Monday 9 April 2012

వెనుక కుట్టు - Back Stitch-5

Triple Back Stitch  or  Hungarian Stitch 

ఇది కూడా ఈ కుటుంబానికి చెందినది. దీనిలో మూడు వరుసలో కుట్లు వస్తాయి.

కుట్టు ని మధ్య గీత నుండి ప్రారంభించాలి. 
 A  నుండి B కి ఒక కుట్టు.
 పైన C నుండి D  కి.
 మల్లి క్రింద E  నుండి F కి. తిరిగి B  దగ్గెర నుండి. 
ఇలా ప్రతిసారి మధ్య గీత నుండి మొదలు పెట్టి పైన క్రింద కుట్టాలి. అంతకు మునుపు ముగించిన చోటునుండి కుట్టాలి. 
 కుట్టు ఇలా కనిపించాలి. 
వెనుక ఇలా క్రాస్ స్టిచ్చ్ లాగ రావాలి.

ముందుగా మ్యాటి బట్ట పై నేర్చుకుని తరువాత మామూలు బట్ట పై కుట్టవచ్చును. మాములు బట్ట పై కుట్టి నప్పుడు పెన్సిల్తో గీతలు గీసుకుని గని లేదా పైన నెట్ బట్ట ఉంచి కాని కుట్టు కో వచ్చు. 

ఈ కుట్టు ని దూరంగా, దగ్గెరగా లేదా మధ్యన ఎడం ఉంచీ, ఇలా రక రకాలుగా కుట్టు కోవచ్చు. ఇది బార్డర్ గా పనికి వచ్చే కుట్టు. లేదా వేరే కుట్ల తో కలిపి వెడల్పాటి  బార్డర్  కుట్ట వచ్చు. చీరె అంచులకు, చున్నిలకు, పిల్లల ఫ్రాక్, తువాళ్ళకు ఇలా దేని పై నైనా కుట్ట వచ్చు. 

దీనిని మళ్లీ Whipped, Threaded, Double Threaded, పేటర్న్ లాగా   కుట్ట వచ్చును. రంగు రంగు దారాలు వాడుకోవచ్చు. అవి మనం తరువాత చెప్పుకుందాం 

మరి మీరు ఈ కుట్లు సాధన చేస్తున్నారనుకుంటాను. 


మీ...అనామిక....

No comments: