Tuesday 3 April 2012

కుట్లు అల్లికలు-Sampler

మనం  కుట్లు  అల్లికలు నేర్చుకుంటున్నాము. ఎన్నో కొత్తవి నేర్చుకుంటాం.  అలాగే ఎన్నో డిజైన్లు చూసి భద్రపరుచుకోవలని అనుకుంటాము. కొన్ని డిజైన్లు కేవలం కాగితం మిద గీసి పెట్టుకుంటే సరి పోదు. వాటిని ఎలా కుట్టాలి అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.   అయితే నేర్చుకున్న కుట్లు ఎలా గుర్తు పెట్టుకోవాలి? డిజైన్లు ఎలా భద్రపరచుకోవాలి అంటే ఒక మార్గం--Sampler.

Sampler, Stitch Sampler అంటే నేర్చుకున్న కుట్లు అల్లికలు లేదా డిజైన్లు కుట్టి భద్రపచుకునే వస్త్రం. 

పూర్వం ఆడవాళ్లు ఈ పధతి ద్వార తమకు తెలిసిన, నేర్చుకున్న కుట్లు, నచ్చిన డిజైన్లు ఒక వస్త్రంపై కుట్టి పెట్టుకునే వారు. ఇలా  వారి  జీవిత   కాలంలో  నేర్చుకున్నవి అన్ని అలా కుట్టి పెడుతూ ఉండే వారు. 

ఇవి వారికీ తరువాత ఎప్పుడైనా ఆ కుట్టు గుర్తు తెచ్చుకోవటానికి ఉపయోగపడేవి. అంతే కాదు వారు తమ తరువాతి తరాల వారికి కూడా ఈ కళలను ఈ విధంగా అందించి భద్రపరిచే వారు. 

అయితే  పేద మధ్యతరగతి వారికీ ఎక్కువ డబ్బులు పెట్టి వస్త్రం కొనే వీలు ఉండేది కాదు. అందుకని వస్త్రం అంతా తమకు తెలిసిన కుట్లతో నింపేసే వారు. ఒక పదతిగా ఉండేవి కావు. అంతా గజి బిజీగా ఉండేవి. 

ప్రస్తుతం మనకు లభ్యమైయ్యే అతి ప్రచినమైన samplers 15 -16వ శతాబ్దం నాటివి.

తరువాతి కాలంలో కొంత మంది 6-9 ఇంచుల వస్త్రం మాత్రమే వాడె వారు. దినిని  Band Sampler అంటారు. 

తరువాతి కాలం అంటే 17 వ శతాబ్దంలో ఈ వస్త్రానికి చుట్టురా పట్టి-బార్డర్ ని  కుట్టటం ఆరంభించారు. తరువాతి కాలంలో అక్షరాలూ, సామెతలు, నీతి సూక్తులు, మతపరమైన (బైబిల్)సూక్తులు వంటివి కూడా కుట్టేవారు. 

అయితే 18 వ  శతాబ్దం నాటికీ, ఈ వస్త్రాలను చక్కగా ఒక పధతిగా అందంగా కుట్టడం మొదలు పెట్టారు. 

తమ పేరు, కుట్లు-అల్లికల పేర్లు, కుట్టిన తేది వంటివి కూడా ఆ వస్త్రం పై కుట్టే వారు.

ఈ sampler మనం కూడా కుట్టి పెట్టుకోవచును. ఒకే కుట్టు లో రకరకాలైన పధతులు కాని, లేదా వివిధ కుట్లు కానీ ఒక వస్త్రంపై కుట్టుకోవచ్చు.  కొన్ని నేను కుట్టినవి మచ్చుకి:







ఇవన్ని ఒకే వస్త్రంపై కుట్టినవి. కానీ ఒకే సారి ఫోటో తీయలేక పోయాను. 

మీ...అనామిక....

No comments: