Saturday, 30 June 2012

ఎంబ్రాయిడరి డిజైన్లు

మనం ఎన్నో ఎంబ్రాయిడరి కుట్లు నేర్చుకుంటున్నాం కదా. అవి కుట్టటానికి  డిజైన్లు  కావాలి. నేను వారానికి ఒకటి చప్పున నా టపాలలో ఇస్తాను. మీకు నచ్చినవి కుట్టి నాకు ఆ ఫోటోను మెయిల్ చేయండి. మీ పేరుతొ వాటిని నా టపాలలో ప్రచురిస్తాను. లేదా మీ బ్లాగ్ లో పెట్టి నాకు మెయిల్ చేసినా నేను ఆ లింక్ నా టపాలలో పెడతాను. ఆ టపాను చుసిన వారు మీ బ్లాగ్ ను కూడా సందర్శిస్తారు. 

మీ కృషి మా కందరికీ స్పూర్తిని ఇస్తుంది. దయ చేసి మీ కళను మా అందరితో పంచుకోండి. 

ఈ వారం  ఫ్రీ డిజైన్


మీ...అనామిక....

అమ్మమ్మ చిట్కాలు-6

కూరలు ఉడికించిన నీళ్లు ...

మనం చాలా సార్లు ఎంతో పుష్టికరమైన ఆహారం తిందామని అనుకుంటాం. కాని అలాంటివాటినే పనికిరావని పారేస్తాం. ఉదాహరణకి కూరలు, ఆకు కూరలు, శనగలు, పెసలు, రాజ్మా, బొబ్బర్లు వంటివి ఉడికించిన నీళ్లు. 

అసలు సరిపోయేంత నీరే పోసి ఉడకపెట్టండి. కాని  శనగలు వంటివి ఉడకపెట్టినప్పుడు నీళ్లు మిగిలిపోతాయి. ఎక్కువగా ఉన్న నీరును వేరే పాత్రలోకి వంపి పక్కన పెట్టుకోండి.  వాటిని ఇలా వాడుకోవచ్చును:
 • పులుసు, చారు వంటివాటిలో 
 • చపాతీల/పూరిల పిండి కలిపేటందుకు 
 • సూప్  ల తయారీలో 
 • కూరలు వండేటప్పుడు గ్రేవి లో 
 • ఉప్మా, ఖిచిడి వంటివి చేసేందుకు 
 • చనా మసాలా, రగడ వంటివి చేసేటప్పుడు 
 • దాల్ (దాల్ ఫ్రై ) వంటివి  చేసేటప్పుడు 
 • చల్ల బరచి చెట్లల్లో పోయండి. వాటికీ బలం.
అయితే ఒక్క మాట. కూరలను ఉడికించే ముందు బాగా కడిగి అప్పుడు ఉడక పెట్టండి. కొన్ని కూరల  వాసన కొంత మందికి పడకపోవచ్చు. అలాంటివి ఉడక  పెట్టిన నీరు వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి.

సాధ్యమైనంత వరకు ఆ నీటిని అదే రోజు వాడేయండి లేదా ఫ్రిజ్ లో పెట్టుకుని అవసరమయినప్పుడు వాడుకోండి. కొంత మంది ఆ నీటిని ఐస్ క్యూబ్ గా మార్చి నిలువచేసుకుంటారు. నాకు మాత్రం ఎక్కువ రోజులు నిలువ ఉంచి వాడటం ఇష్టం ఉండదు.


మీ...అనామిక....

Saturday, 23 June 2012

సీతాకోకచిలకలు -7

Butterfly Sampler-7


ఇవి కుందన్ వర్క్ తో కుట్టినవి.


మీ...అనామిక....

నా సృజన -ఆభరణాలు

కాగితం తో...

ఇవి నేను కాగితం తో చేసినవి. వీటిని క్విల్డ్ ఆభరణాలు (Quilled Jewelry) అంటారు. మన దుస్తులకు నప్పే రంగులలో చేసుకోవచ్చు. అయితే వీటిని నీటి  నుండి రక్షించాలంటే పైన ఒక ప్రత్యేకమైన పూత  వేయాలి. నేను వీటికి అది వేయ లేదు.

ఇది నా మొదటి ప్రయత్నం. తరువాత ఇంకా చాలా చేసాను. అవి తరువాతి టపాలలో...


మీ...అనామిక....

Friday, 22 June 2012

సీతాకోకచిలకలు-6

Butterfly Sampler-6

ఇది కూడా కుందన్ వర్కే . పిల్లల దుస్తుల పై కుట్టటానికి బాగుంటుంది.

మీ...అనామిక....

Wednesday, 20 June 2012

గొలుసు కుట్టు-Chain Stitch-1

గొలుసు కుట్టు-Simple Chain Stitch

Chain Stitch అంటే గొలుసు కుట్టు. ఈ పేరుకు తగ్గట్టుగా గొలుసు లాగా ఉంటుంది ఈ కుట్టు. ఇది చాల సులభమైన కుట్టు. నేను మొదటగా నేర్చుకున్నది ఈ కుట్టే. ఇప్పటికీ నాకు ఇష్టమైన కుట్లలో ఇది ఒకటి.
 ముందుగా దారం బట్ట అడుగు భాగం నుండి పైకి తీసుకోవాలి.
తరువాత ముందు కుట్టిన కుట్టుకి కొద్దిగా పక్కన సూదిని బట్ట పైనుండి కిందికి దూర్చి మరల కొంత దూరం వదిలి బట్ట పైకి తీయాలి. కాని పూర్తిగా పైకి లాగ కూడదు.
ఇప్పుడు దారాని సూది చుట్టూ తిప్పి సూదిని లాగాలి. ఒక లూప్ లేదా గొలుసు ఏర్పడుతుంది.
దారం మరీ వదులు గానో  లేదా బిగుతుగానో లాగ కూడదు.
ఇప్పుడు మళ్లి ఇందాక కుట్టిన ప్రదేశానికి దగ్గెరగా సూదిని  క్రిందికి,  పైకీ దూర్చి పైన చూపిన విధంగా దారం చుట్టి కుట్టాలి.
ఇలా కావలసినన్ని గొలుసులు కుట్టుకోవచ్చు. చివరగా దారాన్ని గోలుసుకి దగ్గెరగా బట్ట క్రిందిగి దూర్చి ముడి వేసి ముగించాలీ.
ఇలా ఉంటుంది కుట్టు.

డిజైన్ చుట్టూ అంటే అవుట్ లైన్ లాగా కుట్ట్ట్టటానికి గాని లేదా మొత్తం నింపటానికి గాని ఉపయోగించవచ్చు. బార్డర్ గాను- 2, 3, 5 వరుసలు కుట్టుకోవచ్చు. ఇతర కుట్ల తో కలిపి కుట్టుకోవచ్చు. 

గొలుసు కుట్టు లో ఇంకా చాలా రకాలు  చెప్పుకోవాలి...మరి చూస్తూ ఉండండి నా బ్లాగ్....


మీ...అనామిక....

నా సృజన- ఆభరణాలు

ఆల్ చిప్పలతో ..
ఆల్ చిప్పలు, ముత్యాలు -వీటితో లోలాకులుమీ...అనామిక....

Monday, 18 June 2012

నా సృజన-ఆభరణాలు

ఆల్ చిప్పలతో 

Sea shells తో ఆభరణాలు చేయాలని చాల సార్లు అనుకున్న. వీటికి కావలసిన సామగ్రి దొరకటం కష్టం. ముందుగా చెవికి పెట్టుకునే లోలాకులు చేసాను. 
కింద లక్ష్మి లాకేట్ (కోలగా) ఉన్నవి వాడాను. వీటికి మాచింగ్ నెక్ లేసు చేయాలి. కొన్ని  డిజయిన్లు గీసి  పెట్టుకున్నాను కాని, తీరిక దొరకటం లేదు చేయటానికి. 

మీ...అనామిక....

సీతాకోకచిలకలు -4

Butterfly Sampler-4
ఇది కుందన్ వర్క్ . 

మీ...అనామిక....

Saturday, 16 June 2012

సీతాకోకచిలకలు-3

Butterfly Sampler-3

ఇది కుందన్ తో కుట్టింది. మీసాలు మాత్రం 6 పోచల నల్ల దారం తో కుట్టాను.

మీ...అనామిక....

రంగవల్లి-69

కలువల ముగ్గు 

17-7 వరుసలు, 7 వరకు.
మీ...అనామిక....

Thursday, 14 June 2012

సీతాకోకచిలకలు-2

Butterfly Sampler
ఇది, వివిధ ఆకారాలలో ఉన్న కుందన్ల  తో కుట్టినది (అతికించ వచ్చు).  చీర, చుడిదార్, పిల్లల గవున్లు  ఇలా దేని మీదనైన కుట్టు కోవచ్చును. 


మీ...అనామిక....

Tuesday, 12 June 2012

సీతాకోకచిలకలు -1

Butterfly Sampler-1


మనం ఇంతకు ముందు Samplers  గురించి చెప్పుకున్నాము. మీకు గుర్తు ఉండి ఉంటుంది. ఇదిగో ఈ లింకు చూడండి  


నేను Butterfly  Sampler  ఒకటి చేస్తున్నాను. ఇందులో ఏంటంటే, కుట్లు, అల్లికలు, పేపరు,  ఇంకా ఇతర సామాగ్రి, ప్రక్రియాలు, మీడియాలను వాడి  సీతాకోకచిలకలు తయారు చేయటం. ఇప్పటి వరకు నేను అనుకున్న ఐడియాలు  అన్ని చేయలేకపోయా. తీరిక ఉండటం లేదు. కొన్ని మాత్రం చేశాను చూడండి....


ఇవి కుందన్ butterflies అనేక రంగులలో దొరుకుతాయి....ఇవి, కుట్టుకోవచ్చు లేదా అతికించుకోవచ్చును. ఇంకొన్ని వేరే టపాలలో....

మీ...అనామిక....

Monday, 11 June 2012

అమ్మమ్మ చిట్కాలు-5

వాడేసిన టూత్  బ్రష్షుల తో ...

మీకు  తెలుసా? మనం పళ్ళు తోముకోవడానికి వాడే  బ్రష్  3 నెలలకొకసారి, మార్చుకోవలట. అధమం 6 నెలలకైన కొత్తవి వాడాలి. ఇలా వాడేసి పడేసే   బ్రష్లు వేల/లక్షల సంఖ్యలో ఉంటాయి. అవి ప్లాస్టిక్ తో చేసినవి. మరి పర్యావరణానికి  హాని చేస్తాయి. అందుకని, తీసి వేసిన   బ్రష్లను మనం వెంటనే పారేయకుండా వాటికి వాడుకోవచ్చును.

ముందుగా అలాంటి వాడేసిన  బ్రష్లను వేడినీటిలో కొంచం సబ్బు, dettol  వేసి 10 ని. నానపెట్టి బాగా కడిగి ఆరనివ్వండి. తరువాత ఒక ప్లాస్టిక్ సంచిలో వేసి మీ పనిముట్లు పెట్టుకునే టూల్ కిట్ లో పెట్టుకోండి. 

బ్రష్లను ఈ క్రింది వాటిని శుభ్రం చేయటానికి ఉపయోగించుకో వచ్చును:
 1. వంట ఇంట్లో, స్నానాల గది లోను టైల్స్ మధ్యన, గోడ మూలలోను 
 2. వంట ఇంట్లో, స్నానాల గది లోను సింకు పంపుల దగ్గెర, సింకుకి గోడకి మధ్యన వేసిన తెల్ల సిమెంటు దగ్గెర  
 3. దువ్వెనలు   
 4. పని ముట్లను  
 5. తురుము పీట  
 6. కిటికీల ద్వారాల తలుపులూ  గ్రిల్లు, అద్దాల/చెక్క మూలాలను    
 7. సున్నితమైన electronic వస్తువులు   (మెత్తని బేబి   బ్రష్  )
 8. కంప్యూటర్ కీ  బోర్డు  
 9. బంగారం, వెండి నగలు, వెండి వస్తువులు, రాళ్ళూ పొదిగిన నగలు 
 10. చేయి  పట్టని, సన్నని మూతి గల సీసాలు, పాల  సీసాలు, డబ్బాలు  
 11. షూ లకు, పాలిష్ వేసేటప్పుడు, అంచుల దగ్గెర పాలిష్ రాయటానికి (మాములు బ్రష్  తో వేయటం కష్టం)
 12. షూ క్లీనింగ్ - మట్టి బురద వంటివి అత్తుక్కు పోయినప్పుడు 
 13. బట్టలు, స్వెటర్లు, కోట్లు, ఫర్నీచర్, కార్పట్  వంటి వాటి మీద మరకలు పడి నప్పుడు, ముందుగా  ఆ ప్రాంతం మాత్రం శుభ్రం చేయాలి. అలా స్పాట్  క్లీనింగ్ చేసేటప్పుడు 
 14. తలుపులకి కిటికీలకి పెయింటు వేస్తూనప్పుడు, చిన్న డబ్బాలైతే పెయింటు బాగా కలపడానికి 
 15. చిత్రకళ లో టూత్ బ్రష్ టెక్నిక్ ఉపయోగించి వెరైటి గా వేయోచ్చును 
 16. చిన్న పెద్ద బొమ్మలు -మట్టి, పింగాణి, గుడ్డతో (ఫర్ కాదు ) కుట్టినవి మెత్తని బేబి బ్రష్ తో సున్నితంగా క్లీన్ చేయ వచ్చు 
 17. చేతులు/పెద్ద బ్రష్ దూరని చోట్లు  శుభ్రం చేయటానికి
 18. అల్లం, దుంప కూరలు, ఇతర కూరలు, పళ్ళు  శుభ్రం చేయటానికి మెత్తని బ్రష్ వాడవచ్చు 
 19. మానిక్యుర్,  పెడిక్యుర్ కి, గోళ్ళు  శుభ్రం చేయటానికి
 20. కనుబొమ్మలు సరి చేయటానికి, మేకప్ వేసుకోవటానికి 
 21. ఏసి   శుభ్రం చేయటానికి
 22. వైరు మెష్  శుభ్రం చేయటానికి
 23. సైకిల్ చైన్   శుభ్రం చేయటానికి
 24. టూత్ బ్రష్  హండిల్ ను కోవత్తి పై  కాల్చి విరిగిన/కారుతున్న బకెట్లు వంటి వాటికి మాట్లు వేసుకోవచ్చును 
 25. కాలిలో లేదా చేతులలో ముళ్ళు/ చెక్క పేడు గుచ్చుకున్నప్పుడు , ఆ భాగం పై బ్రష్ తో బ్రష్ చేసి ముల్లును తీసివేయవచ్చును 
ఇలా ఎన్నో ఉపయోగాలు, మరి మీకూ  ఇంకా ఎవైనా తెలిస్తే నాకు మెయిల్ చేయండి. అందరితో పంచుకోవచ్చు....మీ...అనామిక....

Saturday, 9 June 2012

పుష్పాలంకరణ


మన ఇల్లు అందంగా ఉండాలని ఎంతో శ్రమ పడతాం. బోలెడంత డబ్బులు పోసి ఎన్నో కొంటాం. అయినా అతిథులు  వస్తున్నారంటే మళ్లి  ఇంకేదైనా కొందామా,  ఏదైనా కొత్తగా అలంకరణ చేద్దామా అని ఆలోచిస్తాం.

చాల మందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే ఖరీదైన బొమ్మలు, అలంకరణ వస్తువులు వల్లనే ఇంటికి అందం వస్తుంది అని. ఇరుగు పొరుగు వాళ్ళు మన చుట్టాలను చూసి వాళ్ళు ఎంత డబ్బు పెట్టి ఖరీదైనవి కొన్నారు, అందుకే వాళ్ళ ఇళ్ళు అంత అందంగా ఉన్నాయి అని అనుకుంటాం. కాని ఎంత ఖరిదైనది  అయినా చూడగా చూడగా బోరు కొడుతుంది. అలా అని వాటిని పారవేయలేము.

కాని మన ఇంటిని చిన్న చిన్న వాటితోనే అతి తక్కువ ఖర్చుతో అంతో అందంగా తీర్చిదిద్దుకోవచ్చును. ముఖ్యంగా ప్రతిసారి కొత్తగా అలంకరణ చేసుకోవచ్చును.

ఇది చూడండి :

ఒక టెర్రకోట పాత్ర (లోతు తక్కువగా ఉన్నది) తీసుకుని, చల్లటి నీళ్ళతో నింపండి. అందులో మీకు నచ్చిన పుష్పాలతో అలంకరణ చేయండి. గులాబీలు, బంతులు, చేమంతులు, మందారం.....ఇలా చాల పువ్వులు ఉంటాయి. సువాసన  కలిగినవి అయితే మరీ  మంచిది. లేదా ఒకటి రెండు చుక్కలు ఏదైనా స్సెంట్ ఆ నీళ్ళల్లో వేయండి. ఇవి  కనీసం 3-4 గంటలు  వాడకుండా ఉంటాయి. 

ఈ అలంకరణ ఈశాన్యం మూలలో కాని  లేదా ఇంటి ముంగిట్లో కాని, హాలు మధ్యలో కాని పెట్టు కావచ్చును. తోటలోను పెట్టుకోవచ్చు. ఎత్తుగా టాబులు మీద పెట్టుకోవచ్చు. పాత్రలు, పెద్దవి, చిన్నవి, అనేకమైన ఆకారాలలో  దొరుకుతాయి.  టెర్రకోట, ఇత్తడి, రాగి, రాతి, ప్లాస్టిక్ పాత్రలను వాడుకోవచ్చు.

పైన చూపించిన అలంకరణలో వాడినవి, మిరపకాయ మందార, రెక్క మందార (ఎర్రనివి), గ్రామఫోను గొట్టం పువ్వులు(నీలం), బిళ్ళ గన్నేరు (తెల్లవి), డేయిజి పువ్వులు చిన్నవి(పసుపు రంగువి). ఇవి కాక పసుపు రంగువి పెద్ద పువ్వులు, తెల్లనివి పెద్ద పూవులు, వాటి పేరు నాకు తెలియదు.

మరికొన్ని తరువాతి టపాలలో..


మీ...అనామిక....