Saturday 9 June 2012

పుష్పాలంకరణ


మన ఇల్లు అందంగా ఉండాలని ఎంతో శ్రమ పడతాం. బోలెడంత డబ్బులు పోసి ఎన్నో కొంటాం. అయినా అతిథులు  వస్తున్నారంటే మళ్లి  ఇంకేదైనా కొందామా,  ఏదైనా కొత్తగా అలంకరణ చేద్దామా అని ఆలోచిస్తాం.

చాల మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఖరీదైన బొమ్మలు, అలంకరణ వస్తువులు వల్లనే ఇంటికి అందం వస్తుంది అని. ఇరుగు పొరుగు వాళ్ళు మన చుట్టాలను చూసి వాళ్ళు ఎంత డబ్బు పెట్టి ఖరీదైనవి కొన్నారు, అందుకే వాళ్ళ ఇళ్ళు అంత అందంగా ఉన్నాయి అని అనుకుంటాం. కాని ఎంత ఖరిదైనది  అయినా చూడగా చూడగా బోరు కొడుతుంది. అలా అని వాటిని పారవేయలేము.

కాని మన ఇంటిని చిన్న చిన్న వాటితోనే అతి తక్కువ ఖర్చుతో అంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చును. ముఖ్యంగా ప్రతిసారి కొత్తగా అలంకరణ చేసుకోవచ్చును.

ఇది చూడండి :

ఒక టెర్రకోట పాత్ర (లోతు తక్కువగా ఉన్నది) తీసుకుని, చల్లటి నీళ్ళతో నింపండి. అందులో మీకు నచ్చిన పుష్పాలతో అలంకరణ చేయండి. గులాబీలు, బంతులు, చేమంతులు, మందారం.....ఇలా చాల పువ్వులు ఉంటాయి. సువాసన  కలిగినవి అయితే మరీ  మంచిది. లేదా ఒకటి రెండు చుక్కలు ఏదైనా స్సెంట్ ఆ నీళ్ళల్లో వేయండి. ఇవి  కనీసం 3-4 గంటలు  వాడకుండా ఉంటాయి. 

ఈ అలంకరణ ఈశాన్యం మూలలో కాని  లేదా ఇంటి ముంగిట్లో కాని, హాలు మధ్యలో కాని పెట్టు కావచ్చును. తోటలోను పెట్టుకోవచ్చు. ఎత్తుగా టాబులు మీద పెట్టుకోవచ్చు. పాత్రలు, పెద్దవి, చిన్నవి, అనేకమైన ఆకారాలలో  దొరుకుతాయి.  టెర్రకోట, ఇత్తడి, రాగి, రాతి, ప్లాస్టిక్ పాత్రలను వాడుకోవచ్చు.

పైన చూపించిన అలంకరణలో వాడినవి, మిరపకాయ మందార, రెక్క మందార (ఎర్రనివి), గ్రామఫోను గొట్టం పువ్వులు(నీలం), బిళ్ళ గన్నేరు (తెల్లవి), డేయిజి పువ్వులు చిన్నవి(పసుపు రంగువి). ఇవి కాక పసుపు రంగువి పెద్ద పువ్వులు, తెల్లనివి పెద్ద పూవులు, వాటి పేరు నాకు తెలియదు.

మరికొన్ని తరువాతి టపాలలో..


మీ...అనామిక....

No comments: