Sunday 8 April 2012

బొప్పాయి పండుతో బోటు

ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఉండాలను కుంటాము. కొత్తగా ఉంటే సరదాగా ఉంటుంది. అందుకేగా అన్నారు కొత్త ఒక వింత పాత ఒక రోత అని.

మనం ఇంట్లో పార్టీ చేసుకున్నప్పుడు కానీ డిన్నర్లకి ఎవరి నైనా పిలిచినప్పుడు కాని ఇల్లు ఎలాగో అలంకరిస్తాం. టేబులు,  పదార్ధాలూ కూడా అందంగా చూడ చక్కగా ఉంటే బాగుంటుంది కాదు. 

పదార్ధాలు చక్కగా రుచిగా వండడమే కాదు వాటిని వడ్డించటం కూడా ఒక కళ. 

బొప్పాయి పండు తో బోటు చేసి చూడండి:
  • ఒక బొప్పాయి పండు కొద్దిగా కోలగా కానీ పొడువుగా కాని ఉన్నది తీసుకోండి 
  • దాన్నిని నిలువునా సరిగ్గా మధ్యకు రెండుగా కోయండి
  • లోపలి గింజలను తీసివేయండి
  • ఒక భాగం చెక్కు తీసి ముక్కలు చేసి పెట్టుకోండి లేదా స్కూపర్ (చిన్న గరిటె)  ఉంటే గుండ్రంగా బంతుల లాగా చేసి పెట్టుకోండి 
  • రెండోవ భాగం సర్వ్ చేసే పళ్ళెం ఏదైనా అందంగా కాంట్రాస్ట్ రంగులో కానీ లేదా గాజుది తీసుకుని అందులో ఈ ముక్క కదలకుండా నిలబడుతుందా లేదా చూసుకోండి. 
  • లేదంటే క్రింది భాగం చదునుగా ఉండేందుకు కొద్దిగా  చెక్కి  ముక్కను తీసి వేయండి. మీ బోట్ తయారు అయినట్లే 
  • ఇప్పుడు మీరు ఈ బోటుని, ముక్కలను ఫ్రిజ్జిలో ఉంచి సర్వ్ చేసే టప్పుడు బోటులో ముక్కలను నింపి పళ్ళెం లో పెట్టి టేబుల్ పై అమర్చండి.
  • కేవలం బొప్పాయి ముక్కలే కాక ఇతర పళ్ళ ముక్కలను కానీ, ఫ్రూట్ సలాడ్ ను కానీ నింపి అమర్చ వచ్చు. 

ఖర్చు లేదు ఎక్కువ శ్రమా లేదు కదూ...



మీ...అనామిక....

No comments: