకొన్ని కుట్లు తరువాతి టపాలలో. 


మీ...అనామిక....

Sunday 19 August 2012

వానాకాలం


ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ, అందుకని, మా తోటని బాగు చేయటం మొదలు పెట్టాం. ఎంత జాగ్రత్తగా ఉన్న వేసవిలో కొన్ని మొక్కలు పోతాయి. నీళ్ళు దొరకకపోవటం ఒక సమస్య. చీడ పీడలు సరే సరి. అందుకని పెంచిన మొక్కలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

ఇవిగో కొన్ని మొక్కలు ఇదివరకు ఉండేవి మా తోటలో. అవి పొతే మళ్లి  కొత్తవి పెట్టాం .


వానలు బాగా పడుతున్నాయి కాబట్టి ఇవి బాగా  నాటుకుంటాయి.  

ఇంకా కొన్ని కొత్త మొక్కలు తెచ్చుకోవాలి. కుండ్ల లో కొత్తమట్టిని నింపాలి.  ఎరువులు వేయాలి. కత్తిరింపులు చేయాలి. ఇలా చాలా పని ఉంటుంది. ఎంత చేసినా,  రోజు కొంత కొంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది. ముఖ్యంగా తోటని శుభ్రం చేయటమంటే ఈ కాలంలో కష్టం. 

అయినా  ఆ పనిలో ఒక ఆనందం-తృప్తి ఉన్నాయి. చెట్లు ఆరోగ్యంగా కళ  కళ  లాడుతూ ఉంటే ఎంతో ఆనందం. పూచిన పూవులు కాసిన  చూసుకుని మురిసి పోతం.  




మీ...అనామిక....

Saturday 18 August 2012

హలో

హలో అండి. నాకు ఈ మధ్యన ఆరోగ్యం బాగుండక ఈ బ్లాగ్ లో పోస్ట్ చేయలేకపోయాను. వానలు బాగా పడుతున్నందున ఇంట్లో పని, బయిటి పని చేయటం కష్టంగా ఉంది. చాలా పెండింగ్ ఉంది పోతున్నాయి. అది కాక బోలెడన్ని పెళ్ళిళ్ళు పేరంటాలు. ముఖ్యమైనవి  అయినా హాజరు అవ్వాలి . 

ఇక  మరి బ్లాగ్, మెయిల్ ఇవ్వన్ని పక్కన పెట్టక పొతే రోజువారి పనులు కూడా కావు. అసలు నాకిష్టమైన కళలు కూడా ముట్టుకోవటానికి విలు లేకుండా ఉంది. 

నాకేమో ఎన్నో చేయాలని మీతో పంచుకోవాలని ఉంటుంది. ఇప్పుడు  కొద్దిగా కోలుకున్తున్నాను. 

అందుకే  ఇప్పుడిప్పుడే కొద్దిగా సమయం చేసుకో గలుగు తున్నాను. మళ్లి నాకు నచ్చిన కళల కోసం కొంచెం సమయం కేటాయించ కలుగుతున్నాను.

సహృదయంతో నేను మెయిల్ చేయక పోయినా నా క్షేమ సమాచారాలు తెలుసుకుని, నాతో టచ్ లో ఉన్న నా స్నేహితులందరికీ (ముఖ్యంగా రసజ్ఞ కి) కృతజ్ఞతలు.

మరి చూస్తూ ఉండండి నా బ్లాగ్.......


మీ...అనామిక....

రంగవల్లి -77

పూల బాణాలు 

15X 15 చుక్కలు.

మీ...అనామిక....

Wednesday 15 August 2012

ఎంబ్రాయిడరి డిజైన్


ముద్దకుట్టు, టాకా కుట్టు, కాడ కుట్టు, గొలుసు కుట్టు తో లేదా రెండు మూడు కుట్లు కలిపి  ఈ డిజైన్ కుట్ట వచ్చు.  అద్దాలు, పూసలు, కుందన్లు కూడా  వాడుకోవచ్చు.



మీ...అనామిక....

రంగవల్లి-75


స్వాతంత్ర దినోత్సవ ప్రత్యేకం 

అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 


ఈ ముగ్గు 15 ఆగస్ట్ కి కాని 26 జనవరి కి కాని వేసుకోవచ్చు. చాలా సులభం . 13 X 13 చుక్కలు.



మీ...అనామిక....